• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమర్షియల్ లెక్కలు...

కమర్షియల్ లెక్కలు లేకుండానే 'అలియాస్ రుక్మిణి': దీప్తి గంటా

| నితిన్‌ నటించిన ‘అలియాస్‌ రుక్మిణి’ డిసెంబర్‌ 4న విడుదల కానుంది. కథలోని ఎమోషన్స్‌ నచ్చి ఈ సినిమాను నిర్మించినట్లు నిర్మాత దీప్తి గంటా తెలిపారు. నితిన్‌ ఎంపికను నానినే సూచించారని, సినిమా చూసి ఆయన సంతోషించారని చెప్పారు. 2 గంటల 17 నిమిషాల రన్‌టైమ్‌తో వస్తున్న ఈ చిత్రంపై ఆమె ధీమా వ్యక్తం చేశారు.

By - M Prashanth
Update: 2026-11-27 17:13 GMT

నితిన్ హీరోగా నటించిన అలియాస్ రుక్మిణి డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మించిన ఈ సినిమాకు దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై నిర్మాత దీప్తి గంటా మంచి నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా నితిన్ కృష్ణ పాత్రతో పాటు సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయని చెప్పారు. లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడిన దీప్తి సినిమా విశేషాలతో పాటు నాని ఇన్వాల్వ్‌మెంట్ గురించి కూడా వివరించారు.

అలియాస్ రుక్మిణి కథ తనకు మొదట చదివినప్పుడే నచ్చిందని దీప్తి తెలిపారు. అప్పటికి మురళీకాంత్ దండోరా దర్శకుడనే విషయం కూడా తెలియదన్నారు. తర్వాత రెండున్నర గంటల పాటు ఇచ్చిన నరేషన్‌ను ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పారు. ముఖ్యంగా కథలోని ఎమోషన్స్, ముగింపు తనను బాగా ఆకట్టుకున్నాయని వివరించారు. ఇక ఈ కథకు నితిన్ అయితే సరిపోతారని నానినే సూచించారట. నితిన్‌కు కథ చెప్పగానే వెంటనే అంగీకరించారని తెలిపారు.

నాని ఇన్వాల్వ్‌మెంట్ గురించి కూడా దీప్తి క్లారిటీ ఇచ్చారు. ముందుగా తనకు నచ్చిన కథను నానికి వినిపిస్తానని, నానికి కూడా నచ్చితే ప్రాజెక్ట్ మొదలుపెడతామని చెప్పారు. గతంలో కోర్ట్ సినిమాను కూడా ఇదే విధంగా ఓకే చేశారట. అయితే కథ ఫైనల్ అయ్యాక నాని షూటింగ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరని తెలిపారు. సినిమా పూర్తయ్యాక చూసి అవసరమైతే సూచనలు ఇస్తారన్నారు. అలియాస్ రుక్మిణిని ఇప్పటికే చూసిన నాని చాలా సంతోషంగా ఉన్నారని, ప్రస్తుతం బ్లడీ రోమియో షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ ప్రమోషన్స్‌కు సమయం కేటాయిస్తున్నారని చెప్పారు.

ఇక అలియాస్ రుక్మిణి టైటిల్ వెనుక కూడా కథలో కీలకమైన అంశం ఉందట. సినిమాలో కృష్ణ అనే వ్యక్తి రుక్మిణి పేరుతో రచనలు చేస్తుంటాడు. అసలు ఆ పేరునే ఎందుకు ఎంచుకున్నాడనేది కథలో ముఖ్యమైన భాగమని దీప్తి వివరించారు. దర్శకుడు మురళీకాంత్‌కు కథపై పూర్తి క్లారిటీ ఉందని, ఇండస్ట్రీలోని కమర్షియల్ లెక్కల కంటే తనకు నచ్చిన కథను తెరకెక్కించడానికే ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. సినిమాలోని పాత్రలు మనకు తెలిసిన వ్యక్తుల్లాగే సహజంగా ఉంటాయన్నారు. సాయికుమార్ పాత్ర కూడా అలాంటిదేనని, హీరోయిన్‌ను ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు.

సినిమా రన్‌టైమ్ రెండు గంటల 17 నిమిషాలని దీప్తి వెల్లడించారు. నితిన్ క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుందని చెప్పారు. విజయ్ అందించిన పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బలంగా నిలుస్తుందన్నారు. సెన్సార్ సమయంలో ఒక్క కట్ కూడా సూచించలేదని తెలిపారు. ఇక తమ సినిమాలు త్వరగా పూర్తవుతున్నట్లు కనిపించడానికి కారణం ముందస్తు ప్రణాళికేనని వివరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాకే షూటింగ్ మొదలుపెడతామని చెప్పారు. ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా కమర్షియల్ లెక్కలు వేసుకోలేదని కూడా స్పష్టం చేశారు.

డిసెంబర్ 4న నాగచైతన్య వృషకర్మ కూడా విడుదలవుతున్న నేపథ్యంలో పోటీ గురించి దీప్తిని ప్రశ్నించారు. రెండు సినిమాల జానర్స్ వేర్వేరని, డిసెంబర్‌లో ప్రేక్షకులు హాలిడే మూడ్‌లో ఉంటారు కాబట్టి రెండింటినీ ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ఆకాశంలో ఒక తార లాంటి సినిమాల్లో పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయినట్లే, అలియాస్ రుక్మిణిలోని పాత్రలు కూడా సినిమా చూసిన తర్వాత కొన్ని రోజుల పాటు గుర్తుంటాయని చెప్పారు. ఇక నిర్మాతగా కొనసాగుతూనే మళ్లీ దర్శకత్వం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రొడక్షన్ నుంచి కొంత విరామం తీసుకుని డైరెక్షన్ చేయాలనుకుంటున్న దీప్తి, తమ బ్యానర్‌లో కోర్ట్ ఫేమ్ జగదీశ్‌తో మరో సినిమా చేయనున్నట్లు తెలిపారు.

Tags:    
  • aliasrukmini 
  • nithiin 
  • nani 
  • aliasrukminimovie 
  • deepthiganta 

Similar News

వారణాసి.. కథలోనే ఇన్ని సర్‌ప్రైజ్‌లంటే..

2026-11-27 17:30 GMT

ఉద్యోగులే రీప్లేస్ చేస్కుంటున్నారు.. AI పై ఆర్జీవీ

2026-11-27 17:14 GMT

హాట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్!

2026-11-27 17:13 GMT

మ‌లైకా అరోరాతో బ్రేక‌ప్ అయ్యాక ఈ న‌టితో నిండా మునిగాడు!

2026-11-27 17:13 GMT

టాలీవుడ్ లో ఆఫియా పేరు బలంగా వినిపించబోతుందా?

2026-11-27 17:13 GMT

ఏడాది మొత్తం మహేష్ బాబు ఖాళీగా ఉండాల్సిందేనా?

2026-11-27 17:12 GMT

తెలుగు టైగర్స్‌కు రీమేక్ ప్లాన్.. క్లిక్కయ్యేనా?

2026-11-27 16:30 GMT

డాక్యుమెంటరీని ఆపాలంటూ నెట్‌ఫ్లిక్స్‌ కి సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ కోర్టు నోటీసులు

2026-11-27 15:30 GMT

ఆ ఇద్ద‌రు డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నారా?

2026-11-27 14:30 GMT

కేవలం 55రోజుల్లోలో ముగించేసే పెద్ద హీరో.. వింటున్నారా టాలీవుడ్ టాప్‌ హీరోలు?

2026-11-27 13:30 GMT

మెగాస్టార్ క్లాసిక్ టైటిల్ తో యంగ్ హీరో.. వెరైటీగా 'రుస్తుం' గ్లింప్స్

2026-11-27 12:46 GMT

Copyright @2026

Powered by Blink CMS