• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చంద్రబోస్ ఇంట్లో తరుణ్...

చంద్రబోస్ ఇంట్లో తరుణ్ భాస్కర్‌కు స్పెషల్ ఫ్యాన్!

| పాటల రచయిత చంద్రబోస్ కూతురు అమృతవర్షిణికి దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో ఫొటో దిగాలనే కోరిక ఎట్టకేలకు నెరవేరింది. 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' సక్సెస్ మీట్‌కు కూతురిని తీసుకొచ్చిన చంద్రబోస్.. ఆమె కోరికను వేదికపైనే తరుణ్‌కు చెప్పారు. వెంటనే ఆయన అమృతవర్షిణితో సెల్ఫీ దిగారు. ఈ విషయాన్ని చంద్రబోస్ కార్యక్రమంలో వెల్లడించారు.

By - M Prashanth
Update: 2026-11-25 07:05 GMT

ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు, డైరెక్టర్లతో వర్క్ చేసిన పాటల రచయిత చంద్రబోస్‌కు ఒక చిన్న కోరిక తీర్చడానికి ఇంతకాలం పట్టిందట. అదీ తన కూతురు అడిగిన కోరిక. ఈ నగరానికి ఏమైంది రిపీట్ సక్సెస్ మీట్‌లో ఈ విషయాన్ని చంద్రబోస్ స్వయంగా చెప్పారు. తన కూతురు ఇప్పటివరకు ఏ సినిమా సెలబ్రిటీ గురించి అడగలేదని, కానీ ఒక దర్శకుడితో మాత్రం ఫొటో దిగాలని కోరినట్లు వెల్లడించారు. ఆ దర్శకుడు మరెవరో కాదు తరుణ్ భాస్కర్.

చంద్రబోస్‌కు ఇండస్ట్రీలో పరిచయాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమాలకు ఎన్నో పాటలు రాశారు. ఆర్ఆర్ఆర్‌లో నాటు నాటు పాటతో ఆస్కార్ కూడా అందుకున్నారు. ఇక సుకుమార్‌తో అయితే ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆర్య నుంచి రంగస్థలం, పుష్ప వరకు ఎన్నో సినిమాలకు కలిసి వర్క్ చేశారు. ఇంతమంది పెద్ద దర్శకులతో పరిచయాలున్న చంద్రబోస్‌ను కూతురు మాత్రం తరుణ్ భాస్కర్‌తో ఫొటో కావాలని అడగడం విశేషం.

తన కూతురు అమృతవర్షిణి సినిమా వాళ్ల గురించి పెద్దగా అడగదని చంద్రబోస్ చెప్పారు. కానీ తరుణ్ భాస్కర్‌ను కలవాలని చాలాకాలంగా కోరుతోందట. అయితే తరుణ్‌తో అప్పటివరకు కలిసి వర్క్ చేయకపోవడంతో నేరుగా వెళ్లి ఫొటో అడగడం ఇబ్బందిగా అనిపించేదని తెలిపారు. ఎప్పుడైనా కలిసి సినిమా చేసినప్పుడు తీసుకెళ్తానని కూతురికి చెప్పేవారట. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది రిపీట్‌తో ఆ అవకాశం వచ్చిందని వివరించారు.

ఈ సినిమాలో పాట రాసిన చంద్రబోస్ సక్సెస్ వేడుకకు తన కూతురిని కూడా తీసుకొచ్చారు. స్టేజ్ మీదే అమృతవర్షిణి కోరికను తరుణ్‌కు చెప్పారు. వెంటనే తరుణ్ ఆమెతో సెల్ఫీ దిగారు. ఆ తర్వాత చంద్రబోస్‌తో కూడా ఫొటో తీసుకున్నారు. అంతేకాదు, తన కూతురు ఈ నగరానికి ఏమైంది రిపీట్ చూసి పది మార్కులకు పది ఇచ్చిందని చంద్రబోస్ చెప్పడం మరో హైలెట్.

నిజానికి తరుణ్ భాస్కర్ ఇప్పటివరకు డైరెక్టర్‌గా తీసిన సినిమాలు తక్కువే. పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు కూడా చేయలేదు. అయినా పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని కామెడీ, డైలాగ్స్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోలతో ఫొటోలు దిగాలని కోరుకునే అభిమానుల మధ్య తరుణ్ లాంటి దర్శకుడికి కూడా ఈ స్థాయిలో అభిమానం ఉండటం చెప్పుకోదగ్గ విషయమే.

ఇక ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది రిపీట్‌కు కూడా యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం గ్యాంగ్‌ను మళ్లీ థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. ఈ సక్సెస్‌తో తరుణ్ తన తర్వాతి సినిమాకు మరింత పెద్ద మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నట్లు చెప్పారు. ఏ, బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే సినిమా తీస్తానని వెల్లడించారు.



నా కూతురు నన్ను ఎప్పుడూ ఏమీ అడగదు. కానీ చాలా రోజులుగా తరుణ్ గారితో ఒక ఫోటో దిగాలని మాత్రం నన్ను అడుగుతూనే ఉంది. అయితే, అప్పటికి నేను తరుణ్ గారితో కలిసి పనిచేయలేదు. ఆయనతో పనిచేసే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తానని నా కూతురికి మాట ఇచ్చాను. ఇప్పుడు తరుణ్ గారితో కలిసి పనిచేశాను... విజయం సాధించాం... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, ఆయనతో ఫోటో దిగడం కోసం నా కూతురిని తీసుకొచ్చాను. - Lyricist #Chandrabose #ENERepeat #ENE2 #TharunBhascker #VishwakSen #Tollywood #Tupaki Follow 👉 @tupaki_official

— Tupaki (@tupaki_official) November 24, 2026


Tags:    
  • chandrabose 
  • tharunbhascker 
  • eenagaranikiemaindi 
  • eenagaranikiemaindirepeat 

Similar News

ఎన్నేళ్లు గడిచినా వర్మ మారలేదు..ఇప్పటికీ అదే తిరుగుబాటు!

2026-11-25 07:08 GMT

తెలంగాణ యాస..1960ల నాటి కొత్త ప్రపంచం!

2026-11-25 07:08 GMT

నారా రోహిత్‌.. నవంబర్‌ ఎంత స్పెషల్ అంటే..

2026-11-25 07:07 GMT

అందాల పోటీల్లో కొత్త చరిత్ర.. కేరళ అమ్మాయి అరుదైన ఘనత!

2026-11-25 07:07 GMT

అంతరిక్షం కంటే ముందు 150 కాఫీ షాప్‌లకు వెళ్లిందట..!

2026-11-25 07:05 GMT

ఈ కొత్త హీరోయిన్‌కు డబుల్ ఛాన్స్ ఉందే!

2026-11-25 06:04 GMT

పవన్ కళ్యాణ్‌తో గత జీవితం.. సంపాదన గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణు దేశాయ్

2026-11-25 06:04 GMT

టాలెంట్ ఉందంటారు.. మరి ఛాన్స్ ఎందుకివ్వరు!

2026-11-25 06:04 GMT

రాజమౌళి కొడుక్కి తెలుగు టైటిల్ దొరకలేదా..?

2026-11-25 06:03 GMT

ఎలిగెంట్ లుక్‌లో ఆకట్టుకున్న నమ్రతా శిరోద్కర్

2026-11-25 05:14 GMT

ఒక్క మెయిల్‌తో విశ్వక్ కెరీర్ ఆగిపోయేదా!

2026-11-25 04:40 GMT

Copyright @2026

Powered by Blink CMS