• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళి కొడుక్కి తెలుగు...

రాజమౌళి కొడుక్కి తెలుగు టైటిల్ దొరకలేదా..?

| ఫహద్ ఫాజిల్ హీరోగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'అసరీరి' జనవరి 1, 2027న విడుదల కానుంది. కార్తికేయ ఈ సినిమాను తెలుగులో 'అశరీరి' పేరుతో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే తెలుగు పదం కాని టైటిల్‌ను అలాగే ఉంచడంపై భాషాభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉండటంతో టైటిల్ మారుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

By - Ramesh Palla
Update: 2026-11-25 06:03 GMT

మలయాళ స్టార్‌ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా రూపొందిన తమిళ్‌ మూవీ 'అసరీరి' జనవరి 1, 2027న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ సినిమాకు 96, సత్యం సుందరం సినిమాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరు సొంతం చేసుకున్న ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈయన దర్శకత్వంలో సినిమా అనగానే తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉంది. ఈయన నుంచి వచ్చిన 96, సత్యం సుందరం సినిమాలు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. కమర్షియల్‌ ఫలితం పక్కన పెడితే ఈ సినిమాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమాల తర్వాత ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఫహద్‌ ఫాజిల్‌ సినిమా...

ఫహద్‌ ఫాజిల్‌ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది. కనుక అసరీరి సినిమాను తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ డబ్‌ చేసి విడుదల చేసేందుకు రెడీ అయ్యాడు. కొన్ని వారాల క్రితమే ఫహద్‌ ఫాజిల్ యొక్క డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ సినిమాను కార్తికేయ తీసుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ ను మిగిల్చింది. ఇప్పుడు మరోసారి ఫఫా పై నమ్మకంతో ఈ సినిమా డబ్బింగ్‌ రైట్స్ తీసుకుని విడుదలకు సిద్ధం అయ్యాడు. తన బ్యానర్‌ ద్వారా విడుదల చేయడం ద్వారా కచ్చితంగా మినిమం బజ్‌ క్రియేట్‌ కావడం, రాజమౌళితో పాటు ఇతర కుటుంబ సభ్యులు సినిమా ప్రమోషన్‌ లో పాల్గొనడం ద్వారా కచ్చితంగా ఈ సినిమాకు పబ్లిసిటీ భారీగా దక్కడం అనేది కామన్‌, అయితే ఇక్కడ టైటిల్‌ విషయమై వివాదం మెల్ల మెల్లగా రాజుకుంటోంది.

అశరీరి మూవీతో...

తెలుగులో ఈ సినిమాను 'అశరీరి' అనే టైటిల్‌ తో డబ్‌ చేసి విడుదల చేయబోతున్నారు. ఇది తెలుగు పదం కాదు కనుక విమర్శలు మొదలు అయ్యాయి. మనం ఇతర భాషల్లో సినిమాలను విడుదల చేయడం కోసం అన్ని భాషలకు తగ్గట్లుగా సినిమా టైటిల్స్ ను పెడుతున్నాం, ఒకవేళ తెలుగు పదాలతో సినిమాలు వస్తే, డబ్‌ చేసే సమయంలో అక్కడి భాష పేరుతో విడుదల చేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం ఇతర భాషలకు సంబంధించిన టైటిల్స్ ను ఉన్నది ఉన్నట్లుగా ఉంచి విడుదల చేస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్‌ అంటూ చాలా మంది తెలుగు భాషాభిమానులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని పదాలు ఇంగ్లీష్ లేదా, పేర్లు ఉంటే వాటిని ఉన్నది ఉన్నట్లుగా ఉంచడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇలా అర్థం కాని పదాలను తెలుగు సినిమా టైటిల్స్ అంటే ఎలా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కార్తికేయ మాత్రమే కాకుండా చాలా మంది తప్పు చేస్తున్నారని భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్తికేయ సమర్పణలో...

తమిళ్‌ లో ఆ టైటిల్‌ ఉంటే, దాన్నే తెలుగులో పెట్టాలని లేదు, దాన్ని మార్చి పెట్టుకునే అవకాశం ఉంది. ప్రేమ్‌ కుమార్‌ గత చిత్రం టైటిల్‌ తమిళ్‌ లో ఒకటి ఉంటే, తెలుగులో సత్యం సుందరం అని పెట్టారు. ఇప్పుడు అదే విధంగా తెలుగులో ఈ సినిమాకు వేరే టైటిల్‌ ను పెట్టి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టైటిల్‌ విషయంలో వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కార్తికేయకు వచ్చి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కార్తికేయ కాస్త ఆలోచించి ఈ సినిమాకు తెలుగులో మంచి పేరు పెట్టి ఉంటే మరింత బజ్‌ క్రియేట్ అయ్యి ఉండేది కదా అని కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా విషయంలో వివాదం రాజుకుంటుంది. విడుదలకు దాదాపుగా అయిదు వారాల సమయం ఉంది. కనుక అప్పటి వరకు కార్తికేయ ఏమైనా చేస్తాడా లేదంటే అదే టైటిల్‌ను కొనసాగించి, ప్రేక్షకులను కన్విన్స్ చేస్తాడా అనేది చూడాలి.

Tags:    
  • fahadhfaasil 
  • asareeri 
  • ashareeri 
  • karthikeya 
  • premkumar 

Similar News

ఈ కొత్త హీరోయిన్‌కు డబుల్ ఛాన్స్ ఉందే!

2026-11-25 06:04 GMT

పవన్ కళ్యాణ్‌తో గత జీవితం.. సంపాదన గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణు దేశాయ్

2026-11-25 06:04 GMT

టాలెంట్ ఉందంటారు.. మరి ఛాన్స్ ఎందుకివ్వరు!

2026-11-25 06:04 GMT

ఎలిగెంట్ లుక్‌లో ఆకట్టుకున్న నమ్రతా శిరోద్కర్

2026-11-25 05:14 GMT

ఒక్క మెయిల్‌తో విశ్వక్ కెరీర్ ఆగిపోయేదా!

2026-11-25 04:40 GMT

మాస్ సంచ‌ల‌నం వాట్ నెక్స్ట్ ?

2026-11-25 04:39 GMT

మహేష్ బాబు ఎంకరేజ్ చేసిన ఆ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఏమైపోయాడు...

2026-11-25 04:23 GMT

తరుణ్ భాస్కర్.. హర్టయ్యారా?

2026-11-25 04:10 GMT

'పాకెట్ రాకెట్స్' సాంగ్.. అమ్మాయి మాయలో పడితే అంతే..

2026-11-25 04:04 GMT

తెలుగులో డిటెక్టివ్ కథలతో సినిమాలు ఎందుకు రావడం లేదు...

2026-11-25 04:04 GMT

పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబోలో ఆ సినిమా వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదా?

2026-11-25 04:03 GMT

Copyright @2026

Powered by Blink CMS