'శుభం' ఓటీటీ.. సామ్ తనదైన టాలెంట్ తో..
స్టార్ హీరోయిన్ సమంత.. మొన్నటి వరకు నటి మాత్రమే కాగా.. ఇప్పుడు నిర్మాత కూడా. రీసెంట్ గా తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై శుభం మూవీని నిర్మించిన విషయం తెలిసిందే.;
స్టార్ హీరోయిన్ సమంత.. మొన్నటి వరకు నటి మాత్రమే కాగా.. ఇప్పుడు నిర్మాత కూడా. రీసెంట్ గా తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై శుభం మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. కామెడీ హారర్ జోనర్ లో రూపొందిన ఆ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా, మే9వ తేదీన గ్రాండ్ గా రిలీజైంది.
హర్షిత్ రెడ్డి, శ్రియ కొంతం, చరణ్ పేరి, శాలిని కొండేపూడి వంటి పలువురు కొత్త నటీనటులు సినిమాలో భాగం కాగా, సామ్ కూడా క్యామియో రోల్ పోషించారు. అయితే శుభం మూవీ.. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సినిమా రాణించకపోయినా.. సామ్ మాత్రం నిర్మాతగా ఫస్ట్ టెస్ట్ పాస్ అయినట్లే.
అదే సమయంలో శుభం మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులు ప్రముఖ ఓటీటీ జీ సంస్థ కొనుగోలు చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. జీ తెలుగులో వచ్చిన సీరియల్స్ ను సినిమా ప్రమోట్ చేసింది. దీంతో భారీ మొత్తంలో డీల్ కుదిరినట్లు టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక.. డీల్ లో మార్పులు చేసేందుకు ట్రై చేసిందట జీ సంస్థ.
ముందుగా అనుకున్న ఎమౌంట్ కాకుండా తక్కువ ఇస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సామ్.. డీల్ ను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. అదే సమయంలో జీ సంస్థనే తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ వెంటనే సమంత జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో చర్చలు జరిపినట్లు ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.
డీల్ దాదాపు ఖరారైందని.. త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. చర్చలు సానుకూల దిశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శుభం మూవీ ఓటీటీ విషయంలో సామ్.. తన బిజినెస్ టాలెంట్ ను చూపించారని చెప్పాలి. జీ సంస్థతో డీల్ రద్దు అయిన వెంటనే.. స్ట్రాంగ్ వ్యూయర్ షిప్ ఉన్న జియో హాట్ స్టార్ ను సామ్ సెలెక్ట్ ఎంచుకోవడం విశేషం.
అదే సమయంలో పలు వెబ్ సిరీసులతో అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీల్లో సామ్ మెప్పించారు. ఓటీటీ వరల్డ్ తో మంచి రిలేషన్ కలిగి ఉన్నారు. ఇప్పుడు శుభం మూవీ విషయంలో కూడా వెంటనే స్పందించి డీల్ కుదిరేలా పావులు కదిపేశారు. మొత్తానికి సమంత అటు నటిగా.. ఇటు నిర్మాతగా.. తనదైన శైలితో దూసుకుపోతున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.