రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలంటే ఈ ఎలిమెంట్స్ ఉండాల్సిందే...
| 'రంగస్థలం' తర్వాత సుకుమార్‌తో మరో సినిమా చేయనున్న రామ్ చరణ్ కథల ఎంపికలో ప్యూర్ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'పెద్ది'లో కాలు కోల్పోయిన పాత్రలో నటించడం, క్లైమాక్స్‌లో ఫైట్ లేకుండా ఎమోషన్స్‌తో కథను నడిపించడం వంటి అంశాలు ఆయన కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలపై ఆసక్తిని చూపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమను పాన్ ఇండియాలో టాప్ పొజిషన్ కి తీసుకెళ్లిన హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. 'ఆర్ఆర్ఆర్' తో గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు 'రంగస్థలం' సినిమా వచ్చి పలు సంచలనాలను క్రియేట్ చేసింది. వీళ్లిద్దరూ కలిసి మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. అది ఎలా ఉంటుందో చూడాలి...
రామ్ చరణ్ కి కథ లో ఈ ఎలిమెంట్స్ ఉండాల్సిందే...
చిరుత సినిమాతో కెరీర్ ని స్టార్ట్ చేసిన రామ్ చరణ్ డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. స్టార్టింగ్ లో రామ్ చరణ్ చేయాల్సిన సినిమా కథలను చిరంజీవి ఫైనల్ చేసేవాడు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ తనే స్వయంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. చరణ్ కి కథ చెప్పాలంటే , ఆ కథను ఆయన ఓకే చేయాలంటే కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉండాలి. ముఖ్యంగా అప్పుడే అతనికి ఆ కథలోని ఎమోషన్స్ టచ్ అవ్వాలి. ప్యూర్ ఎమోషన్స్ ఎప్పుడైతే ఆయనకు అనిపిస్తాయో అప్పుడు మాత్రమే ఆ కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారట. ప్రస్తుతం ఉన్న దర్శకులందరు రామ్ చరణ్ కి కథ చెప్పు బోయే ముందు మూవీలో ఎలాంటి సన్నివేశాలు ఉన్నా లేకపోయినా కూడా ప్యూర్ ఎమోషన్స్ ఉన్నాయా? కొన్ని సందర్భాల్లో డ్రామటైజ్ చేసి కళ్ళలో నుంచి వాటర్ వచ్చే విధంగా ఎవరైతే కథలు చేస్తారో అలాంటి వాళ్లకి రామ్ చరణ్ డేట్స్ ఇస్తాడనే వార్తలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి కథ బాగుంటేనే సినిమా బాగుంటుందనే విషయాన్ని స్టార్ హీరోలందరు మొదటి నుంచి ఫాలో అవుతున్నారు. అయిన కొంతమంది దర్శకులు కొన్ని కథలను చెప్పినప్పుడు చాలా ఎఫెక్టివ్ గా చెప్పి, దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే క్రమంలో కొంతవరకు గాడి తప్పుతున్నారు. దానివల్ల సినిమాలు ఆశించిన మేరకు విజయాలను సాధించడం లేదు. మొత్తానికైతే ఎలాంటి కథను ఎంచుకున్నా కూడా అందులో ప్యూర్ ఎమోషన్స్ ఉండాలి. వాటిని బ్యాలెన్స్ చేస్తూ హీరో ఏం చేస్తున్నాడు అతని పాత్రకి ఇంపార్టెన్స్ ను ఇస్తూ మిగిలిన పాత్రలను సైతం హీరో కి సపోర్ట్ చేసే విధంగా మలుచుకుంటే ప్రతి సినిమా సక్సెస్ ని సాధిస్తుందనేది కొంతమంది విమర్శకుల వాదన...
రామ్ చరణ్ లాంటి నటుడు డిఫరెంట్ అటెంప్ట్ చేయడానికి సైతం వెనకాడటం లేదు. రీసెంట్ గా వచ్చిన 'పెద్ది' సినిమాలో ఆయన ఒక కాలును కోల్పోయిన హీరోగా నటించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. కొంతమంది హీరోలు భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటేనే సినిమాలు చేస్తాం అంటారు. కానీ చరణ్ మాత్రం కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే పెద్ది సినిమా వచ్చింది. టైర్ వన్ హీరో అయి ఉండి క్లైమాక్స్ లో ఫైట్ లేకుండా సినిమాని కేవలం ఎమోషన్స్ తో బ్యాలెన్స్ చేస్తూ నడిపించారు. రామ్ చరణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి క్లైమాక్స్ ను ఒప్పుకున్నాడు అంటే నిజంగా అతను కంటెంట్ బేస్డ్ సినిమాల వైపు పూర్తిస్థాయిలో అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే ఇతర భాషల దర్శకులు సైతం మన హీరోలకు కాన్సెప్ట్ బేస్డ్ కథలను చెప్పి ఒప్పించి, సినిమాలను చేసే అవకాశం దొరుకుతుంది...