బంగారం కోసం అంత‌దూర‌మెళ్లావా స‌మంతా?

ఈ సినిమా కోసం స‌మంత ఏకంగా రెండు రాష్ట్రాలు దాటి మ‌రీ డైరెక్ట‌ర్ని తెస్తుంద‌ట‌. మాలీవుడ్ లో అలెప్పీ కి చెందిన ఓ కొత్త కుర్రాడ్ని త‌న క‌థ‌కి ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేసుకుందిట‌.

Update: 2024-04-29 07:23 GMT

స‌మంత రీలాంచ్ షురూ అయింది. ముందుగా త‌న సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ సంస్థ‌లో 'మా ఇంటి బంగారం' అనే సినిమాని ప్ర‌క‌టించింది. దీంతో అమ్మ‌డు తొలి ప్ర‌య‌త్నం టాలీవుడ్ లోనే ఖారారైంది. నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించ‌గానే మొద‌టి సినిమా ఎక్క‌డ నిర్మిస్తుంది? అన్న చ‌ర్చ అభిమానుల్లో మొద‌లైంది. సొంత భాష త‌మిళ్ లో చేస్తుందా? స‌క్స‌స్ అయిన టాలీవుడ్ లో చేస్తుందా? లేక బాలీవుడ్ మోజులో అక్క‌డ నిర్మిస్తుందా? అని పెద్ద చ‌ర్చ సాగింది. కానీ మెట్టినింటి లాంటా టాలీవుడ్ నే మొద‌టి ఛాయిస్ గా తీసుకుంది.

ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ ఈ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌రు? అన్న‌ది ఇంకా ఖ‌రారు కాలేదు. ఆ వివ‌రాలు త‌ర్వాత అంటూ స్కిప్ కొట్టింది. కానీ ఆమె స‌న్నిహిత వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం ఏంటంటే? ఈ సినిమా కోసం స‌మంత ఏకంగా రెండు రాష్ట్రాలు దాటి మ‌రీ డైరెక్ట‌ర్ని తెస్తుంద‌ట‌. మాలీవుడ్ లో అలెప్పీ కి చెందిన ఓ కొత్త కుర్రాడ్ని త‌న క‌థ‌కి ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేసుకుందిట‌. ఈ క‌థ‌ని ఎంతో నేచుర‌ల్ గా చెప్పాలుట‌. తెలుగుద‌నం ఉట్టిప‌డేలా ఉండాలిట‌.

Read more!

ఇదేమి పాన్ ఇండియా క‌థ కాదుట‌. కేవ‌లం తెలుగు ఆడియ‌న్స్ కి మాత్ర‌మే రీచ్ గొప్ప‌స్టోరీ అని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ క‌థ కోసం మాలీవుడ్ మేక‌ర్ ని రంగంలోకి దించుతుంద‌ని తెలుస్తోంది. తెలుగు నుంచి కొంత మంది ద‌ర్శ‌కుల్ని అనుకున్నప్ప‌టికీ వారు నూరుశాతం న్యాయం చేస్తార‌నే భ‌ర‌సో లేక‌పోవ‌డంతో అంత‌దూరం వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆ డైరెక్ట‌ర్లు అంతా గ‌తంలో తెలుగులో మంచి ఫ్యామిలీ సినిమాలు చేసిన వారేనంట‌.

కానీ ఈ క‌థ‌లో బ‌ల‌మైన ఎమోష‌న్ తో పాటు టెక్నిక‌ల్ గానూ హైలైట్ చేయాల్నిన అంశాలు కొన్ని ఉండ‌టంతో మాలీవుడ్ ఛాన్స్ తీసుకుంటుంటుంద‌ని ప్ర‌చారం సాగుతుంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి. ప్ర‌స్తుతం స‌మంత ఈ ప్రాజెక్ట్ పైనే దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ‌లో తొలి సినిమా కాబ‌ట్టి అన్ని ప‌నుల్ని తానే ద‌గ్గ‌రుండి చూసుకునే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News