• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  9వ తరగతిలో విద్యార్థి...

9వ తరగతిలో విద్యార్థి కాల్పులు.. సినిమా ప్రభావమా!

| కేరళలోని పాలక్కడ్ జిల్లా పరుదూర్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బుల్లెట్ గోడకు తగలగా, మరో విద్యార్థి చేతికి గాయమైంది. తుపాకీ తన తాతదని సమాచారం. ఘటనలో ఉద్దేశపూర్వకత లేదని పోలీసులు తెలిపారు. ‘యానిమల్’ సినిమాలోని క్లాస్‌రూమ్ గన్ సీన్‌తో ఈ ఘటనను కొందరు పోలుస్తున్నారు.

By - Ramesh Palla
Update: 2026-11-25 10:09 GMT

సినిమాల్లో చూపించే మంచిని ఎంత మంది ఫాలో అవుతారు అనే విషయం చెప్పడం కష్టం, కానీ చెడు మాత్రం కచ్చితంగా కొంత మంది ఫాలో అవుతున్నారు. సినిమాల్లో చూపించిన దొంగతనాలు, సినిమాల్లో వచ్చే హత్యలను చూసి నిజ జీవితంలో ప్రయత్నిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ మధ్య ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు, ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్న సమయంలో ఒక మలయాళ సినిమాలోని హత్య సీన్‌ చూసి ఇన్సిపిరేషన్‌ తో అలా హత్య చేశాను అని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. సినిమాల్లో ఉన్న సీన్స్‌ను ఇన్సిపిరేషన్‌ గా తీసుకుని చాలా మంది ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు రణబీర్‌ కపూర్‌ హీరోగా నటించిన యానిమల్‌ సినిమాలోని క్లాస్‌రూం గన్‌ సీన్‌ ను ఒక విద్యార్థి ఫాలో అయ్యాడా అనిపించే విధంగా ఒక సంఘటన జరిగింది. అది కూడా 9వ తరగతి క్లాస్‌ రూంలో... ఉపాధ్యాయులు సైతం భయాందోళనతో పరుగులు తీశారట.

కేరళ రాష్ట్రంలో పాలక్కడ్‌ జిల్లా...

పూర్తి వివరాల్లోకి వెళ్తే...కేరళ రాష్ట్రం పాలక్కడ్ జిల్లా త్రిత్తాల పరిధిలో పల్లిప్పురంలో ఉండే పరుదూర్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 9వ తరగతి క్లాస్‌లో రెండో పీరియడ్‌ నడుస్తోంది. తరగతి గదిలో ఉపాద్యాయుడు లేని సమయంలో ఒక విద్యార్థి తన వద్ద ఉన్న తుపాకీ తీసి సరదాగా స్నేహితులకు చూపించాలి అనుకున్నాడు. కానీ అది మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ ఒకటి గోడకు తగలగా, రెండో తూట అతడి స్నేహితుడే అయిన మరో విద్యార్థి చేతికి తగిలింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని పోలీసులు తెలియజేశారు. సరదాగా విద్యార్ది గన్ పట్టుకుని వచ్చాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. సినిమాల ప్రభావంతోనే ఇలాంటివి జరుగుతున్నాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. స్నేహితుల వద్ద గొప్పలు చెప్పుకోవడం కోసం ఆ విద్యార్థి ఇలా చేసి ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

క్లాస్ రూంలో తుపాకీ కాల్పులు...

గాయపడ్డ విద్యార్థి ఆరోగ్యం బాగానే ఉందని, అతడికి చేతికి చికిత్స నిర్వహించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు ఆ బాలుడి వద్దకు గన్‌ ఎలా వచ్చింది అనే విషయంలోకి వెళ్తే.. ఆ తుపాకీ అతడి తాతదిగా చెబుతున్నారు. చాలా ఏళ్ల క్రితం తాగ వేట కోసం దాన్ని వినియోగిస్తూ ఉండేవాడట. దానికి సరైన అనుమతులు సైతం లేవని స్థానికులు అంటున్నారు. ఆ విషయాన్ని నిర్ధారించాల్సి ఉంది. ఘటన చాలా పెద్దది అయినప్పటికీ ప్రాణ నష్టం జరగలేదు కనుక అంతా ఊపిరి పీల్చుకున్నారు.

యానిమల్‌ సీన్‌ రీ క్రియేట్‌...

సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ సినిమాలోనూ హీరో తన అక్కను ఏడిపించారు అంటూ ఒక క్లాస్‌ కి తుపాకీ తీసుకు వెళ్తాడు. అతడు కూడా గన్‌ ను ఎవరి పై గురి పెట్టకుండా కిందికి, పైకి కాల్చుతాడు. ఆ సీన్‌ లో ఎవరికి ఎలాంటి గాయం కాలేదు. ఈ విద్యార్థి సైతం ఫ్రెండ్స్ వద్ద గొప్పలు పోవాలి అనే ఉద్దేశంతో అలా చేసి ఉంటాడని కొందరు అంటున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సాధారణంగా సోషల్‌ మీడియాలోనూ ఇలాంటి వీడియోలను చూడకుండా పిల్లలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కొందరు అంటున్నారు. ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో ఫిల్మ్‌ మేకర్స్‌ సైతం ఇలాంటి సీన్స్‌ విషయంలో ఆచితూచి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Tags:    
  • kerala 
  • palakkad 
  • schoolincident 
  • classroomshooting 
  • animalmovie 

Similar News

కూతురు బర్తడే స్పెషల్.. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ!

2026-11-25 10:10 GMT

సంబ‌రాల బాబు సౌండ్ గ‌ట్టిగానే చేయాలి!

2026-11-25 10:10 GMT

ఆషిఖి రేంజు మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీలో దురంధ‌ర్ బ్యూటీ

2026-11-25 10:09 GMT

ఓడిపోయినా పర్వాలేదు.. ధైర్యంగా ముందుకెళ్లాలి!

2026-11-25 09:04 GMT

టాలీవుడ్ ట్యాలెంట్‌కి ఈ పంజాబీ గాయ‌కుడే స్ఫూర్తి..!

2026-11-25 09:04 GMT

'కీడా కోలా'పై దర్శకుడు కరుణ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-25 08:32 GMT

బ్రహ్మాస్త్రలో హాలీవుడ్ ప్రభావమే మైనస్ అయిందా?

2026-11-25 08:32 GMT

హీరోలకు లేని అభ్యంతరం దీపికకు ఎందుకు?

2026-11-25 08:14 GMT

ఆకాశంలో ఒక తార.. చిరు, నాని ఏమన్నారంటే..

2026-11-25 08:13 GMT

క‌పూర్ సిస్టర్స్ ముందు ఆ హాలీవుడ్ తారలు సరిపోరా?

2026-11-25 08:13 GMT

మంచు కొండల్లో ట్రెక్కింగ్.. అదరగొట్టిన కాయదు లోహర్

2026-11-25 08:13 GMT

Copyright @2026

Powered by Blink CMS