• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజకీయాలపై మ‌క్క‌ల్...

రాజకీయాలపై మ‌క్క‌ల్ సెల్వ‌న్ మ‌న‌సులో మాట‌!

| తనకు ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని విజయ్ సేతుపతి స్పష్టం చేశారు. పేరు, అధికారం కోసం కాకుండా సమాజానికి సేవ చేయాలనే నిజమైన తపన ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. సినిమాలే తన మొదటి ప్రాధాన్యతని, కొత్త కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’తో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-27 10:30 GMT

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానులున్న బిగ్ స్టార్. హీరో అయినా? విల‌న్ అయినా? ఇంకెలాంటి పాత్ర అయినా? అందులో అభిన‌యించాలంటే సేతుప‌తి ఉండాల్సిందే అంటారు. అత‌డి ట్యాలెంట్ చూసి ప్యూచ‌ర్ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ లా ఎదుగుతాడ‌ని కెరీర్ ఆరంభంలోనే మాట్లాడుకున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా రాజకీయాలపై సేతుప‌తి మనసులో మాటను బయటపెట్టారు. చాలామంది నటులు సినిమాల్లో రాణించిన తర్వాత పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తుంటారు.

కానీ విజయ్ సేతుపతి ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని సినిమాలే మొదటి ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. ఇతరుల కోసం కాకుండా మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలనే తపన ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. పేరు కోసమో? అధికారం కోసమో? పాలిటిక్స్‌లోకి వెళ్లే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు. సమాజంలోని సమస్యలపై స్పందించడం వేరు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం వేరు అని సేతుపతి అన్నారు.

సాధారణ పౌరుడిగా తనకు నచ్చిన విషయాలపై మాట్లాడే హక్కు ఎప్పుడూ ఉంటుందన్నారు. సినిమా రంగంలో ఇంకా చేయడానికి చాలా ఉందని కొత్త కథలు, కొత్త పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. తమిళనాడులో సినీ తారల రాజకీయ ఎంట్రీ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఈ క్రమంలో విజయ్ సేతుపతి కూడా భవిష్యత్తులో పార్టీ పెడతారా లేక ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తారా అనే ఊహాగానాలు గతంలో చాలాసార్లు వచ్చాయి. వాటన్నింటికీ సేతుప‌తి మాటలతో చెక్ పెట్టారు. తాను ఎవరికీ పోటీ కాదని.. తన దారి తనదేనని చెప్పకనే చెప్పారు.

ఇక విజ‌య్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆరేడు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అందులో ఒక‌టి పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో అత‌డు హీరోగా న‌టిస్తోన్న `స్ల‌మ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` ఒక‌టి. ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంది. కానీ అనివార్య కార‌ణాల‌తో రిలీజ్ వాయిదా ప‌డుతోంది. ఇంకా `ట్రైన్`, `పోకెట్ న‌వ‌ల్`, `ఇంజి వెల్ల‌మ్`, `అర్స‌న్` చిత్రాల్లో న‌టిస్తున్నారు.

Tags:    
  • vijaysethupathi 
  • vijaysethupathipolitics 
  • tamilcinema 
  • slumdog33templeroad 

Similar News

గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ ఇలా అయ్యాడేంటో..!

2026-11-27 09:30 GMT

ఆ సూపర్ హిట్ సీక్వెల్‌కి రిలీజ్ తిప్పలు తప్పవా?

2026-11-27 09:30 GMT

27 దేశాల్లో రికార్డ్..రామాయణం విశ్వవ్యాప్త కలెక్షన్లు!

2026-11-27 09:30 GMT

బ్లాక్ అండ్ గోల్డ్ డ్రెస్‌లో మెరిసిన సోనాల్ చౌహాన్..

2026-11-27 09:30 GMT

హిట్ మ్యాన్ మ‌న‌సులో సూప‌ర్ స్టార్లు వీళ్లే!

2026-11-27 08:30 GMT

హై-వోల్టేజ్ సినిమాలపై ప్రేక్షకుల్లో విసుగు!

2026-11-27 07:57 GMT

ఇతడి పేరు వింటేనే బాలీవుడ్ గుండెల్లో గుబులు పుడుతోందట!

2026-11-27 07:30 GMT

నితిన్ ఈ సారి కొట్టేలా ఉన్నాడు, కారణం ఇదే

2026-11-27 07:15 GMT

జూబ్లీహిల్స్ లో ఇల్లు అమ్మేసి విదేశాల‌కు అనుష్క!

2026-11-27 06:41 GMT

'భోగి' మూవీ రివ్యూ

2026-11-27 06:37 GMT

ఈNఈ కి సీక్వెల్ అడ్వాంటేజ్ కలిసి వచ్చింది

2026-11-27 06:37 GMT

Copyright @2026

Powered by Blink CMS