• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Fashion >  విజయ్ దేవరకొండ స్టైలిష్...

విజయ్ దేవరకొండ స్టైలిష్ కి ప్రత్యేక గౌరవం.. ఎవరీ అమీ పటేల్?

| విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్టైలిస్ట్ అమీ పటేల్ రాసిన ‘ది యాక్సిడెంటల్ స్టైలిస్ట్’ పుస్తకాన్ని షేర్ చేయడంతో ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. విజయ్–రష్మిక పెళ్లి వేడుకల లుక్స్‌ను రూపొందించిన అమీ, ప్రియాంక చోప్రా, అలియా భట్ వంటి స్టార్లకు కూడా స్టైలిస్ట్‌గా పనిచేశారు. తన పుస్తకంలో ఫ్యాషన్ రంగంలో అనుభవాలు, తెరవెనుక విశేషాలను పంచుకున్నారు.

By - Madhu Reddy
Update: 2026-11-27 12:22 GMT

విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పుస్తకం గురించి పోస్ట్ చేయగానే, నెటిజన్లలో ఆసక్తి మొదలైంది. రష్మికతో విజయ్ పెళ్లి వేడుకలకు స్టైలింగ్ చేసిన అమీ పటేల్ రాసిన కొత్త పుస్తకం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. పెళ్లి లుక్స్ గురించి ఆమె చెప్పిన మాటలతో, అసలు ఎవరీ అమీ పటేల్ అని జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

అనుకోకుండా స్టైలిస్ట్ అయిన జర్నీ:

అమీ పటేల్ పేరులోనే 'యాక్సిడెంటల్ స్టైలిస్ట్' అని ఉంది. మొదట ఆమె అడ్వర్టైజింగ్ రంగంలో టైపోగ్రాఫర్‌గా పనిచేసేదట. అనుకోకుండా ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చి, 'ఎల్లే ఇండియా', 'హార్పర్స్ బజార్' లాంటి మ్యాగజైన్‌లకు క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఇప్పుడు ముంబైలో 'స్టైల్ బై అమీ' పేరుతో తన సొంత సంస్థను నడుపుతూ, ప్రియాంక చోప్రా, అలియా భట్, కత్రినా కైఫ్, జాన్వీ కపూర్ లాంటి పెద్ద స్టార్లకు స్టైలిస్ట్‌గా మారింది.

విజయ్, రష్మిక పెళ్లి లుక్స్ వెనుక ప్లాన్:

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విజయ్, రష్మిక పెళ్లి వేడుకల్లో వాళ్ల లుక్స్ చాలా ప్రత్యేకంగా కనిపించాయి. అప్పుడు అందరు వాళ్ళ డ్రెస్ కాస్ట్యూమ్ గురించే మాట్లాడుకున్నారు. తెలుగు, కొడవ సంప్రదాయాలు కలిసేలా అమీ పటేల్ పక్కాగా ప్లాన్ చేసింది. పెళ్లిలో అనామిక ఖన్నా డిజైన్ చేసిన ఐవరీ పంచెకట్టు, ఎర్ర అంగవస్త్రంతో విజయ్‌ను రాజకుమారుడిలా చూపించింది. ఇక సంగీత్ వేడుకలో ఫల్గుణి షేన్ పీకాక్ వెల్వెట్ జాకెట్, ఎమరాల్డ్ నగలతో మరో రేంజ్ లుక్ ఇచ్చింది. రిసెప్షన్‌లో కూడా మన వారసత్వం ఉట్టిపడేలా డిజైన్ చేయించింది.

తన పుస్తకంలో ఏం రాసింది?:

నవంబర్‌లో వచ్చిన తన ఆత్మకథ 'ది యాక్సిడెంటల్ స్టైలిస్ట్'లో తన కెరీర్ ఒడుదొడుకులు, నమ్మకం, ఫ్యాషన్ ప్రపంచంలో తాను నేర్చుకున్న విషయాలను రాసింది. స్టార్ హీరోయిన్లు, హీరోలతో పనిచేసేటప్పుడు జరిగే సరదా విషయాలు, కష్టాలను కూడా ఓపెన్‌గా పంచుకుంది. ఇక తాను స్టైల్ చేసిన అత్యంత గుర్తుండిపోయే వేడుకల్లో విజయ్-రష్మిక పెళ్లి కూడా ఉందని ఆమె చెప్పడంతో, విజయ్ కూడా తన బుక్‌ను స్టోరీలో షేర్ చేసి సపోర్ట్ ఇచ్చాడు.

తెరవెనుక కష్టానికి దక్కిన గుర్తింపు:

ఇక సినిమాల్లో, ఈవెంట్లలో హీరో హీరోయిన్లు ఎలా కనిపిస్తారో చూస్తాం కానీ, వాళ్లను అలా తీర్చిదిద్దే వాళ్ల కష్టం బయటకు పెద్దగా కనిపించదు. ఇక అమీ పటేల్ తన పుస్తకంతో ఆ తెరవెనుక ప్రపంచాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. విజయ్ ఇచ్చిన ఈ చిన్న సపోర్ట్ ఆమె కష్టానికి దక్కిన మంచి గౌరవం..

Tags:    
  • vijaydeverakonda 
  • rashmika 
  • amipatel 
  • theaccidentalstylist 
  • celebrityfashion 

Similar News

తమన్నా టాలెంట్ కి ఆడియన్స్ ఫిదా.. భలే కలిసొస్తోందే?

2026-11-19 07:55 GMT

పండుగ వేళ పురుషుల ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్స్ & రూల్స్

2026-11-07 08:57 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

Copyright @2026

Powered by Blink CMS