ఓటీటీకి వచ్చేసిన సమంత సినిమా!

సమంత టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె తెలుగు లో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు;

Update: 2025-06-13 06:10 GMT

సమంత టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె తెలుగు లో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఈమె చివరగా విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె సినిమాలు రావడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో వచ్చిన సినిమా 'శుభం'. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌ కాదు.. అయినా కూడా ఆమె అభిమానులు శుభం సినిమా పట్ల చాలా ఆసక్తిని కనబర్చారు. అంతా కొత్త వారితో రూపొందిన శుభం సినిమాను సమంత తన సన్నిహితులతో కలిసి నిర్మించింది. సినిమా నిర్మించడంతో పాటు స్క్రీన్‌ పై కనిపించింది అనే విషయం తెల్సిందే.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన శుభం సినిమాకు థియేట్రికల్‌ రిలీజ్‌లో ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు. అయితే సినిమాకు పాజిటివ్‌ టాక్ దక్కింది. విభిన్నమైన జోనర్‌, కాస్త కొత్తగా ఉందని ప్రేక్షకులు సైతం రివ్యూలు ఇచ్చారు. హర్షిత్‌ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపుడి లు నటించిన ఈ సినిమాను థియేటర్‌లో చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఓటీటీలో ఈ సినిమా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ జియో హాట్‌ స్టార్‌ ఈ సినిమా స్ట్రీమింగ్‌ మొదలు పెట్టింది. సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో మొదటి రోజు నుంచే అత్యధిక వ్యూస్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా విడుదల సమయంలో సమంత ప్రముఖంగా ప్రచారం చేయడంతో చాలా మంది ఆ సమయంలోనే చూడాలి అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలను ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కి వెళ్లే పరిస్థితి లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను చూడాలి అనుకున్నప్పటికీ ఖర్చుకు భయపడి వెళ్లడం లేదు. ఈ సినిమాను విడుదలైనప్పటి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూశారు. ఎట్టకేలకు సినిమా విడుదల అయింది. థియేట్రికల్‌ రిలీజ్‌ రెస్పాన్స్‌తో పోల్చితే ఓటీటీ స్ట్రీమింగ్‌ రెస్పాన్స్ మరింత పాజిటివ్‌గా వస్తుందని మేకర్స్ మొదటి నుంచే చెబుతున్నారు. అన్నట్లుగానే పాజిటివ్‌ టాక్‌ వస్తుందని తెలుస్తోంది.

సమంత నిర్మాతగా సినిమాలను ముందు ముందు కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి. ఇక ఆమె నటిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయని ఆ మధ్య ప్రకటన వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె సినిమాలు, సిరీస్‌లు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. మయో సైటిస్‌ కారణంగా ఏడాది పాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న సమంత గత కొన్ని నెలలుగా షూటింగ్స్‌ లో పాల్గొంటుంది. ఈమె తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఈమె సౌత్‌ను వదిలి నార్త్‌ ఇండియాకు మారింది. అక్కడే బిజీ అయింది. ఇదే సమయంలో ఆమె రెండో పెళ్లి గురించి కూడా ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News