ఇతడి పేరు వింటేనే బాలీవుడ్ గుండెల్లో గుబులు పుడుతోందట!
| రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ‘ఇండియాస్ గ్రేట్ కాన్‌మేన్’ జీవిత కథతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది. డిసెంబర్ 18న ప్రీమియర్ కానున్న ఈ సిరీస్‌లో సినీ ప్రముఖులతో అతడికి ఉన్న సంబంధాలు, సెలబ్రిటీలకు ఇచ్చిన ఖరీదైన బహుమతులు, జైలు నుంచే నడిపిన నెట్‌వర్క్‌పై ఎలాంటి వివరాలు వెల్లడిస్తారన్న ఆసక్తి నెలకొంది. అయితే సంబంధాలపై వచ్చిన ఆరోపణలను నిర్ధారిత వాస్తవాలుగా చూడకూడదు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 200 కోట్ల మనీలాండరింగ్ - దోపిడీ కేసు నిందితుడు `ఇండియాస్ గ్రేట్ కాన్ మేన్`గా పాపులరైన ఒక తమిళ తంబీ జీవిత కథ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ సరికొత్త డాక్యుమెంటరీ సిరీస్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అతడి జీవితకథతో రూపొందిన ఈ సిరీస్ ఈ ఏడాది డిసెంబర్ 18న ప్రీమియర్ కానుందనే ప్రకటన సర్వత్రా ఆసక్తికర చర్చకు తెర లేపింది. ప్రముఖ దర్శకద్వయం తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీలో ఇప్పటివరకు వార్తల్లో చూసిన వివరాలకు మించి సదరు కాన్ మేన్ నేపథ్యం, జైలు లోపలి నుంచే అతడు నడిపిన భారీ నెట్‌వర్క్ వెనుక ఉన్న విస్తుపోయే నిజాలను ఉన్నదున్నట్లుగా బయటపెట్టే ప్రయత్నం చేస్తుండటంతో పారిశ్రామిక వర్గాలతో పాటు, బీటౌన్‌లోని చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట.
ముఖ్యంగా ఈ డాక్యుమెంటరీలో ప్రముఖ సూపర్‌స్టార్‌కి సన్నిహితురాలైన అగ్ర కథానాయికతో ఇండియాస్ గ్రేట్ కాన్ మేన్‌కు ఉన్న సంబంధాన్ని ఏ విధంగా చూపించబోతున్నారనే దానిపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేసిన 200 కోట్ల దోపిడీ కేసులో అతడు అక్రమ సంపాదనతో సదరు ప్రముఖ కథానాయిక.. ఆమె కుటుంబ సభ్యులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడమే గాక, రకరకాలుగా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అయితే సదరు కాన్ మేన్ నేర చరిత్ర గురించి తనకు ఏమీ తెలియదని ఆ నటి వాదిస్తుండగా.. అతడి నేపథ్యం ఆమెకు ముందే తెలుసని ఈడీ వాదించిన ఘటనలు ఈ సిరీస్‌లో రక్తి కట్టించబోతున్నాయి.
అంతేకాదు ఈ కథలో మరో పాపులర్ ఐటమ్ గాళ్ పేరు కూడా గతంలో బలంగా వినిపించింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రూపంలో అసలు నిజాలు బయటకు వస్తుండటంతో.. కేవలం ఆ ఇద్దరు కథానాయికలేనా లేక ఇంకా ఎవరైనా గ్లామరస్ తారలు సదరు కాన్ మేన్ జీవితంలో ఉన్నారా? అనేది కూడా బయటపడుతుందేమోనన్న గుబులు ఇండస్ట్రీ వర్గాల్లో పుడుతోంది. మరోవైపు డాక్యుమెంటరీల విషయంలో నెట్‌ఫ్లిక్స్ రీసెర్చ్ ఎప్పుడూ పక్కాగా ఉంటుందని.. గ్లామర్ ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి నిజాలను ఇది బయటపెడుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నిన్నటిరోజున ఈ బయోపిక్ టైటిల్ లాంచ్ చేసిన తర్వాత ఇది అంతర్జాలంలో బిగ్ డిబేట్ గా మారింది. ఆ ఇద్దరు కథానాయికలతో పాటు స్కామర్ బుట్టలో పడిన ఇతర సెలబ్రిటీల గురించి కూడా ప్రస్థావిస్తారా? అనే చర్చా సాగింది. వీళ్ల కథలో మనీలాండరింగ్ అనే అంశం కూడా చాలా బలమైన వివాదానికి సంబంధించినది కావడంతో ఉత్కంఠ మరింత పెరుగుతోంది.
అయితే ఇలాంటి నిజాల్ని చెబుతూనే అదే సమయంలో ప్రధాన నిందితుడి పాత్రను సానుభూతితో చూపిస్తూ `వైట్‌వాష్` చేయకూడదని కొందరు కోరుతుండగా.. టాప్ హీరోకి సన్నిహితురాలైన ప్రముఖ కథానాయికతో పాటు మరో ఐటమ్ గాళ్ వంటి పాపులర్ తారల పేర్లు ఇందులో ముడిపడి ఉండటంతో ఈ సిరీస్ వారాల తరబడి టాప్-10 ట్రెండింగ్‌లో నిలవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒక జైలుపాలైన ఫార్మా దిగ్గజ కంపెనీ అధినేతను బయటకు రప్పించేందుకు అతడి సతీమణిని, కుటుంబాన్ని కూడా సదరు కాన్ మేన్ తెలివిగా 220 కోట్లకు బురుడీ కొట్టించాడనేదే ఒక సంచలనమైతే, ఇందులో అతడు ఏకంగా పీఎంవో పేషీ ఫోన్ నుంచే కాల్స్ చేసి వీళ్లను బెదిరించారనే ఆరోపణలు కూడా ఎంతో ఉత్కంఠను రేకెత్తించేవిధంగా ఉన్నాయి. దీంతో రాజకీయ దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు, సినీ సెలబ్రిటీల కథలు కూడా ఈ సిరీస్ లో బయటపడొచ్చనే వాదోపవాదాలు సోషల్ మీడియాల్లో హీటెక్కిస్తున్నాయి.
ఓవరాల్ గా ఈ సంచలన కేసులోని చీకటి కోణాలను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న ఈ డాక్యుమెంటరీ సిరీస్ ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో.. ఎవరి జాతకాలను బయటపెడుతుందో డిసెంబర్ 18న తేలనుంది.