• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలెంట్ ఉందంటారు.. మరి...

టాలెంట్ ఉందంటారు.. మరి ఛాన్స్ ఎందుకివ్వరు!

| ‘ENE Repeat’ సక్సెస్ మీట్‌లో నటుడు అభినవ్ గోమటం తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకున్నారు. డెల్‌లో నెలకు రూ.30 వేల జీతం వదిలేసి సినిమాల్లోకి వచ్చానని, ఏడాది మొత్తం కష్టపడితే రూ.30 వేలు మాత్రమే సంపాదించానని తెలిపారు. నటన బాగుందని మెచ్చుకున్నా అవకాశాలు ఇవ్వని దర్శకులు చాలామందని, ఇన్ని కష్టాలు దాటినందుకు తనకు తానే థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అన్నారు.

By - M Prashanth
Update: 2026-11-25 06:04 GMT

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉందని మెచ్చుకునేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ అదే టాలెంట్‌కు అవకాశం ఇచ్చే విషయంలో మాత్రం కొందరు వెనకడుగు వేస్తుంటారు. అభినవ్ గోమటం కెరీర్ ప్రారంభంలోనూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయట. ఈ నగరానికి ఏమైంది రిపీట్ సక్సెస్ మీట్‌లో అభినవ్ చెప్పిన కొన్ని మాటలు ఇండస్ట్రీలో కొత్తగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు కూడా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుల దగ్గర తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఓపెన్‌గా మాట్లాడారు.

తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందులను అభినవ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు డెల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడినని, యాక్టింగ్ మీద ఆసక్తితో ఆ జాబ్ వదిలేసినట్లు చెప్పారు. అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లానని తెలిపారు. కొందరు దర్శకులు తన యాక్టింగ్ బాగుందని మెచ్చుకునేవారని, సినిమా చేద్దామని చెప్పి చివరికి ఛాన్స్ ఇచ్చేవారు కాదని వెల్లడించారు. అలా చాలాసార్లు నిరాశ ఎదురైనట్లు అభినవ్ చెప్పుకొచ్చారు.

ఇక్కడ అభినవ్ చెప్పిన జీతం విషయం కూడా ఆశ్చర్యపరిచింది. డెల్‌లో నెలకు రూ.30 వేలు సంపాదించేవాడినని, ఆ ఉద్యోగం వదిలేశాక ఏడాది మొత్తానికి రూ.30 వేలు మాత్రమే వచ్చాయని చెప్పారు. అంటే ఒకప్పుడు నెలలో వచ్చే డబ్బు కోసం ఏడాదంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి అన్నమాట. అయినా యాక్టింగ్ వదిలేసి మళ్లీ ఉద్యోగం వైపు వెళ్లాలని అనుకోలేదని తెలిపారు. ఈ అనుభవాల గురించి చెబుతూనే అభినవ్ మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు.

ఇన్ని ఇబ్బందులు దాటుకుని ఈ స్థాయికి వచ్చినందుకు తనకు తానే థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అభినవ్ అన్నారు. అలా చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు. నార్మల్ గా సక్సెస్ మీట్స్‌లో దర్శకుడు, నిర్మాత, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతుంటారు. అభినవ్ మాత్రం తన కెరీర్‌లో ఎదురైన రిజెక్షన్స్‌ను గుర్తుచేసుకుని ఈ మాట అన్నారు. ముఖ్యంగా అవకాశాలు ఇస్తామని చెప్పి చివరికి పక్కన పెట్టిన అనుభవాలు తనపై ఎంత ప్రభావం చూపించాయో ఈ మాటలను బట్టి అర్థమవుతోంది.

అయితే అభినవ్‌కు ఈ నగరానికి ఏమైంది సినిమాలో కౌశిక్ పాత్ర మంచి బ్రేక్ ఇచ్చింది. 2018లో విడుదలైన ఆ సినిమా తర్వాత అభినవ్ కామెడీ టైమింగ్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇతర హీరోల సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. అయినా కౌశిక్ పాత్రకు ఉన్న గుర్తింపు మాత్రం తగ్గలేదు. ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన రిపీట్‌లో కూడా అదే పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈసారి రివ్యూల్లోనూ అభినవ్ పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.

ఇక రిపీట్ సక్సెస్ సందర్భంగా అభినవ్ మరో విషయం కూడా చెప్పారు. రాజమండ్రి, విజయవాడ, కాకినాడలో థియేటర్లకు వెళ్లినప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఒకే సినిమాను రెండుమూడుసార్లు చూసినట్లు చాలామంది మెసేజ్‌లు పంపుతున్నారని చెప్పారు. ఇందులో సందీప్ రెడ్డి వంగాతో కలిసి నటించిన అనుభవాన్ని కూడా పంచుకున్నారు. బయట సందీప్ గురించి ఎలాంటి అభిప్రాయాలున్నా వ్యక్తిగతంగా చాలా కూల్‌గా ఉంటారని, సెట్‌లో ఆయనతో వర్క్ చేయడం బాగుందని అభినవ్ చెప్పారు.


నాకు Dellలో నెలకు ₹30,000 జీతం వచ్చేది. కానీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి యాక్టింగ్ వైపు వచ్చాను. ఎన్ని ఆడిషన్స్ ఇచ్చానో నాకే లెక్కలేదు. ఎండైనా, వానైనా వెనక్కి తగ్గకుండా ప్రతి ఆడిషన్‌కు వెళ్లేవాడిని. - #AbhinavGomatam #ENERepeat #ENE2 #TharunBhascker #VishwakSen #Tollywood #Tupaki Follow 👉 @tupaki_official

— Tupaki (@tupaki_official) November 24, 2026
Tags:    
  • abhinavgomatam 
  • eenagaranikiemaindi 
  • eenerepeat 
  • telugucinema 

Similar News

ఈ కొత్త హీరోయిన్‌కు డబుల్ ఛాన్స్ ఉందే!

2026-11-25 06:04 GMT

పవన్ కళ్యాణ్‌తో గత జీవితం.. సంపాదన గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణు దేశాయ్

2026-11-25 06:04 GMT

రాజమౌళి కొడుక్కి తెలుగు టైటిల్ దొరకలేదా..?

2026-11-25 06:03 GMT

ఎలిగెంట్ లుక్‌లో ఆకట్టుకున్న నమ్రతా శిరోద్కర్

2026-11-25 05:14 GMT

ఒక్క మెయిల్‌తో విశ్వక్ కెరీర్ ఆగిపోయేదా!

2026-11-25 04:40 GMT

మాస్ సంచ‌ల‌నం వాట్ నెక్స్ట్ ?

2026-11-25 04:39 GMT

మహేష్ బాబు ఎంకరేజ్ చేసిన ఆ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఏమైపోయాడు...

2026-11-25 04:23 GMT

తరుణ్ భాస్కర్.. హర్టయ్యారా?

2026-11-25 04:10 GMT

'పాకెట్ రాకెట్స్' సాంగ్.. అమ్మాయి మాయలో పడితే అంతే..

2026-11-25 04:04 GMT

తెలుగులో డిటెక్టివ్ కథలతో సినిమాలు ఎందుకు రావడం లేదు...

2026-11-25 04:04 GMT

పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబోలో ఆ సినిమా వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదా?

2026-11-25 04:03 GMT

Copyright @2026

Powered by Blink CMS