• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌లైకా అరోరాతో బ్రేక‌ప్...

మ‌లైకా అరోరాతో బ్రేక‌ప్ అయ్యాక ఈ న‌టితో నిండా మునిగాడు!

| మలైకా అరోరాతో బ్రేకప్ తర్వాత అర్జున్ కపూర్‌ సాహిబా బాలితో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గురుపురబ్ సందర్భంగా సాహిబా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాము ప్రేమలో ఉన్నట్లు ఇద్దరూ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By - Sivaji Kontham
Update: 2026-11-27 17:13 GMT

కొన్నేళ్ల పాటు నటి కం డ్యాన్సర్ మలైకా అరోరాతో యువ నటుడు అర్జున్ కపూర్ ప్రేమాయణం.. ఆ తర్వాత బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే. అయితే మలైకా నుంచి విడిపోయినా ఇప్పటికీ త‌న‌తో స్నేహంగానే ఉంటున్న బోనీ కపూర్ తనయుడు అర్జున్.. ఇటీవ‌ల ఓ యువ నటితో నిండా ప్రేమలో మునిగిపోయాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ యువ నటి ఎవరా? అంటూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఆరాలు కొన‌సాగుతున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

న‌టుడిగా కెరీర్ ప‌రంగా అంతంత మాత్రంగానే ఉన్నా అర్జున్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ ని మాత్రం బిందాస్ గా ఆస్వాధిస్తున్నాడు. అత‌డి వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. నటి, స్పోర్ట్స్ ప్రెజెంటర్, కంటెంట్ క్రియేటర్ అయిన సాహిబా బాలితో అర్జున్ క‌పూర్ డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు ఇటీవల గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా గురుపురబ్ వేడుకల సందర్భంగా సాహిబా బాలి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అత‌డితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడం ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. ఆ ఫోటోకు, ``అతడి వాటా ప్రసాదం కూడా నేనే తినేశాను... హ్యాపీ గురుపురబ్`` అంటూ ఈ భామ‌ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాల స్పందనలు వస్తున్నాయి. వీరిద్దరూ తమ బంధాన్ని పరోక్షంగా `సాఫ్ట్ లాంచ్` చేశారంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు. నిజానికి అర్జున్, సాహిబా కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్ సందర్భంగా కూడా వీరిద్దరూ స్టాండ్స్‌లో పక్కపక్కనే కూర్చుని కనిపించడం అప్పట్లో వార్తల్లో నిలిచింది.

ఇక సాహిబా బాలి విషయానికొస్తే.. కార్పొరేట్ రంగం నుంచి మీడియా, నటనలోకి వచ్చిన ఈ భామ డియర్ మాయ, లైలా మజ్ను, బార్డ్ ఆఫ్ బ్లడ్, తనావ్, అమర్ సింగ్ చంకీలా వంటి ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే `షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 4`కు కో-హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. గతంలో తాను సింగిల్‌గానే ఉన్నానని, కుల్లుతో తన కెమిస్ట్రీ కేవలం ప్రొఫెషనల్-స్నేహపూర్వకమైనదేనని సాహిబా స్పష్టం చేశారు. మరోవైపు అర్జున్ కపూర్ గతంలో మలైకా అరోరాతో సుదీర్ఘ కాలం రిలేషన్‌షిప్‌లో ఉండి 2024లో విడిపోయిన విషయం తెలిసిందే.

సినిమాల పరంగా చూస్తే..ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో వచ్చిన `మేరే హస్బెండ్ కీ బీవీ` రొమాంటిక్ కామెడీ చిత్రంలో అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించారు. భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం తర్వాత ఇప్పుడు సాహిబాతో వస్తున్న వార్తల నేపథ్యంలో వీరి బంధంపై అధికారిక స్పష్టత ఏమైనా వస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    
  • arjunkapoor 
  • sahibabali 
  • arjunkapoordating 
  • datingrumours 
  • bollywood 

Similar News

వారణాసి.. కథలోనే ఇన్ని సర్‌ప్రైజ్‌లంటే..

2026-11-27 17:30 GMT

ఉద్యోగులే రీప్లేస్ చేస్కుంటున్నారు.. AI పై ఆర్జీవీ

2026-11-27 17:14 GMT

హాట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్!

2026-11-27 17:13 GMT

కమర్షియల్ లెక్కలు లేకుండానే 'అలియాస్ రుక్మిణి': దీప్తి గంటా

2026-11-27 17:13 GMT

టాలీవుడ్ లో ఆఫియా పేరు బలంగా వినిపించబోతుందా?

2026-11-27 17:13 GMT

ఏడాది మొత్తం మహేష్ బాబు ఖాళీగా ఉండాల్సిందేనా?

2026-11-27 17:12 GMT

తెలుగు టైగర్స్‌కు రీమేక్ ప్లాన్.. క్లిక్కయ్యేనా?

2026-11-27 16:30 GMT

డాక్యుమెంటరీని ఆపాలంటూ నెట్‌ఫ్లిక్స్‌ కి సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ కోర్టు నోటీసులు

2026-11-27 15:30 GMT

ఆ ఇద్ద‌రు డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నారా?

2026-11-27 14:30 GMT

కేవలం 55రోజుల్లోలో ముగించేసే పెద్ద హీరో.. వింటున్నారా టాలీవుడ్ టాప్‌ హీరోలు?

2026-11-27 13:30 GMT

మెగాస్టార్ క్లాసిక్ టైటిల్ తో యంగ్ హీరో.. వెరైటీగా 'రుస్తుం' గ్లింప్స్

2026-11-27 12:46 GMT

Copyright @2026

Powered by Blink CMS