• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ చైతన్య.. ఆ రిస్క్...

నాగ చైతన్య.. ఆ రిస్క్ వెనుక తండ్రి పోలికే!

| ట్రావెల్ యూట్యూబర్ జాస్తితో ఇంటర్వ్యూలో నాగచైతన్య తన కెరీర్, ప్రయోగాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొత్త కథలు, విభిన్న పాత్రలు ఎంచుకోవాలనే క్యూరియాసిటీ తండ్రి నాగార్జున నుంచే వచ్చిందని తెలిపారు. థియేటర్, ఓటీటీ అనే తేడా లేకుండా కంటెంట్‌కే ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన 'వృషకర్మ'తో కొత్త జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

By - M Prashanth
Update: 2026-11-28 09:30 GMT

ట్రావెల్ యూట్యూబర్ జాస్తితో నాగచైతన్య చేసిన క్యాండిడ్ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. రొటీన్ సినిమా ప్రమోషన్ల లాగా కాకుండా, ఇందులో చైతన్య తన కెరీర్, పర్సనల్ ఆలోచనల గురించి చాలా ఓపెన్ గా మాట్లాడారు. ముఖ్యంగా తండ్రి నాగార్జున తరహాలోనే కొత్త తరహా ప్రయోగాలు చేసే అలవాటు తనకూ ఎలా వచ్చిందో ఈ చిట్ చాట్ లో ఆసక్తికరంగా వివరించారు.

టాలీవుడ్ లో నాగార్జున ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్ గానే నిలిచారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 'శివ', 'గీతాంజలి' లాంటి విభిన్నమైన సినిమాలతో పాటు, స్టార్ హీరోలు బుల్లితెర వైపు చూడటానికి ఆలోచిస్తున్న రోజుల్లోనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోతో స్మాల్ స్క్రీన్ పైకి వచ్చారు. ఇప్పుడు చైతన్య కూడా సరిగ్గా అదే రూట్ ఫాలో అవుతున్నారు. 'దూత' వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఆశ్చర్యపోయారు.

బిగ్ స్క్రీన్ మీద సినిమాలు చేస్తూ సడెన్ గా స్మాల్ స్క్రీన్ ఎందుకు చేస్తున్నావని అప్పట్లో తనను కొందరు ప్రశ్నించారని చైతన్య గుర్తుచేసుకున్నారు. అయితే తన దృష్టిలో ఎప్పుడూ పెద్ద తెర, చిన్న తెర అనే తేడా లేదని తేల్చిచెప్పారు. ఏ ప్లాట్ ఫామ్ లో చేస్తున్నామనే దానికంటే, కథలో ఎంత కొత్తదనం ఉందనేదే తనకు ముఖ్యమని అన్నారు. కొత్త విషయాలను ఎక్స్ ప్లోర్ చేసే ఆ క్యూరియాసిటీ నాన్న నుంచే వచ్చిందని చెప్పుకొచ్చారు.

థియేటర్ సినిమాలతో పోలిస్తే ఓటీటీలో నటులకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందని చైతన్య చెప్పారు. థియేటర్లకు వచ్చే ఆడియన్స్ రెండు మూడు గంటల కమర్షియల్ ఫార్మాట్ ను ఆశిస్తారని, కానీ ఓటీటీలో అలాంటి ఒత్తిడి లేకుండా భిన్నమైన పాత్రలు చేసే ఛాన్స్ దొరుకుతుందని అన్నారు. పేపర్ మీద మొదలైన ఒక ఆలోచన తెరపై ప్రాణం పోసుకోవడం చూస్తే తనకు ఎంతో సంతృప్తిగా ఉంటుందని, తన ఫుడ్ బిజినెస్ విషయంలోనూ ఇదే ఆలోచనతో వెళ్తానని తెలిపారు.

ఆ రిస్క్ చైతన్య కెరీర్ కు బాగానే కలిసొచ్చింది. 'దూత' సక్సెస్ తో రొటీన్ లవ్ స్టోరీల ఇమేజ్ నుంచి బయటకు వచ్చి, నటుడిగా తనలోని మరో కోణాన్ని చూపించారు. ఇప్పుడు అదే జోష్ తో కార్తీక్ దండు దర్శకత్వంలో చేసిన వృషకర్మ మిథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రానుంది. ఇందులో ట్రెజర్ హంటర్ అర్జున్ అనే సరికొత్త పాత్రలో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ లను మరీ సీరియస్ గా తీసుకోకుండా, సేఫ్ జోన్ దాటి కొత్త జానర్లను ట్రై చేయడమే తన పాలసీ అని చైతన్య అన్నారు. తండ్రి బాటలోనే ప్రయోగాలు చేస్తున్న చైతన్య, రాబోయే తన అడ్వెంచర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

Tags:    
  • nagachaitanya 
  • akkineniNagarjuna 
  • vrushakarma 
  • dhootha 

Similar News

రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలంటే ఈ ఎలిమెంట్స్ ఉండాల్సిందే...

2026-11-28 08:30 GMT

ఆ ఫీలింగ్ వస్తేనే గెలిచినట్టు.. పార్ట్ 2 లపై కార్తీక్ దండు హింట్!

2026-11-28 08:07 GMT

నాగచైతన్య ఫేవరెట్ ట్రావెల్ స్పాట్స్.. ఆ ఐలాండ్ పేరు మాత్రం సీక్రెట్!

2026-11-28 08:04 GMT

ఇడుపు కాయితం: 'ఉల్లిపూల' అంటూ నాగదుర్గ రొమాంటిక్ అల్లరి

2026-11-28 08:03 GMT

కొరియోగ్రాఫ‌ర్ సుమ‌ల‌త క్షమాప‌ణలు.. జానీ మాస్ట‌ర్ కెరీర్ కోస‌మే!

2026-11-28 08:01 GMT

దేవకన్యలా కుర్రకారును మైమరపిస్తున్న టాలీవుడ్ బ్యూటీ!

2026-11-28 06:29 GMT

'రామాయణ'తో రకుల్‌కి కలిసి వచ్చింది ఎంత?

2026-11-28 05:10 GMT

'మగధీర' సీక్వెల్ కోసం రాజమౌళి అల్లు అరవింద్‌తో కలుస్తారా?

2026-11-28 05:10 GMT

జక్కన్న నోట ఆ మాట రాగానే కన్నీళ్లు

2026-11-28 05:10 GMT

మెగా 'హను-మాన్‌' సీక్వెల్‌ కొత్త అప్డేట్‌!

2026-11-28 05:10 GMT

'వృశకర్మ' కోసం రామ్‌ చరణ్‌ వచ్చేనా?

2026-11-28 04:31 GMT

Copyright @2026

Powered by Blink CMS