స్త్రీ 2 తర్వాత సెన్సేషనల్ బయోపిక్.. అమ్మడు తగ్గట్లేదుగా..!
ఇక ఇదే బ్యానర్ లో శ్రద్ధా కపూర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తుంది. అది ఒక క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడం అది కూడా ఒక బయోపిక్ అవ్వడంతో సంథింగ్ స్పెషల్ గా మారింది.;
స్త్రీ 2 తో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందుకుంది బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. మడాక్ ఫిలింస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ బడా స్టార్ట్స్ సైతం షాక్ అయ్యేలా చేసింది. ఇక ఇదే బ్యానర్ లో శ్రద్ధా కపూర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తుంది. అది ఒక క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడం అది కూడా ఒక బయోపిక్ అవ్వడంతో సంథింగ్ స్పెషల్ గా మారింది. శ్రద్ధా కపూర్ ఈసారి మరాఠీ తమాషా ఆర్ట్ ఫాం లెజెండ్ వితాబై జీవిత కథతో శ్రద్ధ రాబోతుంది. ఇండియన్ డాన్సర్, తమాషా ఆర్ట్ ఫాం స్పెషలిస్ట్ అయిన వితాబై బయోపిక్ తో ఈ సినిమా వస్తుంది.
ఛావా లాంటి సెన్సేషనల్ హిట్..
ఈ మూవీని ఛావా లాంటి సెన్సేషనల్ హిట్ మూవీ అందించిన లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా ఈథ అని ఫిక్స్ చేశారు. మహారాష్ట్ర జానపద సంస్కృతిని తమాషా ఆర్ట్ ఫాం లో వితాబై ప్రదర్శనలు ఎంతో పేరు ప్రత్యేకత తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఆమె కథను ప్రపంచానికి తెలిసేలా చేయాలని బాలీవుడ్ మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ ఈథ సినిమా షూటింగ్ మొదలైందని తెలుస్తుంది.
మితాబై పాత్రలో శ్రద్ధా కపూర్ మరోసారి అదరగొట్టబోతుంది. లక్ష్మణ్ ఉటేకర్ లాస్ట్ ఇయర్ ఛావా సినిమాతో మరాఠి నాయకుడు శంభాజీ మహారాజ్ కథను ప్రేక్షకులకు చెప్పాడు. ఈసారి వితాబై జీవిత కథతో వస్తున్నాడు. ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మేజర్ హైలెట్ గా నిలిచేలా ఉంది. అజయ్ అతుల్ కంపోజిషన్ లో ఈ సినిమా వస్తుంది.
స్త్రీ 2 తో సూపర్ హిట్ అందుకున్న శ్రద్ధా కపూర్..
వితాబై బయోపిక్ తో వస్తున్న ఈ ఈథ సినిమాతో మరోసారి శ్రద్ధ ప్రేక్షకుల మనసులు గెలవాలని చూస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ అండ్ టీం ఈ సినిమాను చాలా సిన్సియర్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ డైరెక్టర్ తీసిన ఛావా సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఇప్పుడు ఈ ఈథపై కూడా హ్యూజ్ బజ్ ఏర్పడింది. స్త్రీ 2 తో సూపర్ హిట్ అందుకున్న తర్వాత శ్రద్ధా కపూర్ మరో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తుంది. ఈథ సినిమాతో మరోసారి ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో తన సత్తా ఏంటన్నది చూపించబోతుంది. శ్రద్ధా కపూర్ కూడా వితాబై రోల్ కోసం చాలా హోం వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
లక్ష్మణ్ ఉటేకర్ ఈ కథతో మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించబోతున్నారు. ముఖ్యంగా పీరియాడికల్ కథలతో.. గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత కథలను తీసుకుని ఆయన చేస్తున్న ప్రయత్నాలు సినీ లవర్స్ ని మెప్పిస్తున్నాయి.