షష్టి పూర్తి ట్రైలర్ టాక్..!
రూపేష్, ఆకాంక్ష సింగ్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా షష్టి పూర్తి. రాజేంద్ర ప్రసాద్, అర్చన లేడీస్ టైలర్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా ఇది;
రూపేష్, ఆకాంక్ష సింగ్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా షష్టి పూర్తి. రాజేంద్ర ప్రసాద్, అర్చన లేడీస్ టైలర్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా ఇది. ఈ సినిమాకు వాళ్లిద్దరి పాత్రలు చాలా కీలకం. షష్టి పూర్తి సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉండగా లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను పవన్ ప్రభ డైరెక్ట్ చేశారు.
యువ హీరో రూపేష్ సినిమాలో లీడ్ రోల్ చేయడమే కాకుండా ఈ సినిమాను నిర్మించారు. సినిమా పట్ల అతనికి ఉన్న అంకితభావం ఏంటో షష్టిపూర్తి సినిమా తీసిన విధానం చూస్తే అర్ధమవుతుంది. ఒక మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులకు అందించే క్రమంలో ఈ సినిమా తీశారనిపిస్తుంది. సినిమాలో కథ ఎంత కీలకంలో దాన్ని అనుకున్న విధంగా ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా సెట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇంప్రెసివ్ గా అనిపించాయి.
హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్ మంచి వెయిట్ ఉన్న పాత్ర చేసినట్టు తెలుస్తుంది. రూపేష్, ఆకాంక్ష సింగ్ ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయినట్టు ఉంది. ఐతే సినిమా కథ ఏంటన్నది ట్రైలర్ చూస్తే కొంతవరకు అర్ధమవుతుంది. ఐతే తెర మీద ఎమోషనల్ రైడ్ గా షష్టిపూర్తి ఉండబోతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ ని మాస్ట్రో ఇళయరాజా అందించారు. అందుకే ఈ షష్టిపూర్తి సినిమాకు మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.
షష్టిపూర్తి సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతుంది. సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గానే అనిపించినా అసలు కథ ఏంటన్నది సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే. రాజేంద్ర ప్రసాద్, అర్చన ఈ సినిమాలో దాదాపు ఫుల్ లెంగ్త్ రోల్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో ఈ ఇద్దరి మధ్య సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక యువ హీరో రూపేష్ నటన కూడా సినిమాకు మరో హైలెట్ గా ఉండేలా ఉంది. ఫైనల్ గా షష్టి పూర్తి సినిమా ట్రైలర్ ఆడియన్స్ లో ఇంట్రెస్టింగ్ ని క్రియేట్ చేసింది. విజువల్స్, మేకింగ్ అంతా సినిమా పై బజ్ పెంచేలా చేశాయి.