• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Box Office >  9 ఏళ్లుగా బాహుబ‌లి-2...

9 ఏళ్లుగా బాహుబ‌లి-2 చెర‌గ‌ని రికార్డ్ .. 'రామాయ‌ణ‌-1' ఎట్ట‌కేల‌కు!

| నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణ: పార్ట్ 1' ప్రపంచవ్యాప్తంగా రూ.1,790.10 కోట్ల గ్రాస్ వసూళ్లతో 'బాహుబలి 2' లైఫ్‌టైమ్ రికార్డును అధిగమించింది. విడుదలైన 23 రోజుల్లోనే ఇండియాలో రూ.1,000.55 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించిన ఈ చిత్రం మరో అరుదైన రికార్డు సృష్టించింది.

By - Sivaji Kontham
Update: 2026-11-28 04:30 GMT

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం `రామాయణ: పార్ట్ 1` బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విడుదలైన 23వ రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1790.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి `బాహుబలి 2: ది కన్‌క్లూజన్`(2017) సాధించిన రూ. 1788.06 కోట్ల లైఫ్‌టైమ్ గ్లోబల్ కలెక్షన్ రికార్డును అధిగమించింది. దీనితో పాటే దేశీయ బాక్సాఫీస్ వద్ద కూడా రూ. 1000 కోట్ల నెట్ మార్కును దాటి మరో అరుదైన రికార్డును అందుకుంది.

23వ రోజు (శుక్రవారం) దేశవ్యాప్తంగా 6,584 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం రూ. 8.45 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో 23 రోజుల మొత్తం ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 1000.55 కోట్లకు చేరుకోగా.. ఇండియా గ్రాస్ రూ. 1195.10 కోట్లుగా నమోదైంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ. 595 కోట్ల గ్రాస్ తోడవడంతో ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు రూ. 1790.10 కోట్లకు చేరినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

భాషాపరంగా చూస్తే.. హిందీ వెర్షన్ ఎప్పటిలాగే అత్యధిక వసూళ్లతో ముందుంది. 23వ రోజున 4,976 షోల ద్వారా హిందీ వెర్షన్ రూ. 5 కోట్లు ఆర్జించింది. కన్నడ వెర్షన్ 327 షోలలో రూ. 1.25 కోట్లు.. తమిళ వెర్షన్ 627 షోలలో రూ. 1.05 కోట్లు.. మలయాళ వెర్షన్ 516 షోలలో రూ. 1 కోటి రాబట్టగా.. తెలుగు వెర్షన్ 138 షోల ద్వారా రూ. 15 లక్షలు వసూలు చేసింది.

నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన `రామాయణ: పార్ట్ 1` తొలి వారంలో రూ. 564.60 కోట్ల నెట్.. రెండో వారంలో రూ. 299.15 కోట్ల నెట్.. మూడో వారంలో రూ. 128.35 కోట్ల నెట్ కలెక్షన్లతో నిలకడగా రాణించింది. ఇప్పటివరకు ఈ సినిమాకు 4.17 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడవడం.. దేశంలోని అన్ని భాషల ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణ ఈ ప్రాజెక్ట్ భారీ విజయానికి నిదర్శనంగా నిలిచాయి. అయితే బాహుబ‌లి 2 చిత్రం 2017లో విడుద‌లైంది. అప్ప‌ట్లో ఇప్పుడు ఉన్నంత భారీ టికెట్ ధ‌ర లేదు. రూపాయితో డాల‌ర్ విలువ కూడా సోసోనే. అయినా ఇప్ప‌టికీ ఈ చిత్రం రికార్డుల్లో టాప్ 5లోనే నిలిచి ఉందనే విష‌యాన్ని గ‌మ‌నించాలి.

రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించిన ఈ చిత్రంలో రవి దూబే, సన్నీ డియోల్, అరుణ్ గోవిల్, లారా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్ట్ రెండో భాగం `రామాయణ: పార్ట్ 2` 2028 దీపావళికి విడుదలవుతుందా లేదా? అనేది న‌మిత్ మల్హోత్రా బృందం ధృవీక‌రించాల్సి ఉంటుంది.

Tags:    
  • ramayana 
  • ranbirkapoor 
  • baahubali2 
  • yash 
  • boxoffice 

Similar News

వృషకర్మ Vs అలియాస్ రుక్మిణి... రెండూ చాలా స్పెషల్‌

2026-11-28 04:30 GMT

ENE-AOT : ఇది కదా అసలైన విజయం అంటే!

2026-11-27 12:30 GMT

27 దేశాల్లో రికార్డ్..రామాయణం విశ్వవ్యాప్త కలెక్షన్లు!

2026-11-27 09:30 GMT

ఈNఈ కి సీక్వెల్ అడ్వాంటేజ్ కలిసి వచ్చింది

2026-11-27 06:37 GMT

'ENE Repeat' క్లీన్ హిట్.. ఫస్ట్ వీక్‌లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్!

2026-11-27 03:57 GMT

క్రిస్మస్‌, సంక్రాంతికి సినిమాల సందడే సందడి

2026-11-26 09:02 GMT

మూడు వారాల్లోనే 'పుష్ప 2' రికార్డు బ్రేక్!

2026-11-26 08:58 GMT

రూ.99 ఆఫ‌ర్‌ : 'రామాయ‌ణ' కాకుండా టాప్-10 సినిమాలు!

2026-11-24 03:47 GMT

పాన్ ఇండియా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫార్ములా ఏంటి? ఎలాంటి సినిమాలు వస్తే హిట్ అవుతున్నాయి...

2026-11-23 05:46 GMT

సౌత్ బాక్సాఫీస్ పై 'రామాయణం' జోరు.. మొదటిసారి ఇలా..

2026-11-22 11:37 GMT

ఈ వారం బాక్సాఫీస్.. సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే..

2026-11-22 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS