• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Reviews >  'హై' మూవీ రివ్యూ

'హై' మూవీ రివ్యూ

By - Tupaki Desk
Update: 2026-11-28 04:20 GMT

నటీనటులు: ఎస్.కృష్ణ - అనన్య శర్మ - కృష్ణ కమల్ - పల్లవి డోరా - సాయికృష్ణ - రాజా రవీంద్ర - సత్య - హర్షవర్ధన్ తదితరులు

ఛాయాగ్రహణం: మల్లు నాయక్ - సునీల్ రెడ్డి

సంగీతం: వికాస్ బడిస

నిర్మాత: హరీష్ పెద్ది - ఎస్.కృష్ణ

రచన-దర్శకత్వం: ఎస్.కృష్ణ

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి సన్నిహితుడు.. రైటింగ్ - ప్రొడక్షన్లో మంచి అనుభవం ఉన్న ఎస్.కృష్ణ హీరోగా.. దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం.. హై. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ఫేమ్ అనన్య శర్మ ఇందులో ముఖ్య పాత్ర పోషించింది. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం.

కథ:

గుడివాడ రాయుడు (ఎస్.కృష్ణ) పెద్ద కెమెరామన్ కావాలని ఆశపడి.. ఆ కోరిక నెరవేరక తాగుడుకు బానిసైన కుర్రాడు. అతడి గొంతులో మందు చుక్క పడనిదే పూట గడవని స్థితిలో ఉన్న అతడి దగ్గరికి వరంగల్ అమ్మాయి లావణ్య (అనన్య శర్మ) వస్తుంది. తనను చంపితే 8 లక్షల డబ్బు ఇస్తా అని ఆశ చూపిస్తుంది. ఐతే తన గతం తెలుసుకుని ఆమెను చంపడానికి రెడీ అవుతాడు. ఈ ఇద్దరితో పాటు.. బయటికి వెళ్ళి ఉద్యోగం చెయ్యాలనే ఆశ ఉన్నప్పటికీ కుటుంబ కట్టుబాట్ల వల్ల ఇంటికే పరిమితం అయిపోయిన సఫీనా (పల్లవి డోరా).. ఒక వైపు ఆమెను ప్రేమిస్తూనే ఇంకోవైపు బెట్టింగులకు బానిస అయిన హైదర్ (సాయికృష్ణ).. వీళ్ళందరి జీవితాలు కొన్ని ఘటనల వల్ల ఇంటర్ లింక్ అయి మలుపులు తిరుగుతాయి. ఈ ప్రయాణంలో వీరిలో వచ్చిన మార్పేంటి.. వీళ్ళ లక్ష్యాలు నెరవేరాయా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

వేర్వేరు సమస్యలతో బాధ పడే కొందరు వ్యక్తులు.. వారి ఇబ్బందులను చూపిస్తూ.. వాళ్లందరికీ కలిపి ఒక క్రిటికల్ సిచువేషన్ క్రియేట్ చెయ్యడం.. ఆ సిచువేషన్లోనే ఆ వ్యక్తుల్లో పరివర్తన కలిగి తమ సమస్యలకు పరిష్కారం వెతుక్కుని తమ జీవితాలను బాగు చేసుకోవడం... ఈ తరహా స్లైస్ ఆఫ్ లైఫ్ ఆంథాలజీ కథలను వేదం సహా పలు చిత్రాల్లో చూశాం. హై కూడా అలాంటి సినిమానే. ఇలాంటి కథలు ఎన్నిసార్లయినా తీయొచ్చు. ప్రధాన పాత్రలు.. సిచువేషన్లు రిలేట్ అయ్యేలా ఉండడం.. ఎమోషన్ సరిగ్గా కుదరడం కీలకం. కానీ హై అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమాలో ఇవన్నే లో లెవెల్ లోనే ఉండడమే సమస్య. ఒక్క ప్రధాన పాత్రను కూడా సరిగా తీర్చిదిద్దకపోవడం.. చెప్పాలనుకున్న పాయింట్ కూడా కూడా బలంగా లేకపోవడం.. డల్ నరేషన్ వల్ల ఈ సినిమా కోరుకున్న హై ఇవ్వలేకపోయింది.

హై మూవీలో హీరో ఒక టాలెంటెడ్ కెమెరామన్ అట. అతను పని చేసిన సినిమాకు తనిచ్చిన వర్క్ బాలేదు అన్నారట. అంతే అతను.. మందు లేకుండా ఒక్క పూట కూడా ఉండలేని స్థితికి చేరుకుంటాడట. ఇదంతా పొడి పొడిగా మూడు ముక్కల్లో సన్నివేశాల మధ్యలో చెప్పిస్తారంతే. హీరో ఎంత టాలెంటెడ్.. అతడికి ఎలాంటి అన్యాయం జరిగింది.. అతను అలాంటి దారుణమైన స్థితికి ఎందుకు చేరుకున్నాడు అన్నది దృశ్య రూపంలో హృద్యంగా చూపించనపుడు ఆ పాత్రతో ఎలా ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడుతుంది? దాంతో ఎలా ట్రావెల్ చేస్తాం? హీరో మాత్రమే కాదు.. దాదాపుగా ప్రతి ముఖ్య పాత్రదీ ఇదే వరస. ఎవరి సమస్యా అంత పెద్దదిగా అనిపించదు. ఎవరి కష్టమూ కదిలించదు. దీంతో వాళ్ళలో వచ్చే రియలైజేషన్ కానీ.. వాళ్ళ కష్టాలు తీరినప్పుడు కానీ ఎమోషనల్ గా అనిపించదు.

హై కాన్సెప్ట్ పరంగా ఆసక్తికరమే. ఇందులో కొన్ని ఎంగేజింగ్ సీన్లు ఉన్నాయి. కథతో సంబంధం లేకుండా వచ్చి పడే బుల్లిరాజు పాత్ర ఒక సీన్లో మంచి వినోదం అందిస్తుంది. అలాగే అనన్య క్యారెక్టర్ ఎవాల్వ్ అయ్యే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. చివర్లో సినిమా కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. ఐతే ఇలాంటి కొన్ని సీన్లు మొత్తం సినిమా మీద అభిప్రాయాన్ని మార్చవు. పాత్రల పరిచయమే సరిగా లేకపోవడం.. ఆరంభ సన్నివేశాలే నీరసంగా అనిపించడం.. నరేషన్ కూడా డల్లుగా సాగడంతో ఇది టైటిల్ కు న్యాయం చేసే సినిమాలా అనిపించదు. కాన్సెప్ట్ పరంగా రెగ్యులర్ సినిమా కాదు అన్నమాటే కానీ.. హై కొత్తగా ఆఫర్ చేసేదేమీ ఉండదు.

నటీనటులు:

ఎస్.కృష్ణ దర్శకుడిగానే కాదు నటుడిగానూ డల్ అనే ఫీలింగ్ యే కలిగిస్తాడు. రాయుడు పాత్రకు సరిపడే లుక్ తో కనిపించినప్పటికీ ఆ పాత్ర మరీ సాధారణంగా ఉండి.. నీరసం తెప్పించేలా సాగుతుంది. లీడ్ క్యారెక్టరే ఇలా అయ్యేసరికి ప్రేక్షకుల ఉత్సాహమంతా నీరుగారిపోతుంది. అనన్య శర్మ సినిమాకు ఆకర్షణ అని చెప్పొచ్చు. సినిమాలో అంతో ఇంతో ఎంగేజ్ చేసేది తనే. చాలావరకు అమాయకత్వంతో ఆకట్టుకునే అనన్య.. చివర్లో భిన్న కోణాన్ని చూపించి అలరిస్తుంది. ఆమెపై టాలీవుడ్ ఒక లుక్కెయ్యాల్సిందే. సఫీనా పాత్ర చేసిన పల్లవి డోరా కూడా బాగానే చేసింది. కమల్ కృష్ణలో మంచి కామెడీ టైమింగ్ ఉంది కానీ తనను సరిగా వాడుకోలేదు. సాయికృష్ణ పర్వాలేదు. సత్య.. అభినవ్ గోమటం లాంటి పేరున్న నటులు సినిమాలో నామమాత్రంగా ఉన్నారు. హర్షవర్ధన్.. మురళీధర్ గౌడ్ కూడా అంతే. వడ్లమాని శ్రీనివాస్ విలనీ పెద్దగా వర్కవుట్ కాలేదు.

సాంకేతిక వర్గం:

'హై'లో టెక్నికల్ అంశాలు ఒక మోస్తరుగా అనిపిస్తాయి. వికాస్ బడిస థ్రిల్లర్ సినిమా శైలికి తగ్గ స్కోరే ఇచ్చాడు కానీ.. చాలా చోట్ల సైలెన్స్ డామినేట్ చేసింది. అసలే డల్ సీన్లు దానికితోడు బీజీఎం కూడా అలాగే సాగడంతో ఊపు రాదు. ఐతే ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. మల్లు నాయక్.. సునీల్ రెడ్డి కలిసి అందించిన సినిమాటోగ్రఫీ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఈ చిత్రానికి హీరో - నిర్మాత కూడా అయిన రైటర్ కం డైరెక్టర్ ఎస్.కృష్ణ దగ్గర కొన్ని మంచి ఆలోచనలున్నా వాటిని తెరపైకి సరిగ్గా తీసుకురాలేకపోయాడు. నరేషన్ ఏదో డిఫరెంటుగా ట్రై చేద్దాం అనుకున్నాడు కానీ అది కాస్తా నీరసం తెప్పించింది.

చివరగా: హై కాదు.. లో

రేటింగ్ - 2/5

Tags:    
  • highreview 
  • highmoviereview 
  • highfilmreview 
  • ananyasharma 
  • skrishna 

Copyright @2026

Powered by Blink CMS