• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరోతో క‌ళావ‌తి లిప్...

ఆ హీరోతో క‌ళావ‌తి లిప్ లాక్!

| విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘రౌడీ జనార్దన’ సినిమాపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య లిప్‌లాక్ సీన్ ఉంటుందనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై కీర్తి సురేష్ లేదా చిత్రబృందం ఇప్పటివరకు స్పందించలేదు. రవికిరణ్ కోల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-27 22:30 GMT

కీర్తీ సురేష్ అలియాస్ మ‌హాన‌టి జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కెరీర్ ప్రారంభం నుంచి కొన్ని పరిమితులు పెట్టుకుని సంప్రదాయ పాత్రలు.. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకే మొగ్గు చూపింది. `మహానటి` తర్వాత అమ్మ‌డి ఇమేజ్ మరో స్థాయికి చేర‌డంతో గ్లామర్ రోల్స్‌పై ఏమాత్రం పాజిటివ్ గా క‌నిపించ‌లేదు. అయితే కాలానికి అనుగుణంగా కీర్తి పాత నిబంధనలను సడలించికుంటూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోల దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రౌడీ జనార్దన` చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ- కీర్తి మధ్య ఓ లిప్ లాక్ సన్నివేశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. గతంలో ఇద్ద‌రు `మహానటి` చిత్రంలో న‌టించినా? పూర్తిస్థాయి జంటగా నటిస్తున్న తొలి సినిమా ఇదే . సాధారణంగా విజయ్ దేవరకొండ సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలకు.. ఘాటైన కెమిస్ట్రీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ కథలోనూ హీరో హీరోయిన్ల మధ్య బలమైన ఎమోషన్‌తో పాటు రొమాంటిక్ ట్రాక్ చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

కథ డిమాండ్ మేరకు సన్నివేశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కీర్తి సురేష్ కూడా లిప్ లాక్ సీన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కీర్తి ఎంపిక చేసుకుంటున్న పాత్రల్లో చాలా మార్పు కనిపిస్తోంది. ఒకప్పటిలా హోమ్లీ పాత్రలకే పరిమితం కాకుండా గ్లామర్ విషయంలోనూ హద్దులు చెరిపేస్తూ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నంలో భాగంగానే అమ్మ‌డు బోల్డ్ నిర్ణయాలు తీసుకుం టున్నారా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

`రౌడీ జనార్దన` పై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో విజయ్ సరికొత్త మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. కీర్తి సురేష్ పాత్ర కూడా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. అయితే లిప్ లాక్ వార్తలపై చిత్రబృందం నుంచి గానీ, కీర్తి సురేష్ వైపు నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఈ ప్రచారమే నిజమైతే వెండితెరపై కీర్తి సురేష్ తొలిసారి ఇలాంటి సన్నివేశంలో కనిపించడం అభిమానులకు సర్‌ప్రైజ్ లాంటిదే.

Tags:    
  • keerthysuresh 
  • vijaydeverakonda 
  • rowdyjanardhana 
  • tollywood 

Similar News

హాలీవుడ్ లో తెలుగు న‌టుల‌కు ఛాన్స్!

2026-11-27 19:30 GMT

ప్రభాస్‌కు ఫిట్‌నెస్ టెన్షన్ తగ్గినట్లే!

2026-11-27 18:30 GMT

వారణాసి.. కథలోనే ఇన్ని సర్‌ప్రైజ్‌లంటే..

2026-11-27 17:30 GMT

ఉద్యోగులే రీప్లేస్ చేస్కుంటున్నారు.. AI పై ఆర్జీవీ

2026-11-27 17:14 GMT

హాట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్!

2026-11-27 17:13 GMT

మ‌లైకా అరోరాతో బ్రేక‌ప్ అయ్యాక ఈ న‌టితో నిండా మునిగాడు!

2026-11-27 17:13 GMT

కమర్షియల్ లెక్కలు లేకుండానే 'అలియాస్ రుక్మిణి': దీప్తి గంటా

2026-11-27 17:13 GMT

టాలీవుడ్ లో ఆఫియా పేరు బలంగా వినిపించబోతుందా?

2026-11-27 17:13 GMT

ఏడాది మొత్తం మహేష్ బాబు ఖాళీగా ఉండాల్సిందేనా?

2026-11-27 17:12 GMT

తెలుగు టైగర్స్‌కు రీమేక్ ప్లాన్.. క్లిక్కయ్యేనా?

2026-11-27 16:30 GMT

డాక్యుమెంటరీని ఆపాలంటూ నెట్‌ఫ్లిక్స్‌ కి సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ కోర్టు నోటీసులు

2026-11-27 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS