• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మగధీర' సీక్వెల్ కోసం...

'మగధీర' సీక్వెల్ కోసం రాజమౌళి అల్లు అరవింద్‌తో కలుస్తారా?

| అల్లు అరవింద్, రాజమౌళి కాంబినేషన్‌లో మరో సినిమా రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజమౌళి సరదాగా అల్లు అరవింద్‌ను ‘మగధీర’ తరహాలో సోలోగా ఓ సినిమా నిర్మించాలని కోరారు. దీంతో రామ్ చరణ్‌తో ‘మగధీర’ సీక్వెల్ వస్తుందనే ఆశలు మళ్లీ మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఇది అభిమానుల ఆకాంక్ష మాత్రమే. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

By - Sivaji Kontham
Update: 2026-11-28 05:10 GMT

నిర్మాత అల్లు అరవింద్- దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన `మగధీర` తెలుగు సినిమా చరిత్రలో ఒక రేర్ ఫీట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. రామ్ చరణ్ నటించిన రెండో చిత్రంగానే బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసిన ఈ ప్రాజెక్ట్ కథాంశం, భారీ విజువల్స్, సంగీతం, చరణ్ నటన ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యేకంగా నిలిచింది. ఆ స్థాయి మ్యాజిక్‌ను మళ్లీ చూడాలనే కోరికతో `మగధీర`కు సీక్వెల్ వస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఒక మీడియా వేదికపై అల్లు అరవింద్‌ను ఉద్దేశించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కొత్త ఊపునిచ్చాయి. అరవింద్ గారు అవార్డు విన్నింగ్ సినిమాలు చేస్తున్నా.. అందరితో కలిసి చేస్తున్నప్పుడు యంగ్ ప్రొడ్యూసర్స్ క్రెడిట్ మొత్తం తీసుకుంటున్నారని... `మగధీర` తరహాలో సోలో ప్రొడక్షన్‌లో ఒక సినిమా చేయాలని రాజమౌళి సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ మాటలతోనే అల్లు అరవింద్ నిర్మాతగా సోలోగా `మగధీర` సీక్వెల్ చేస్తే బాగుంటుందంటూ అభిమానుల్లో కొత్త‌ ఆశలు- ఉత్సాహం పెరిగాయి. మ‌గ‌ధీర త‌ర్వాత ఆ ఇద్ద‌రు దిగ్గ‌జాలు మ‌ళ్లీ క‌ల‌వ‌క‌పోవ‌డంపైనా ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. ఆ ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లిస్తే మిరాకిలే అంటూ గుస‌గుస మొద‌లైంది.

ట్రెండ్ ని ప‌రిశీలిస్తే.. రాజమౌళి వ్యాఖ్యల వెనుక ఆ ఇరువురి క‌ల‌యిక‌కు ఆస్కారం ఉందా? అనే ఆసక్తి మొద‌లైంది. కొంద‌రు దిగ్గ‌జ నిర్మాత‌లు క‌లిసి ప‌ని చేస్తే ఆ ప్రొడ‌క్ట్ క్వాలిటీ వేరే లెవ‌ల్ లో ఉంటుంది. అగ్ర‌ నిర్మాణ సంస్థలు, యువ నిర్మాతల భాగస్వామ్యంతో ప్రాజెక్టులు ముందుకు వెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో `మగధీర` వంటి భారీ విజయాన్ని సొంత బ్రాండ్ పట్టుతో నిలబెట్టిన అనుభవజ్ఞుడైన నిర్మాత సోలోగా ముందుకు రావాలనే భావన ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది.

అయితే `మగధీర` సీక్వెల్ అనేది కేవలం నిర్మాతల నిర్ణయంపైనే కాకుండా.. రాజమౌళి- రామ్ చరణ్‌ల ప్రస్తుత ప్రాజెక్టుల షెడ్యూళ్లు... కథా చ‌ర్చ‌లు.. ఇత‌ర‌ డిమాండ్లపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది అభిమానుల ఆకాంక్ష మాత్ర‌మే. అర‌వింద్ -రాజ‌మౌళి మ‌ళ్లీ క‌లిసి రామ్ చ‌ర‌ణ్ కోసం ఒక భారీ పాన్ వ‌ర‌ల్డ్ సినిమాని తీయాల‌ని అభిమానులు క‌ల‌లు కంటున్నారు. ఆ ఇద్ద‌రు దిగ్గ‌జాల‌ కాంబినేషన్‌లో మళ్లీ మ‌గ‌ధీర లాంటి భారీ ప్రాజెక్ట్ కుదురుతుందా లేదా అన్నది వేచి చూడాలి.



అరవింద్ గారు, నా కోరిక ఏమిటంటే... మన #Magadheera లాగా Geetha Artsలో మీరు Soloగా ఒక సినిమా చేయాలి. అప్పుడే Credit మొత్తం మీకే వస్తుంది. లేకపోతే Young Producers ఆ Credit తీసుకెళ్లిపోతారు. - #SSRajamouli #AakasamloOkaTara #AOTMovie #DulquerSalmaan #Tollywood #Tupaki Follow 👉 @tupaki_official

— Tupaki (@tupaki_official) November 27, 2026


Tags:    
  • magadheera 
  • magadheera2 
  • ssrajamouli 
  • alluaravind 
  • ramcharan 

Similar News

'రామాయణ'తో రకుల్‌కి కలిసి వచ్చింది ఎంత?

2026-11-28 05:10 GMT

జక్కన్న నోట ఆ మాట రాగానే కన్నీళ్లు

2026-11-28 05:10 GMT

మెగా 'హను-మాన్‌' సీక్వెల్‌ కొత్త అప్డేట్‌!

2026-11-28 05:10 GMT

'వృశకర్మ' కోసం రామ్‌ చరణ్‌ వచ్చేనా?

2026-11-28 04:31 GMT

మెగా ఫ్యాన్స్‌ సంక్రాంతి వరకు వెయిట్‌ చేయాల్సిందేనా?

2026-11-28 04:31 GMT

మళ్లీ పెళ్లి మాట ఎత్తిన అల్లు అరవింద్.. ఈసారి ఆ హీరోయిన్ వంతు!

2026-11-28 04:31 GMT

9 ఏళ్లుగా బాహుబ‌లి-2 చెర‌గ‌ని రికార్డ్ .. 'రామాయ‌ణ‌-1' ఎట్ట‌కేల‌కు!

2026-11-28 04:30 GMT

వృషకర్మ Vs అలియాస్ రుక్మిణి... రెండూ చాలా స్పెషల్‌

2026-11-28 04:30 GMT

'హై' మూవీ రివ్యూ

2026-11-28 04:20 GMT

శ‌ర్మా గాళ్ గ్లామ‌ర్ ఎలివేష‌న్ స‌రే .. కెరీర్ సంగ‌తేంటి?

2026-11-28 03:49 GMT

బాలీవుడ్ స్టార్ల‌ను తెలుగు మీడియా ఎలా ట్రీట్ చేస్తుందో తెలుసా?

2026-11-28 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS