• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కీడా కోలా'పై దర్శకుడు...

'కీడా కోలా'పై దర్శకుడు కరుణ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

| తెలుగులో కొత్త తరహా సినిమాలను పట్టించుకోకుండా, ఇతర భాషల్లో వస్తే ప్రశంసిస్తామని దర్శకుడు కరుణ కుమార్ అన్నారు. ‘కీడా కోలా’ మలయాళంలో వచ్చి ఉంటే రీమేక్ హక్కుల కోసం ఎగబడేవాళ్లమని తరుణ్ భాస్కర్‌ను ప్రశంసించారు. ‘ENE Repeat’ సక్సెస్ మీట్‌లో విశ్వక్ సేన్ తన పాత కష్టాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

By - Madhu Reddy
Update: 2026-11-25 08:32 GMT

మన తెలుగులో ఏదైనా కొత్త తరహా సినిమా వస్తే పెద్దగా పట్టించుకోం కానీ, అదే సినిమా వేరే భాషలో వస్తే మాత్రం ఆహా ఓహో అంటూ ఆకాశానికెత్తేస్తాం. ఈ ఆలోచనా విధానం మారాలని దర్శకుడు కరుణ కుమార్ బలంగా చెప్పారు. మన చుట్టూ ఉండే చిన్న విషయాలను కూడా అంతర్జాతీయ స్థాయిలో చూపించొచ్చనేది ఒక సరికొత్త ఆలోచన. తరుణ్ భాస్కర్ తీసిన ‘కీడా కోలా’ సినిమా గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆ విశేషాలు ఇలా వున్నాయి ..

మలయాళంలో వచ్చి ఉంటే ఎగబడి కొనేవాళ్లం:

నవంబర్ 19న విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ENE Repeat) బాక్సాఫీస్ వద్ద 6 రోజుల్లోనే రూ.42.25 కోట్ల గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో జరిగిన సక్సెస్ మీట్‌లో కరుణ కుమార్ మాట్లాడుతూ, తరుణ్ భాస్కర్ గత చిత్రం ‘కీడా కోలా’ను గుర్తుచేశారు. ఇక కూల్‌డ్రింక్ బాటిల్‌లో బొద్దింక పడితే దాంతో డబ్బులు సంపాదించాలనుకునే ఒక వింత క్రైమ్ కామెడీని ఆయన అద్భుతంగా తీశారని అన్నారు. అదే సినిమా మలయాళంలో వచ్చి ఉంటే మనం రీమేక్ రైట్స్ కొనుక్కుని నెత్తిన పెట్టుకునేవాళ్లమని, తరుణ్ తెలుగువాడు కావడం మన అదృష్టమని ప్రశంసించారు.

ఎమోషనల్ అయిన విశ్వక్ సేన్ :

ఈ సక్సెస్ మీట్‌లో హీరో విశ్వక్ సేన్ తన పాత రోజులను గుర్తుచేసుకుని చాలా ఎమోషనల్ అయ్యారు. 21 ఏళ్ల వయసులో ఆర్థిక ఇబ్బందులు పడుతూ, అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన రోజులను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, తనను తక్కువ అంచనా వేస్తున్న వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తాను చేయబోయే సినిమాల స్టైల్ పూర్తిగా వేరే లెవెల్‌లో ఉంటుందని స్పష్టం చేశారు.

మన దగ్గర ఉన్న అద్భుతమైన టాలెంట్‌ను, కొత్త కథలను మనం ముందుగా గుర్తించి ప్రోత్సహించాలని కరుణ కుమార్ మాటలు మరోసారి గుర్తుచేశాయి. ‘కీడా కోలా’ అయినా, ఇప్పుడు వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘ఈఎన్ఈ రిపీట్’ అయినా తరుణ్ భాస్కర్ మార్క్ మేకింగ్ ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటుంది. ఇక మన తెలుగు దర్శకుల కొత్త ఆలోచనలను మనమే గౌరవించుకుంటే, మన సినిమా స్థాయి ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది.

#TharunBhascker తెలుగులో పుట్టడమే ఆయన చేసుకున్న దురదృష్టమని నేను భావిస్తాను. - Actor Karuna Kumar #ENERepeat #ENE2 #VishwakSen #Tollywood #Tupaki Follow 👉 @tupaki_official https://t.co/Cme5NFmZ05

— Tupaki (@tupaki_official) November 24, 2026
Tags:    
  • karunakumar 
  • tarunbhaskar 
  • keedacola 
  • enerepeat 
  • vishwaksen 

Similar News

బ్రహ్మాస్త్రలో హాలీవుడ్ ప్రభావమే మైనస్ అయిందా?

2026-11-25 08:32 GMT

హీరోలకు లేని అభ్యంతరం దీపికకు ఎందుకు?

2026-11-25 08:14 GMT

ఆకాశంలో ఒక తార.. చిరు, నాని ఏమన్నారంటే..

2026-11-25 08:13 GMT

క‌పూర్ సిస్టర్స్ ముందు ఆ హాలీవుడ్ తారలు సరిపోరా?

2026-11-25 08:13 GMT

మంచు కొండల్లో ట్రెక్కింగ్.. అదరగొట్టిన కాయదు లోహర్

2026-11-25 08:13 GMT

ఎన్నేళ్లు గడిచినా వర్మ మారలేదు..ఇప్పటికీ అదే తిరుగుబాటు!

2026-11-25 07:08 GMT

తెలంగాణ యాస..1960ల నాటి కొత్త ప్రపంచం!

2026-11-25 07:08 GMT

నారా రోహిత్‌.. నవంబర్‌ ఎంత స్పెషల్ అంటే..

2026-11-25 07:07 GMT

అందాల పోటీల్లో కొత్త చరిత్ర.. కేరళ అమ్మాయి అరుదైన ఘనత!

2026-11-25 07:07 GMT

చంద్రబోస్ ఇంట్లో తరుణ్ భాస్కర్‌కు స్పెషల్ ఫ్యాన్!

2026-11-25 07:05 GMT

అంతరిక్షం కంటే ముందు 150 కాఫీ షాప్‌లకు వెళ్లిందట..!

2026-11-25 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS