• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒక్క తప్పిదం..చేజారుతున్న...

ఒక్క తప్పిదం..చేజారుతున్న షోలు!

| ‘రిప్లై 1988’ ఫేమ్ దక్షిణ కొరియా నటుడు గో క్యుంగ్-ప్యో మద్యం తాగి కారు నడిపిన కేసులో తన తప్పును అంగీకరించారు. సియోల్ పోలీస్ స్టేషన్‌కు హాజరై మీడియా ముందు కన్నీటితో క్షమాపణలు చెప్పారు. నవంబర్ 14న ఆయన కారు క్లీనింగ్ ట్రక్కును ఢీకొనడంతో ఓ కార్మికుడు గాయపడ్డాడు. బాధితుడితో రాజీ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.

By - Srikanth Kontham
Update: 2026-11-25 11:30 GMT

కే-డ్రామా రిప్లై ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దక్షిణ కొరియా నటుడు గో క్యుంగ్-ప్యో మద్యం సేవించి కారు నడిపిన కేసులో తప్పిదాన్ని అంగీకరించారు. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత సియోల్‌లోని మాపో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన మీడియా ముందు భావోద్వేగంతో క్షమాపణలు కోరారు. అయితే ప్రమాదంలో గాయపడిన కార్మికుడితో రాజీ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. నల్లటి సూట్‌లో స్టేషన్‌కు చేరుకున్న 36 ఏళ్ల గో మీడియా ముందు పదేపదే తలవంచి తప్పుకు విచారం వ్యక్తం చేసారు.

అందరి నుంచి ఎంతో ప్రేమ.. ఆదరణ పొందినా? ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనితో వాటికి తగిన న్యాయం చేయలేకపోయానని.. క్షమించమని అడగడం తప్ప మరో మాట లేదని క‌న్నీరు పెట్టుకున్నాడు. గంటన్నర పాటు పోలీసులు ఆయన్ను విచారించగా మద్యం మత్తులో కారు నడిపిన ఆరోపణల్లోని చాలా అంశాలను ఆయన అంగీకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

నవంబర్ 14 తెల్లవారుజామున మూడున్న‌ర గంటల ప్రాంతంలో సియోల్‌లోని మాపో-గులోని డాంగ్‌గ్యో-డాంగ్‌లో ఈ ప్రమాదం జరిగింది. గో కారు ఒక క్లీనింగ్ ట్రక్కును ఢీకొట్ట‌గా.. అందులో ఉన్న 60 ఏళ్ల వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో గో రక్తంలో ఆల్కహాల్ శాతం 0.15 శాతంగా నమోదైందని.. ఇది దక్షిణ కొరియాలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే 0.08 శాతం పరిమితి కంటే చాలా ఎక్కువని సమాచారం.

ట్రాఫిక్ ప్రమాదాల నిర్వహణ ప్రత్యేక చట్టం కింద గాయాలకు సంబంధించిన ఆరోపణలు కూడా చేర్చాలా వద్దా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదం తర్వాత గో కారును కొద్దిగా పక్కకు జ‌రిపినా? ఘటనా స్థలంలో తగిన సహాయక చర్యలు తీసుకున్నారని.. అక్కడున్న ఇద్దరు సిబ్బందికి క్షమాపణ చెప్పి పోలీసులు వచ్చేవరకు అక్కడే ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. బాధితుడు ఆసుపత్రికి వెళ్లలేదని.. నొప్పి లేదని చెప్పడంతో సిమ్యులేషన్ అవసరం పడకపోవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి.

బాధిత కార్మికుడితో రాజీ కుదుర్చుకునే ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో స్వయంగా వెళ్లి అతడిని కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటున్నట్లు గో తెలిపారు. ప్రమాదం గురించి తన కోసమే బాధితుడు ఆందోళన పడటం పట్ల మరోసారి విచారం వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో గో పాల్గొన్న పలు వెరైటీ షోల నుంచి ఆయన సీన్లను తొలగి స్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 29న ప్రారంభం కానున్న `ది విలేజ్ బార్బర్ 2`లో ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని బృందం తెలిపింది. ఆయన ఏజెన్సీ సీఎల్&ఎన్ కంపెనీ కూడా గో తన తప్పును గుర్తించి పశ్చాత్తాపపడుతున్నారని.. ఎలాంటి క్రమశిక్షణా చర్యలనైనా వినయంగా స్వీకరించి నష్టపరిహార బాధ్యతలను నెరవేరుస్తారని ప్రకటించింది.

Tags:    
  • gokyungpyo 
  • reply1988 
  • koreanactor 
  • kdrama 
  • drunkdriving 
  • southkorea 

Similar News

అన్నాచెల్లెళ్ల కథే.. మరి ఈ ట్విస్ట్ ఏంటి?

2026-11-25 11:02 GMT

రెట్రో లుక్‌తో ఆకట్టుకుంటున్న అనుపమ

2026-11-25 11:02 GMT

విశ్వంభర.. సంక్రాంతికి వస్తే సరిపోతుందా?

2026-11-25 11:02 GMT

Tupaki Exclusive: ఫౌజీ గ్లింప్స్ లో వచ్చిన ఫైట్ నేనే డిజైన్ చేశా.. అది సాంపిల్ మాత్రమే...

2026-11-25 10:47 GMT

Tupaki Exclusive: భోగి తెలంగాణ సినిమా కాదు...

2026-11-25 10:43 GMT

దేశం ముందు.. కళ తర్వాత.. పాక్ ఆర్టిస్టుల కంటెంట్‌పై హాట్ టాపిక్

2026-11-25 10:30 GMT

కూతురు బర్తడే స్పెషల్.. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ!

2026-11-25 10:10 GMT

సంబ‌రాల బాబు సౌండ్ గ‌ట్టిగానే చేయాలి!

2026-11-25 10:10 GMT

9వ తరగతిలో విద్యార్థి కాల్పులు.. సినిమా ప్రభావమా!

2026-11-25 10:09 GMT

ఆషిఖి రేంజు మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీలో దురంధ‌ర్ బ్యూటీ

2026-11-25 10:09 GMT

ఓడిపోయినా పర్వాలేదు.. ధైర్యంగా ముందుకెళ్లాలి!

2026-11-25 09:04 GMT

Copyright @2026

Powered by Blink CMS