వృషకర్మ Vs అలియాస్ రుక్మిణి... రెండూ చాలా స్పెషల్
| డిసెంబర్ 4, 2026న నాగ చైతన్య 'వృశకర్మ', నితిన్ 'అలియాస్ రుక్మిణి' సినిమాలు ఒకేరోజు విడుదల కానున్నాయి. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన వృశకర్మ హారర్ థ్రిల్లర్‌గా వస్తుండగా, మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కించిన అలియాస్ రుక్మిణి కామెడీ, ఎమోషన్స్‌తో అలరించనుంది. భిన్నమైన జానర్లలో వస్తున్న ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ పోటీపై ఆసక్తి నెలకొంది.
క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాల కంటే ముందు అందరి దృష్టిని ఇప్పుడు రెండు సినిమాలు ఆకర్షిస్తున్నాయి. అవే నాగ చైతన్య నటించిన వృశకర్మ ఒకటి కాగా, రెండోది నాని సమర్పణలో నితిన్ హీరోగా రూపొందిన 'అలియాస్ రుక్మిణి'. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి ఒకే రోజు రాబోతున్నాయి. రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏ సినిమా బలం ఎంత అనే చర్చ మొదలైంది. రెండు సినిమాలకు కలిసి వచ్చే అంశాలు, రెండు సినిమాలకు ప్రధానంగా ఆకర్షిస్తున్న పాయింట్స్ చాలానే ఉన్నాయి. కనుక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హోరా హోరీగా తలబడటం ఖాయం అని, రెండు సినిమాలకు కచ్చితంగా డీసెంట్ కలెక్షన్స్ నమోదు కావడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాగ చైతన్య వృశకర్మ సినిమాతో...
నాగ చైతన్య వృశకర్మ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. ఈయన గత చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, అదే తరహా థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో, హర్రర్ సీన్స్‌తో వృశకర్మను రూపొందించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను చూస్తే సినిమాపై కచ్చితంగా ఆసక్తి కలుగుతుంది. అందుకే ఈ సినిమాను చూడాలని తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా హర్రర్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ సినిమాకు అన్ని విధాలుగా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. అంతే కాకుండా ఏ రకంగా చూసినా కూడా మంచి శకునములు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నాగ చైతన్య గత చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ ను ఈ సినిమా దక్కించుకోవడం ఖాయమని బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
నితిన్ అలియాస్ రుక్మిణి సినిమాతో...
వృశకర్మకు ఏమాత్రం తగ్గకుండా నితిన్ హీరోగా నటించిన 'అలియాస్ రుక్మిణి' సినిమా ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా మొదటి నుంచి ఉన్న అంచనాలు, ఊహలను తారు మారు చేస్తూ, మొత్తం తలకిందులు చేస్తూ ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ సినిమా ఉండబోతుందని, అంతే కాకుండా ఈ సినిమాలో మనసుకు హత్తుకునే ఎమోషన్ సీన్స్ సైతం ఉండబోతున్నాయని ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. నితిన్ నుంచి చాలా కాలం నుంచి సాలిడ్ హిట్ రాలేదు. కనుక ఈ సినిమాతో ఆయన ఆ హిట్‌ను కొట్టడం ఖాయం అని అంతా నమ్ముతున్నారు. పైగా ఈ సినిమాకు హిద్ మూవీ దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే విశ్వాసం అందరిలోనూ కనిపిస్తుంది.
వృశకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి బాక్సాఫీస్ ఫైట్..
సాధారణంగా ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రావడం వల్ల కచ్చితంగా రెండు సినిమాలకు ఎంతో కొంత నష్టం తప్పదు. అయితే ఈ రెండు సినిమాలు పూర్తి విభిన్నమైన జోనర్ సినిమాలు కనుక నష్టం ఉండవచ్చు, కానీ కాస్త తక్కువ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వృశకర్మ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చి ఫైనల్‌గా విడుదల ఫిక్స్ అయింది. రెండు సినిమాలకు మరో డేట్ కు వెళ్లలేని పరిస్థితి ఉంది. కనుక తప్పని పరిస్థితుల్లో రెండూ ఒకే రోజు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 4, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు దేనికి అదే స్పెషల్ అన్నట్లుగా నిలువబోతున్నాయి. కనుక రెండు సినిమాలకు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండూ వేరు వేరు జోనర్ లు కావడం వల్ల బయ్యర్లు సైతం పెద్దగా ఇబ్బంది ఉండదనే విశ్వాసం ను వ్యక్తం చేస్తున్నారు. దేని ప్రేక్షకులు దానికి ఉంటారు కనుక పోటీ ఉన్నా కలెక్షన్స్ పై ప్రభావం ఉండదని, రెండు హిట్ అయినా రెండింటికి మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.