సీతా పయనం టీజర్ టాక్..!
సీతా రామం తరహా లోనే సీతా పయనం టైటిల్ అనిపిస్తున్నా ఆ సినిమాకు ఈ సినిమాకు అసలేమాత్రం సంబంధం లేదని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.;
40 ఏళ్ళ నుంచి నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న అర్జున్ సర్జా దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా సీతా పయనం. ఈ సినిమాలో తన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తుంది. నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సీతా పయనం సినిమాకు సంబంధించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. ఈ టీజర్ చూస్తే ఒక కారులో ప్రయాణం చేసే టైం లో పరిచయమయ్యే హీరో హీరోయిన్ ఆ తర్వాత వారి మధ్య ఏం జరిగింది అన్నది కథ.
సినిమాలో హీరోయిన్ చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. ఆమెది చాలా పెద్ది ఫ్యామిలీ.. మరోపక్క హీరో కూడా ఫైట్లు గట్రా చేస్తూ కనిపించాడు. ఇద్దరు వారి ప్రయాణంలో ప్రేమలో పడతారు కానీ ప్రపోజల్స్ లాంటివి జరగవు. ఇంతకీ ఈ ఇద్దరి పయనం ఎలా జరిగింది.. ఎటు వెళ్లింది అన్నది సీతా పయనం కథ అనిపిస్తుంది. నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా అర్జున్ తన పనితనం చూపించేలా టీజర్ ఉంది.
ఇక ఐశ్వర్య అర్జున్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. నిరంజన్ అనే కొత్త హీరోని పరిచయం చేస్తున్నాడు అర్జున్ సర్జా. ఐతే ఈ సినిమా టీజర్ లో ధ్రువ్ సర్జా సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతని క్యామియో సినిమాకు హైలెట్ కానుంది. అంతేకాదు డైరెక్టర్ అర్జున్ సర్జా కూడా ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి టీజర్ ఆసక్తికరంగా మలిచారు. సీతా రామం తరహా లోనే సీతా పయనం టైటిల్ అనిపిస్తున్నా ఆ సినిమాకు ఈ సినిమాకు అసలేమాత్రం సంబంధం లేదని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
అర్జున్ సర్జా డైరెక్టోరియల్ మూవీ ఎలా ఉండాలో దానికి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ఉంది ఈ సీతా పయనం. మరి ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అందిస్తున్న మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ కి అనూప్ మెలోడీ మ్యూజిక్ అదిరిపోతుంది. సీతా పయనం లో కూడా అనూప్ వర్క్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉందనిపిస్తుంది. అర్జున్ సర్జా దర్శకుడిగా చేస్తున్న ఈ సీతా పయనం మూవీ ప్రేక్షకులను ఎలాంటి పయనాన్ని కలిగిస్తుందో చూడాలి.