సెట్స్లో గ్రీన్ ప్లాగ్..హీరోయిన్ పై హీరో కేరింగ్!

బాద్‌షా షారుఖ్ ఖాన్ వెండితెరపైనే కాదు. రియ‌ల్ లైఫ్ లోనూ జెంటిల్‌మెన్ అని మరోసారి నిరూపించారు.;

Update: 2026-05-03 22:30 GMT

బాద్‌షా షారుఖ్ ఖాన్ వెండితెరపైనే కాదు. రియ‌ల్ లైఫ్ లోనూ జెంటిల్‌మెన్ అని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఆయన క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న‌ ప్రతిష్టాత్మక చిత్రం `కింగ్` షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో షారుక్ కు జోడీగా దీపికా ప‌దుకొణే న‌టిస్తోంది. అయితే గర్భిణీ అయిన దీపికా పదుకోన్‌కు మెట్లు ఎక్కే సమయంలో సాయం చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీపిక పట్ల షారుక్ చూపిన శ్రద్ధను చూసి నెటిజన్లు షారుఖ్‌ను రియల్ గ్రీన్ ఫ్లాగ్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు.ఈ ఘటన కింగ్ సినిమా విదేశీ షెడ్యూల్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దీపికా పదుకోణే గర్భవతి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా? ఆమె వృత్తిపరమైన బాధ్యతలను నెరవేరుస్తూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సెట్స్‌లో దీపిక‌ నడవడానికి లేదా మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో షారుఖ్ స్వయంగా ముందుకు వచ్చి ఆమె చేయి పట్టుకుని జాగ్రత్తగా నడిపించారు. ఈ దృశ్యాలు అభిమానుల మనసు గెలుచుకున్నాయి. మహిళలను గౌరవించడంలో ,తోటి నటీనటుల పట్ల మర్యాదగా ప్రవర్తించడంలో షారుఖ్ ఎప్పుడూ ముందుంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

`అందుకే ఆయన్ని అందరూ కింగ్ ఖాన్ అని పిలుస్తారు. ఒక స్టార్ హీరోగా ఉండి కూడా ఇంతటి వినయం ఉండటం అద్భుతం` అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గర్భిణీగా ఉన్న సమయంలోనూ సెట్స్ లో దీపికా చూపిస్తున్న అంకితభావాన్ని అభినందిస్తున్నారు. షారుఖ్ ఖాన్ - దీపికా పదుకోణే కాంబినేషన్‌కు బాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. `ఓం శాంతి ఓం` సినిమాతో దీపికను ఇండస్ట్రీకి పరిచయం చేసిన షారుఖ్ అప్పటి నుండి ఆమెకు ఓ మంచి స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు కలిసి `చెన్నై ఎక్స్‌ప్రెస్`, `హ్యాపీ న్యూ ఇయర్`, `పఠాన్` లాంటి హిట్ చిత్రాల్లోనూ నటించారు.ఈనేప‌థ్యంలో షారుక్ మ‌రోసారి సెంటిమెంట్ గా `కింగ్` లోనూ భాగం చేసారు. దీంతో వెండి తెర‌పై ఈ జోడీ మ‌రోసారి మ్యాజిక్ చేయ‌డం ఖాయ‌మంటున్నారు.

సిద్ధార్థ్ ఆనంద్ పర్యవేక్షణలో సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న `కింగ్` చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందులో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి తొలిసారి వెండితెరను పంచుకుంటున్నారు. యాక్షన్ ఎంటర్టై నర్‌గా రూపొందుతున్న చిత్రం 2026 చిరిక‌ల్లా విడుదలయ్యే అవకాశం ఉంది. షూటింగ్ హడావుడిలో కూడా మాన వీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే షారుఖ్ వ్యక్తిత్వం మరోసారి చర్చకొచ్చింది. సెలబ్రిటీల మధ్య ఉండే ఆరోగ్యకరమైన బంధాలు అభిమానులకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. అటు దీపికా ఆరోగ్యం పట్ల, ఇటు సినిమా క్వాలిటీ పట్ల షారుఖ్ చూపిస్తున్న శ్రద్ధ `కింగ్` సినిమాను మరింత స్పెషల్‌గా మారుస్తోంది. బాద్‌షా గొప్ప మనసుతో మరోసారి నెటిజన్ల హృదయాలకు ద‌గ్గ‌ర‌య్యారు.

Tags:    

Similar News