ఏ సమస్య వచ్చినా ముందు ఆయన దగ్గరికే వెళ్తా
తాజాగా సమంత శుభం సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు గురించి మాట్లాడింది.;
తాజాగా సమంత శుభం సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు గురించి మాట్లాడింది. రీసెంట్ గా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సమంత శుభం సినిమాతో నిర్మాతగా మారి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. మే 9న రిలీజైన శుభం సినిమాకు పెట్టిన బడ్జెట్ శాటిలైట్, థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ రూపంలో ముందే వచ్చేశాయని అన్నారు.
రిలీజ్ తర్వాత శుభం మంచి కలెక్షన్లతో ఆ లాభాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రీసెంట్ గా సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేయగా అందులో సమంత పాల్గొని కొంచెం ఎమోషనల్ అయి కంటతడి కూడా పెట్టుకుంది. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో పాటూ శుభం సినిమాకు తన టీమ్ పడిన కష్టాన్ని మెచ్చుకుంటూ ప్రేమతో కౌగిలించుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు గురించి చాలా గొప్పగా మాట్లాడింది సమంత. సురేష్ బాబు తనకెప్పుడూ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పిన సమంత, తనకే సమస్య వచ్చినా, ఏం జరిగినా వెళ్లి కలిసే మొదటి వ్యక్తుల్లో ఆయనే ఉంటారని తెలిపింది. సురేష్ బాబుకు కథ చెప్పి ఓకే చెప్పించడం ఎంత కష్టమో అందరికీ తెలుసని, కానీ తాను వెళ్లి శుభం గురించి చెప్పగానే ఏం అడగకుండానే చేసేద్దామని సపోర్ట్ చేశారని సమంత తెలిపింది.
సమంత అక్కినేని ఫ్యామిలీకి దూరమైనప్పటికీ దగ్గుబాటి ఫ్యామిలీతో మాత్రం ఇప్పటికీ మంచి అనుబంధాన్ని మెయిన్‌టెయిన్ చేస్తుందని ఆమె మాటల్ని బట్టి అర్థమవుతుంది. గతంలో సురేష్ ప్రొడక్షన్ లో ఓ బేబీ చేసిన సమంతకు రానా తో మంచి మంచి బాండింగే ఉంది. ఇక శుభం సినిమాలో సమంత ఓ గెస్ట్ రోల్ కూడా చేసిందనే విషయం తెలిసిందే.