• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆకాశంలో ఒక తార.. చిరు,...

ఆకాశంలో ఒక తార.. చిరు, నాని ఏమన్నారంటే..

| దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’పై చిరంజీవి, నాని ప్రశంసలు కురిపించారు. దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించిన విధానం, నటీనటుల పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకున్నారు. ముఖ్యంగా సాత్విక వీరవల్లి తొలి సినిమాతోనే ఆకట్టుకుందని నాని ప్రశంసించగా, పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమని చిరంజీవి సూచించారు.

By - M Prashanth
Update: 2026-11-25 08:13 GMT

దుల్కర్ సల్మాన్ నటించిన ఆకాశంలో ఒక తార సినిమాకు ఇండస్ట్రీ నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా చూసిన చిరంజీవి, నాని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ఇద్దరూ కథతో పాటు నటీనటుల పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకున్నారు. ముఖ్యంగా కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి గురించి నాని చెప్పిన వర్డ్స్ హైలెట్ అవుతున్నాయి.

చిరంజీవి ఈ సినిమా తన మనసును ఎంతగానో కదిలించిందని చెప్పారు. దర్శకుడు పవన్ సాధినేని సున్నితమైన కథను ఎంతో అందంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ముఖ్యంగా సెకండాఫ్ చాలా ఎమోషనల్‌గా ఉందని, సినిమా చూస్తున్నంతసేపూ భావోద్వేగానికి లోనైనట్లు తెలిపారు. దుల్కర్ సల్మాన్, సాత్విక తమ సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారని మెచ్చుకున్నారు. శ్రుతి హాసన్, రుహానీ శర్మ నటనకు కూడా మంచి మార్కులు వేశారు.

ఇక జీవీ ప్రకాష్ సంగీతం, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ గురించి కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి సాంకేతిక విభాగం సినిమాకు బాగా ఉపయోగపడిందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ రికమెండ్ చేశారు. ఈ కథ వారిలో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని పేర్కొన్నారు. నిర్మాతలు స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా టీమ్స్‌కు అభినందనలు తెలిపారు.

నాని కూడా సినిమాపై తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పారు. దుల్కర్ చేసిన పాత్రను మరెవరూ ఇంత బాగా చేయలేరని ప్రశంసించారు. ముఖ్యంగా సాత్విక డెబ్యూను మెచ్చుకుంటూ కల్పన పాత్రకు ఆమె తప్ప మరెవరూ సరిపోరన్నట్లుగా కామెంట్ చేశారు. అంతేకాదు, సాత్విక చాలా బాగా ఏడిపిస్తావు అంటూ సరదాగా పేర్కొన్నారు. నాని కూడా శ్రుతి హాసన్ నటనను మెచ్చుకున్నారు. రుహానీ శర్మ పోషించిన బిజిలీ పాత్ర చాలా ముద్దుగా ఉందని చెప్పారు.

దర్శకుడు పవన్ సాధినేని కథను తెరకెక్కించిన విధానం, జీవీ ప్రకాష్ సంగీతం తనకు బాగా నచ్చాయని తెలిపారు. నిర్మాతలు సన్నీ గున్నం, రమ్య గున్నంతో పాటు స్వప్న సినిమా, లైట్ బాక్స్ టీమ్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అయితే చిరంజీవి, నాని ఇద్దరూ సినిమాలోని ఎమోషన్స్‌తో పాటు నటీనటుల గురించి మాట్లాడటం విశేషం. ముఖ్యంగా సాత్వికకు ఇది తొలి సినిమానే అయినా ఇద్దరు హీరోల నుంచి ప్రశంసలు దక్కాయి. మరోవైపు దర్శకుడు పవన్ సాధినేనికి కూడా ఈ రెస్పాన్స్ ఉపయోగపడే అవకాశం ఉంది. నవంబర్ 20న విడుదలైన ఆకాశంలో ఒక తార బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇలాంటి సమయంలో చిరంజీవి, నాని లాంటి స్టార్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం మరింత ప్లస్ కావొచ్చు.

#AakasamloOkaTara సినిమా చూశాను. నా మనసును ఎంతో కదిలించిన చిత్రం ఇది. ఇంత స్ఫూర్తిదాయకమైన కథను ఎంతో నమ్మకంతో, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు @pavansadineni ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా సెకండాఫ్ అంతా ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. @dulQuer, @satveeravalli తమ సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. @shrutihaasan, @iRuhaniSharma తో పాటు నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. @gvprakash సంగీతం, @sujithsarang అద్భుతమైన ఛాయాగ్రహణం కథలోని భావోద్వేగాలను మరింతగా మనసుకు హత్తుకునేలా చేశాయి. ప్రతి సాంకేతిక విభాగం పనితీరు ప్రశంసనీయం. తల్లిదండ్రులందరూ తప్పకుండా మీ పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. ఈ కథ వారిలో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రొడ్యూసర్స్ స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా సంస్థలకు, చిత్ర బృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు! 👏💐 @GeethaArts @SwapnaCinema @Lightboxoffl

— Chiranjeevi Konidela (@KChiruTweets) November 24, 2026

Aakasam lo oka taara is all kinds of beautiful. What a heartwarming film. No one could have pulled this off the way @dulQuer did. @satveeravalli what a debut. Kalpana can only be you. Chala baaga edusthavu btw :) @shrutihaasan was superb. @iRuhaniSharma was adorable as bijili. @pavansadineni loved your clarity and craft. @gvprakash you owned the film and lifted it. Very proud of my friends Sunny Gunnam , Ramya Gunnam, @SwapnaCinema @Lightboxoffl who pulled this off with such conviction and care. Congratulations to the entire cast and crew. @GeethaArts @sujithsarang #AkasamLoOkaTara #AOT

— Nani (@NameisNani) November 25, 2026
Tags:    
  • aakasamlookatara 
  • dulquersalmaan 
  • chiranjeevi 
  • nani 
  • satvikaveeravalli 

Similar News

హీరోలకు లేని అభ్యంతరం దీపికకు ఎందుకు?

2026-11-25 08:14 GMT

క‌పూర్ సిస్టర్స్ ముందు ఆ హాలీవుడ్ తారలు సరిపోరా?

2026-11-25 08:13 GMT

మంచు కొండల్లో ట్రెక్కింగ్.. అదరగొట్టిన కాయదు లోహర్

2026-11-25 08:13 GMT

ఎన్నేళ్లు గడిచినా వర్మ మారలేదు..ఇప్పటికీ అదే తిరుగుబాటు!

2026-11-25 07:08 GMT

తెలంగాణ యాస..1960ల నాటి కొత్త ప్రపంచం!

2026-11-25 07:08 GMT

నారా రోహిత్‌.. నవంబర్‌ ఎంత స్పెషల్ అంటే..

2026-11-25 07:07 GMT

అందాల పోటీల్లో కొత్త చరిత్ర.. కేరళ అమ్మాయి అరుదైన ఘనత!

2026-11-25 07:07 GMT

చంద్రబోస్ ఇంట్లో తరుణ్ భాస్కర్‌కు స్పెషల్ ఫ్యాన్!

2026-11-25 07:05 GMT

అంతరిక్షం కంటే ముందు 150 కాఫీ షాప్‌లకు వెళ్లిందట..!

2026-11-25 07:05 GMT

ఈ కొత్త హీరోయిన్‌కు డబుల్ ఛాన్స్ ఉందే!

2026-11-25 06:04 GMT

పవన్ కళ్యాణ్‌తో గత జీవితం.. సంపాదన గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణు దేశాయ్

2026-11-25 06:04 GMT

Copyright @2026

Powered by Blink CMS