• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శశ్ఠిపూర్తి: మాస్ మహారాజ...

శశ్ఠిపూర్తి: మాస్ మహారాజ వదిలిన మరో మెలోడీ మాయ

| ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం శశ్ఠిపూర్తి నుండి తాజాగా రెండవ పాట ‘ఇరు కన్నులు కన్నులు’ విడుదలైంది.

By - Tupaki Desk
Update: 2025-04-11 04:47 GMT

ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం శశ్ఠిపూర్తి నుండి తాజాగా రెండవ పాట ‘ఇరు కన్నులు కన్నులు’ విడుదలైంది. మాస్ మహారాజా రవి తేజ చేతుల మీదుగా ఈ మెలోడీ సాంగ్ లాంచ్ కావడం విశేషం. తనదైన శైలిలో రవి తేజ ఈ పాటను ప్రశంసించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు ఈ చిత్రంలో కనిపించటం సినిమాకే ప్రత్యేక ఆకర్షణని చెప్పారు. పాటలో వచ్చే శుభ శాంతి భావాలు, మధురమైన వాయిస్ లు సినిమాకి మంచి వాతావరణాన్ని కలిగిస్తాయన్నారు.

ఈ సినిమాలో లేడీస్ టైలర్ ఫేమ్ అర్చన, రాజేంద్ర ప్రసాద్ భార్య భర్తలుగా కనిపించనుండగా.. మరో జంటగా రుపేష్ - ఆకాంక్ష సింగ్ లు రొమాంటిక్ కెమిస్ట్రీతో కనువిందు చేయనున్నారు. ఈ రెండో సింగిల్‌ను ఎస్పీ చరణ్, విభావరి అప్తే జోషి పాడగా.. సంగీతం మాస్ట్రో ఇళయరాజా అందించారు. పాట విడుదల సందర్భంగా యూనిట్ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారు.

దర్శకుడు పవన్ ప్రభా ఈ పాట గురించి మాట్లాడుతూ.. ఇది మొదటి విన్నపుడే మనసుకు మంచి ఫీల్ ఇస్తుందని చెప్పారు. పాటకు రాహ్మాన్ రాసిన సాహిత్యం అందరినీ కట్టిపడేస్తుందని అభిప్రాయపడ్డారు. పాటను రాజమండ్రి పరిసరాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరించగా.. కొరియోగ్రఫీ ఈశ్వర్ పెంటి, సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైన్ థోటా తరణి అందించారు.

ఈ సాంగ్ కి ముందు విడుదలైన ‘ఎదో ఏ జన్మలొదో’ పాట కూడా మంచి రెస్పాన్స్‌ను రాబట్టింది. ముఖ్యంగా ఎమ్ఎం కీరవాణి రాసిన సాహిత్యం, నేపథ్య సంగీతం కలిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చక్రపాణి ఆనంద్, కాంతార ఫేమ్ అచ్యుత్ కుమార్, ప్రభాస్ శ్రీను, చలాకీ చంటి, మురళీధర్ గౌడ్, జబర్దస్త్ రామ్ లాంటి పలువురు పాత్రధారులు భాగమవుతున్నారు.

ఇది కేవలం ఒక కుటుంబ కథే కాకుండా.. బంధాల విలువను చెప్పే ఒక ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోందని యూనిట్ చెబుతోంది. ఈ జెనరేషన్‌కి తల్లిదండ్రుల అభిప్రాయాలు ఎలా ఉంటాయో, పిల్లల భవిష్యత్తుపై పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పే విధంగా ఈ కథ ఉన్నట్టు దర్శకుడు తెలిపారు. రవి తేజ కూడా ఈ కథ తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రం అంటూ వివరణ ఇచ్చారు.

Full View
Tags:    
  • Shashtipoorthi 
  • IruKanuluKanulusong 
  • Rajendra Prasad 
  • Archana 
  • Ilaiyaraaja 
  • Ravviteja 
  • PavanPrabha 
  • AakankshaSingh 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS