• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దిల్​రాజు పక్కా ...

దిల్​రాజు పక్కా ప్లాన్​.. రియాలిస్టిక్​గా 'సెల్ఫిష్'

By - Tupaki Desk
Update: 2023-07-18 08:51 GMT

స్టార్​ ప్రొడ్యూసర్ బ్రాండ్​తో టాలీవుడ్​లో కొనసాగుతున్న దిల్ రాజు భుజంపై మరో భారం ఉన్న సంగతి తెలిసిందే. బడా హీరోలకు భారీ హిట్​ ఇవ్వడం, ప్రొడక్షన్​ను పాన్ ఇండియా రేంజ్​కు తీసుకెళ్లడంతో పాటు తన ఫ్యామిలీ హీరో ఆశిష్​ను ఇండస్ట్రీలో మంచి స్థాయిలో నిలబెట్టడం.

ఇప్పటికే తొలి ప్రయత్నంగా ఆశిష్​తో తెరకెక్కించిన 'రౌడీ బాయ్స్'.. మిక్స్​డ్​ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్​ హిట్​ అందుకోలేదు. దీంతో ఇప్పుడు ఆశిష్​ రెండో చిత్రం 'సెల్ఫిష్' విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు దిల్​రాజు. ఈ రెండో చిత్రంతో అతడిని ప్రేక్షకులకు బాగా దగ్గర చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ రెండో చిత్రాన్ని కొత్త దర్శకుడు కాశి చేతిలో పెట్టినప్పటికీ.. సినిమా మొత్తం ఆయన హ్యాండోవర్​లోనే నడుస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. సినిమాకు సంబంధించి అన్నీ ఆయనే డిసైట్​ చేస్తున్నట్లు ఆ మధ్యలో కొన్ని కథనాలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా మూవీటీమ్​.. సినిమాకు సంబంధించి రెండు కొత్త పోస్టర్లను కూడా రిలీజ్ చేసింది. ఓ పోస్టర్​లో ఆశిష్​ హీరోయిన్​ ఇవానా వెనక నడుస్తున్నట్లు చూపించారు. మరో దాంట్లో ఓ హోటల్​ మెట్లపై హీరో కూర్చొని ఉండగా హీరోయిన్​ మెట్లు దిగుతూ ఆందోళనగా వెళ్తున్నట్లు కనిపించింది. ఈ పోస్టర్లలోని బ్యాక్​గ్రౌండ్​ చూస్తుంటే ఎంతో నేచురాలిటీగా కనిపించింది.

అలానే మూవీటీమ్​ కూడా ఈ చిత్రాన్ని హైదారాబాద్​లోని రియల్ లొకేషన్స్​లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం షూటింగ్​ శరవేగంగా జరుగుతుందని, ఇవానా, ఆశిష్​పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఫ్రమ్​ బస్ట్లింగ్​ మార్కెట్స్​ టు బేర్ స్ట్రీట్స్​ అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అంటే రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు క్లాస్ అండ్ కామ్​గా ఉంటే​ ఏరియాస్​లో.. ఒరిజినల్​ లొకేషన్స్​లోనే సినిమాను చిత్రీకరిస్తున్నట్లు చెప్పింది.

ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రంలో చైత్ర అనే ఫైనాన్సియల్‌ ఎనలిస్ట్‌గా ఇవానా కనిపించనుందని, ఆశిష్‌ రెడ్డి ఓల్డ్‌ సిటీ కుర్రాడిగా ఓ మాస్‌ పాత్ర పోషిస్తున్నారని మూవీటీమ్​ తెలిపింది. వీరిద్దరి మధ్య నడిచే ప్రేమకథతోనే సినిమా తెరకెక్కించబోతున్నట్లు పేర్కొంది.

అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మాస్​ ఏరియాస్​లో అలానే క్లాస్​ ఏరియాస్​లోనూ రియాలిస్టిక్​గా సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్​ రాజుతో పాటు సుకుమార్‌ రైటింగ్స్‌ కూడా నిర్మిస్తోంది.

Tags:    
  • RowdyBoysFilm 
  • AshishReddy 
  • SelfishMovie 
  • DirectorKasi 

Similar News

తరుణ్ భాస్కర్.. హర్టయ్యారా?

2026-11-25 04:10 GMT

'పాకెట్ రాకెట్స్' సాంగ్.. అమ్మాయి మాయలో పడితే అంతే..

2026-11-25 04:04 GMT

తెలుగులో డిటెక్టివ్ కథలతో సినిమాలు ఎందుకు రావడం లేదు...

2026-11-25 04:04 GMT

పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబోలో ఆ సినిమా వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదా?

2026-11-25 04:03 GMT

యంగ్ హీరో మేకోవ‌ర్‌పై బిగ్ డిబేట్

2026-11-24 18:21 GMT

'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌'తో పోలికా.. ఇది మ‌రీ కామెడీ!

2026-11-24 18:21 GMT

లోలోప‌ల ఏడవాల‌నిపించినా పైకి క‌న్నీళ్లు రావు.. చైతూ ఆవేద‌న‌!

2026-11-24 18:20 GMT

ఆ మూడు టేబుల్స్‌లో ప్రాఫిట్ టేబుల్ ఎంతో ముఖ్యం

2026-11-24 18:19 GMT

కథపై శేష్ పట్టు.. ఈసారి దర్శకుడికి ఫ్రీడమ్!

2026-11-24 18:19 GMT

భోగి వెనుక సంపత్ నంది చిన్ననాటి భయం!

2026-11-24 18:18 GMT

హైద‌రాబాద్‌లో వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్‌తో 'మెగా మ‌ల్టీప్లెక్స్'

2026-11-24 18:15 GMT

కూతురి కోసం తండ్రి పోరాటం.. 'నాన్నకుట్టి' ట్రైలర్ ఎలా ఉందంటే!

2026-11-24 18:14 GMT

Copyright @2026

Powered by Blink CMS