జంటకు వేర్వేరు కిచెన్లు.. స్టార్లకు 6 వ్యానిటీ వ్యాన్లు: డైరెక్టర్ ఆరోపణలు

బాలీవుడ్ లో కొందరు నటీనటుల వల్ల ఖర్చు తడిసి మోపెడు అవుతోందని ఇప్పటికే అనేక మంది మేకర్స్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.;

Update: 2025-09-12 07:20 GMT

బాలీవుడ్ లో కొందరు నటీనటుల వల్ల ఖర్చు తడిసి మోపెడు అవుతోందని ఇప్పటికే అనేక మంది మేకర్స్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారి వల్ల బడ్జెట్ పెరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరో బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా కొత్త విషయాలు వెలుగులోకి తెలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ కు అటెండ్ అయిన సంజయ్ గుప్తా, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలు తమ సిబ్బందికి బిల్లు చెల్లించడానికి కూడా ఎప్పుడూ అనుమతించరని తెలిపారు. హృతిక్ రోషన్ సహా పలువురు హీరోలు ఒక మేకప్ ఆర్టిస్ట్, స్పాట్ బాయ్ తో మాత్రమే వర్క్ చేస్తున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు కొందరు అలా కాదని అన్నారు.

కొంతమంది స్టార్లు సెట్‌ లో ఆరు వ్యానిటీ వ్యాన్‌ల కోసం పట్టుబడుతున్నారని వెల్లడించారు. అవి కంపల్సరీ అని చెబుతున్నట్లు చెప్పారు. ఇది నిజమని, సీరియస్ మ్యాటర్ అని అన్నారు. మొదటి వ్యాన్ వ్యక్తిగత స్థలమని, అక్కడ వాహన్ సాబ్ నంగా బైతే హై (సర్ నగ్నంగా కూర్చునేది అక్కడే)ని డైరెక్టర్ సంజయ్ గుప్తా విమర్శించారు.

మేకప్ కోసం ఒకటని, సమావేశాలకు ఒక వ్యాన్ అని, నాలుగోది జిమ్ వ్యాన్ అని తెలిపారు. అంతే కాదు జిమ్ వ్యాన్ లో ట్రైనర్, అసిస్టెంట్, మెయింటెనెన్స్ గైడ్ ఉంటారని తెలిపారు. వారి ఆహారానికి అదనపు ఖర్చు అని చెప్పారు. కొంతమంది స్టార్లు గ్రాము వారీగా భోజనం తూకం వేసే చెఫ్‌లను నియమించుకుంటారని అన్నారు.

వారికి మరో వ్యాన్ అవసరమని తెలిపిన ఆయన, ఐదు వ్యాన్‌లను నిర్వహించే సిబ్బందిని ఉంచడానికి ఆరో వ్యాన్ అవసరమన్నారు. స్టార్ జంటలు పనులు ఇంకా దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించాడు. సెట్స్ లోకి 11 వ్యాన్లు వస్తాయని, ఇంట్లో కలిసి భోజనం చేసే వారికి సెట్స్ లో వేర్వేరు కిచెన్ వ్యాన్లు ఉంటాయని గుర్తు చేశారు.

అదే సమయంలో అమితాబ్ బచ్చన్ వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించారు. మిస్టర్ బచ్చన్ తన సిబ్బందికి డబ్బులు చెల్లించడానికి ఎప్పుడూ తమను అనుమతించరని, వారు తన వాళ్ళు అని చెబుతారని తెలిపారు. మేకప్ మ్యాన్, హెయిర్ స్టైలిస్ట్, డ్రైవర్, స్పాట్ బాయ్ తన బాధ్యత అంటారని పేర్కొన్నారు. ఓ హీరోకు ఇద్దరు లేదా ముగ్గురు ఉండే ఆ టీమ్.. ఇప్పుడు నేటి తారల కోసం 30 మంది బృందంగా మారిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News