సమంత శుభం కంటెంట్ కు రానా ఫిదా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 38వ పుట్టినరోజు సందర్భంగా అందరినీ సర్ప్రైజ్ చేసింది.;

Update: 2025-04-28 07:49 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 38వ పుట్టినరోజు సందర్భంగా అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఈ స్పెషల్ డే సందర్భంగా తన తొలి నిర్మాణ ప్రాజెక్ట్ ‘శుభం’ ట్రైలర్‌ని విడుదల చేసి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చింది. ‘త్రలల మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై సమంత నిర్మిస్తున్న ఈ సినిమాకు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యేలా మృదువైన కథాంశంతో షుభం సినిమా రూపుదిద్దుకుంది.


హనుమాన్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి ఇప్పటికే శుభం ట్రైలర్‌ను ప్రశంసించారు. ట్రైలర్‌లో కనిపించిన ఫీల్ గుడ్ మూడ్, భావోద్వేగం అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా భావోద్వేగాలతో ముడిపడిన కథాంశాన్ని సమంత చాలా చక్కగా ఎంపిక చేసిందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నిర్మాతగా ఆమెకు మంచి టేస్ట్ ఉందని ట్రైలర్ చూపించింది.

ఈ హడావుడిలో టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి కూడా రంగంలోకి దిగాడు. శుభం ట్రైలర్‌ను షేర్ చేస్తూ, "గుడ్ లక్ ఫోక్స్, ఇది ఫన్!" అంటూ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపాడు. రానా మాటలకు సమంత కూడా ఆనందంగా స్పందించింది. "థాంక్యూ రానా" అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం టాలీవుడ్ బ్రదర్‌హుడ్‌కు చక్కటి ఉదాహరణగా నిలిచింది.

‘శుభం’ సినిమా మే 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఒక వైపు నిర్మాతగా, మరోవైపు నటిగా సమంత కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతోంది. ఈ సినిమా విజయం సమంతకు కొత్త విజయాలు తెచ్చిపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక సమంత తరువాతి సినిమాల అప్‌డేట్స్ కోసం కూడా ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇక చివరగా ఆమె ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత పలు ఆఫర్స్ వచ్చినా కూడా సామ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. కంటెంట్ ఎంతో కొత్తగా ఉంటే గాని సినిమాలు చేయకూడదు అని ఆమె ఫిక్స్ అయినట్లు టాక్. ఇక నెక్స్ట్ బాలీవుడ్ లోనే ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News