ఈ సెంటిమెంట్ ఏదో బావుందే! శ‌ర్వా పండ‌క్కి వ‌స్తే..

ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి ఓ కొత్త సెంటిమెంట్ వెలుగులోకి వ‌చ్చింది. ఆ సెంటిమెంట్ ను చెప్పింది మ‌రెవ‌రో కాదు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శ‌ర్వానంద్.;

Update: 2026-01-17 09:39 GMT

ఎవ‌రికైనా సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి. సినీ ఇండ‌స్ట్రీలో ఆ సెంటిమెంట్స్ ఇంకాస్త ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే సినిమా మొద‌లుపెట్ట‌డం నుంచి, సినిమా పూర్తై రిలీజ‌య్యే వ‌ర‌కు ఎన్నో సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంటారు. అందులో కొన్ని గుడ్ సెంటిమెంట్స్ ఉంటే, మ‌రికొన్ని మాత్రం బ్యాడ్ సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను బేస్ చేసుకుని హీరోలు, నిర్మాత‌లు, డైరెక్ట‌ర్లు వాటిని ఫాలో అయి స‌క్సెస్ అవాల‌ని చూస్తుంటారు.

స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతున్న నారీ నారీ న‌డుమ మురారి

ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి ఓ కొత్త సెంటిమెంట్ వెలుగులోకి వ‌చ్చింది. ఆ సెంటిమెంట్ ను చెప్పింది మ‌రెవ‌రో కాదు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శ‌ర్వానంద్. శ‌ర్వా హీరోగా న‌టించిన నారీ నారీ న‌డుమ మురారి సినిమా సంక్రాంతికి వ‌చ్చి సూప‌ర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను అందుకుంటుంది. సినిమా హిట్టైన నేప‌థ్యంలో చిత్ర యూనిట్ స‌క్సెస్ మీట్ ను నిర్వ‌హించ‌గా అందులో శ‌ర్వానంద్ ఈ కొత్త సెంటిమెంట్ ను బ‌య‌ట‌పెట్టారు.

త‌ర్వాతి సినిమా శ్రీనువైట్ల‌తో

సంక్రాంతి సీజ‌న్ త‌న‌కు బాగా క‌లిసొస్తుంద‌ని, తాను సంక్రాంతికి వ‌చ్చిన ప్ర‌తీసారి అన్ని సినిమాలు ఆడ‌తాయ‌ని, అందుకే ఇక‌పై ప్ర‌తీ సంక్రాంతికీ త‌న కోసం ఒక స్లాట్ ను పక్క‌న పెట్ట‌మ‌ని చెప్పారు. మ‌ళ్లీ వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాన‌ని, ఆ సినిమాకు డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల అని, మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో రానుంద‌ని శ‌ర్వా చెప్పారు.

సంక్రాంతికి వ‌స్తే నాతో పాటూ అంద‌రి సినిమాలూ హిట్టే

తాను పండ‌క్కి వ‌చ్చిన ప్ర‌తీ సారీ త‌న సినిమాతో పాటూ మిగిలిన సినిమాల‌న్నీ కూడా బాగా ఆడ‌తాయ‌ని, గ‌తంలో ఎక్స్‌ప్రెస్ రాజా వ‌చ్చిన‌ప్పుడు ఆ సినిమాతో పాటూ అన్నీ సినిమాలూ ఆడాయ‌ని, త‌ర్వాత శ‌త‌మానం భ‌వ‌తి సినిమా టైమ్ లో కూడా దాంతో పాటూ రిలీజైన మిగిలిన సినిమాలు కూడా ఆడాయని, ఇప్పుడు నారీ నారీ న‌డుమ మురారితో పాటూ వ‌చ్చిన మిగిలిన సినిమాల‌న్నీ కూడా ఆడుతున్నాయని, అందుకే ప్ర‌తీ ఏడాది సంక్రాంతికి త‌న‌కు ఓ స్లాట్ ఉంచ‌మ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను కోరారు శ‌ర్వా.

Tags:    

Similar News