• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జక్కన్న నోట ఆ మాట రాగానే...

జక్కన్న నోట ఆ మాట రాగానే కన్నీళ్లు

| 'ఆకాశంలో ఒక తార' సక్సెస్ వేడుకలో దర్శకుడు రాజమౌళి హీరోయిన్ రుహానీ శర్మ నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆమె ఈ సినిమాకు పెద్ద బలంగా నిలిచిందని కొనియాడారు. ఈ ప్రశంసలు విన్న రుహానీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. సాత్విక వీరవల్లి, శృతి హాసన్ నటనను కూడా రాజమౌళి అభినందించారు.

By - M Prashanth
Update: 2026-11-28 05:10 GMT

'ఆకాశంలో ఒక తార' సక్సెస్ సెలబ్రేషన్స్ లో దర్శకుడు రాజమౌళి స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నార్మల్ గా కథ, స్క్రీన్ ప్లే గురించి లోతుగా విశ్లేషించే జక్కన్న, ఈ వేడుకలో నటీనటుల పర్ఫార్మెన్స్ ల మీద ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యంగా హీరోయిన్ రుహానీ శర్మ గురించి ఆయన అన్న ఒక్క మాట, దానికి ఆమె ఇచ్చిన రియాక్షన్ వీడియో క్లిప్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

సినిమాలో చిన్న పాత్రల నుంచి లీడ్ రోల్స్ వరకు అందరూ బాగా చేశారని మెచ్చుకున్న రాజమౌళి, రుహానీ శర్మ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. రుహానీ నువ్వు ఫెంటాస్టిక్ జాబ్ చేశావు, ఈ సినిమాకు నువ్వు ఒక పెద్ద స్ట్రెంగ్త్ లా నిలిచావు అంటూ స్టేజ్ మీదే కితాబిచ్చారు. రాజమౌళి నోటి నుంచి ఆ ప్రశంస వినగానే ముందు వరుసలో కూర్చున్న రుహానీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆనందంతో చేతులు జోడించి నమస్కరిస్తూ కన్నీళ్లు తుడుచుకున్న విధానం అక్కడున్న వాళ్లందరినీ కదిలించింది.

'చి ల సౌ' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైనప్పటి నుంచి రుహానీ శర్మ ఎప్పుడూ కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటూ వస్తున్నారు. 'హిట్', 'సైంధవ్' లాంటి చిత్రాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసినా, ఆమెకు రావాల్సినంత కమర్షియల్ రేంజ్ దక్కలేదు. పెద్దగా పీఆర్ హడావుడి లేకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే రుహానీకి, రాజమౌళి లాంటి దర్శకుడి నుంచి ఇలాంటి గుర్తింపు రావడం కెరీర్ పరంగా పెద్ద బూస్ట్ అనే చెప్పాలి.

ఈ స్పీచ్ లో రాజమౌళి జస్ట్ తెలిసిన స్టార్స్ గురించే కాకుండా, సినిమాలోని ప్రతి ఫిమేల్ క్యారెక్టర్ ను గమనించి మాట్లాడారు. హీరో కృష్ణ అక్క పాత్రలో నటించిన అమ్మాయి పేరు తనకు తెలియకపోయినా, ఆమె నటన బాగా నచ్చిందని చెప్పారు. మొదట విలన్ లా కనిపించి, తర్వాత తమ్ముడిపై ఉన్న ప్రేమను చూపించిన తీరు చాలా సహజంగా కుదిరిందని అభినందించారు. తన ఫేవరెట్ నటి శృతి హాసన్ ఈ ఈవెంట్ కు రాకపోవడాన్ని మిస్ అవుతున్నానని చెబుతూ, తెరపై ఆమె యాక్టింగ్ ఒక బ్రీజ్ లా సాగిందని మెచ్చుకున్నారు.

ఇదే వేదికపై మరో యంగ్ హీరోయిన్ సాత్విక గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ కూడా హైలెట్ అయ్యాయి. శ్రీదేవి, జయప్రద, జయసుధ లాగా ఒక తెలుగు అమ్మాయి ఇండియన్ సినిమా స్థాయికి వెళ్లాలని ఎప్పటి నుంచో అనిపిస్తుందని ఆయన అన్నారు. సాత్వికలో ఆ సత్తా ఉందని చెబుతూనే, మాకోసం ఇంకొంచెం త్వరగా తెలుగు నేర్చేసుకో అంటూ సరదాగా చురక అంటించారు. దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో, పవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ నిర్మించాయి. ఇక రాజమౌళి మాటలు బాక్సాఫీస్ దగ్గర మంచి ప్లస్ అవుతున్నాయి. స్టార్ డైరెక్టర్ నుంచి 'బిగ్ స్ట్రెంగ్త్' అనిపించుకున్న రుహానీ శర్మకు, ఈ సక్సెస్ తర్వాత తెలుగులో మరిన్ని బలమైన పాత్రలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.



#SSRajamouli ప్రశంసలకు #RuhaniSharma కళ్లలో నీళ్లు! “కృష్ణాజీ” అని #RuhaniSharma మాట్లాడుతుంటే… సబ్‌టైటిల్స్ కూడా చూడలేదు నేను. She totally captivated me. #AakasamloOkaTara #AOTMovie #DulquerSalmaan #Tollywood #Tupaki Follow 👉 @tupaki_official https://t.co/jxm3jsAaOM

— Tupaki (@tupaki_official) November 27, 2026


Tags:    
  • ruhanisharma 
  • rajamouli 
  • aakasamlookatara 
  • satvika 

Similar News

'రామాయణ'తో రకుల్‌కి కలిసి వచ్చింది ఎంత?

2026-11-28 05:10 GMT

'మగధీర' సీక్వెల్ కోసం రాజమౌళి అల్లు అరవింద్‌తో కలుస్తారా?

2026-11-28 05:10 GMT

మెగా 'హను-మాన్‌' సీక్వెల్‌ కొత్త అప్డేట్‌!

2026-11-28 05:10 GMT

'వృశకర్మ' కోసం రామ్‌ చరణ్‌ వచ్చేనా?

2026-11-28 04:31 GMT

మెగా ఫ్యాన్స్‌ సంక్రాంతి వరకు వెయిట్‌ చేయాల్సిందేనా?

2026-11-28 04:31 GMT

మళ్లీ పెళ్లి మాట ఎత్తిన అల్లు అరవింద్.. ఈసారి ఆ హీరోయిన్ వంతు!

2026-11-28 04:31 GMT

9 ఏళ్లుగా బాహుబ‌లి-2 చెర‌గ‌ని రికార్డ్ .. 'రామాయ‌ణ‌-1' ఎట్ట‌కేల‌కు!

2026-11-28 04:30 GMT

వృషకర్మ Vs అలియాస్ రుక్మిణి... రెండూ చాలా స్పెషల్‌

2026-11-28 04:30 GMT

'హై' మూవీ రివ్యూ

2026-11-28 04:20 GMT

శ‌ర్మా గాళ్ గ్లామ‌ర్ ఎలివేష‌న్ స‌రే .. కెరీర్ సంగ‌తేంటి?

2026-11-28 03:49 GMT

బాలీవుడ్ స్టార్ల‌ను తెలుగు మీడియా ఎలా ట్రీట్ చేస్తుందో తెలుసా?

2026-11-28 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS