దేవకన్యలా కుర్రకారును మైమరపిస్తున్న టాలీవుడ్ బ్యూటీ!
| బ్లష్, వైట్ లేస్ కార్సెట్ అవుట్‌ఫిట్‌లో షాన్వి శ్రీవాత్సవ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. గ్లౌజులతో దేవకన్యలా మెరిసిన ఈమె లుక్ అభిమానులను ఫిదా చేస్తోంది. ‘లవ్లీ’తో నటిగా ఎంట్రీ ఇచ్చిన షాన్వి ప్రస్తుతం కన్నడ చిత్రం ‘త్రిశూలం’లో నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
ఒకవైపు సినిమా షూటింగ్లో.. మరొకవైపు ఆడియన్స్ కు దగ్గర అవ్వడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని సెలబ్రిటీలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అటు అందాల ఆరబోతతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అలాంటి వారిలో షాన్వి శ్రీవాత్సవ కూడా ఒకరు. అప్పుడప్పుడు కనిపించినా.. తన గ్లామర్ తో యువతకు చెమటలు పట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా అందాలు ఆరబోస్తూ దేవకన్యను తలపించింది. బాల్కనీలో నిలబడి షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
తాజాగా షాన్వి శ్రీ వాత్సవ షేర్ చేసిన లేటెస్ట్ అవుట్ ఫిట్ విషయానికి వస్తే.. బ్లష్, వైట్ లేస్ కార్సెట్ లుక్ లో కనిపించి అభిమానులకు గిలిగింతలు పెట్టింది.ఈమె ధరించిన దుస్తుల విషయానికి వస్తే.. స్లీవ్ లెస్ షీర్ నెట్ లేస్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన కార్సెట్ బస్టియర్ ను ధరించింది. దీనికి సన్నని స్ట్రాప్స్ నెక్ లైన్ వద్ద అందమైన ట్రిమ్ తో ముందు భాగంలో చిన్న వైట్ రిబ్బన్ బో తో ఈ డ్రెస్ ను డిజైన్ చేశారు. ఇక లోపలి భాగంలో బ్లష్ టోన్ లైనింగ్ ఉండటం వల్ల వైట్ లేస్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇక చేతులకు అదే వైట్ లేస్ షీర్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన గ్లౌజ్ ధరించి దేవకన్యల కనిపించింది. మొత్తానికి అయితే ఈ అవుట్ ఫిట్ లో షాన్వి తన లుక్కుతో విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.
షాన్వి విషయానికి చూస్తే 1993 వారణాసిలో జన్మించిన ఈమె.. ఉత్తరప్రదేశ్‌లోని అజంఘడ్ లోని చిల్డ్రన్ కాలేజీలో స్కూల్ విద్యను, ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.. 2016లో బీకాం డిగ్రీ పూర్తి చేసిన ఈమె చదువుకునేటప్పుడే.. అనగా 2012లో బి.జయ దర్శకత్వం వహించిన లవ్లీ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తెలుగు పొలిటికల్ డ్రామా రౌడీలో విష్ణు సరసన చిన్న పాత్రలో నటించింది . ఇక ఈమె 2014లో హారర్ కామెడీ మూవీ చంద్రలేఖతో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి కూడా అరంగేట్రం చేసింది. అంతేకాదు పాన్ ఇండియా స్టార్ హీరో యశ్ నటించిన మాస్టర్ పీస్ చిత్రంలో కూడా హీరోయిన్గా నటించి ప్రేక్షకులను అలరించింది.
తెలుగు, కన్నడ చిత్రాలలోనే కాదు చైనీస్ డ్రామా సిరీస్ లో కూడా కనిపించి, సందడి చేసింది షాన్వి. కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కానీ మళయాలం, మరాఠీ , కన్నడ చిత్రాలలో మాత్రం నటిస్తూ బిజీగా ఉంది ప్రస్తుతం త్రిశూలం అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరొకవైపు ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఇలా గ్లామర్ ఫోటోలతో ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ అయిపోయింది ఈ చిన్నది.