బన్నీ - అట్లీ.. ఏంటీ మృణాల్ రోల్ అలా ఉండబోతుందా?
కానీ కొన్ని రోజులుగా ఆ మూవీలో అల్లు అర్జున్ సిస్టర్ గా మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దానిపై మూవీ టీమ్ నుంచి ఎవరూ ఎక్కడా లీక్ చేయనప్పటికీ.. వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.;
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. టాలీవుడ్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకుందనే చెప్పాలి. సీతారామం మూవీతో తెలుగులోకి వచ్చిన ముద్దుగుమ్మ.. తన యాక్టింగ్ తో ఒక్కసారిగా ఫిదా చేశారు. సినీ ప్రియుల మదిలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నరనడంలో డౌట్ అక్కర్లేదు.
ఆ తర్వాత హాయ్ నాన్న మూవీతో మరోసారి తెలుగు మూవీ లవర్స్ ను మెప్పించారు. ఇప్పుడు డెకాయిట్ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాలో అడివి శేష్ సరసన నటిస్తున్న మృణాల్ ఠాకూర్.. వచ్చే ఏడాది ఉగాది పండుగ కానుకగా థియేటర్స్ లో రానున్నారు.
అయితే ఇప్పుడు డెకాయిట్ తోపాటు పలు హిందీ సినిమాల్లో నటిస్తున్న అమ్మడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో యాక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు కొన్ని నెలల క్రితం టాక్ వినిపించింది.
కానీ కొన్ని రోజులుగా ఆ మూవీలో అల్లు అర్జున్ సిస్టర్ గా మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దానిపై మూవీ టీమ్ నుంచి ఎవరూ ఎక్కడా లీక్ చేయనప్పటికీ.. వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మంచి స్కోప్ ఉన్న రోల్ కావడంతో ఆమె సినిమాకు ఓకే చెప్పినట్లు ఊహాగానాలు స్ప్రెడ్ అవుతున్నాయి.
సినిమాలో బ్రదర్-సిస్టర్ బాండింగ్ నేపథ్యంలో వచ్చే సీన్స్ హత్తుకుంటాయని టాక్ వినిపిస్తోంది. ఆ ట్రాక్ మూవీ హైలైట్స్ లో ఒకటిగా నిలవనుందట. అందుకే స్టార్ హీరోకు చెల్లెలు రోల్ చేయడానికి కూడా మృణాల్ సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజమెంత ఉందో మాత్రం ఎవరికీ తెలియదు. అసలు యాక్ట్ చేస్తున్నారో కూడా తెలియదు. దీనిపై మృణాల్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
ఇక ఆ క్రేజీ ప్రాజెక్టు విషయానికొస్తే.. అల్లు అర్జున్ విభిన్నమైన పాత్లల్లో కనిపించనున్నట్లు సమాచారం. మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్ లో దీపికా పదుకొణె యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వారిద్దరితోపాటు పలువురు హీరోయిన్స్ నటిస్తున్నారని.. అందులో ఒకరు మృణాల్ అని వినికిడి.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఒక పవర్ ఫుల్ డాన్ కథగా సినిమాను అట్లీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా.. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోందని టాక్.