• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విశ్వంభర.. సంక్రాంతికి...

విశ్వంభర.. సంక్రాంతికి వస్తే సరిపోతుందా?

| చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ను సంక్రాంతికి విడుదల చేయాలని యూవీ క్రియేషన్స్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పండగ సెలవుల వసూళ్లపై నిర్మాతలు ఆశలు పెట్టుకున్నట్లు చర్చ నడుస్తోంది. అయితే జనవరి 13న ‘కాకా’ విడుదలకు సిద్ధంగా ఉండటంతో రెండు సినిమాల మధ్య సంక్రాంతి పోటీపై ఆసక్తి నెలకొంది. విశ్వంభర రిలీజ్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

By - M Prashanth
Update: 2026-11-25 11:02 GMT

చిరంజీవి విశ్వంభర సినిమా విషయంలో నిర్మాతలు ఏం ఆలోచిస్తున్నారనేది పెద్ద మిస్టరీగా మారింది. ఇప్పటికే రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పుడు సంక్రాంతికి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ వస్తోంది. అయితే ఇంతకాలం ఆగిన సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉండడంతో కొత్త డౌట్స్ పుట్టుకొస్తున్నాయి. పండగ సీజన్‌లోన ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు దీని వెనుక కమర్షియల్ లెక్కలు కూడా ఉండొచ్చు అనే కామెంట్స్ వస్తున్నాయి.

ముఖ్యంగా సంక్రాంతి సెలవుల్లో సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా కొంతవరకు వసూళ్లు రాబట్టుకునే అవకాశం ఉంటుందని నిర్మాతలు ఆలోచన కావచ్చు. అసలైతే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. వరుస సెలవులు, ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా ఈ సీజన్‌లో కొంతవరకు నిలబడిన సందర్భాలున్నాయి.

విశ్వంభర లాంటి భారీ బడ్జెట్ సినిమాకు ఇది ఉపయోగపడొచ్చు. పైగా చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. అందుకే యూవీ క్రియేషన్స్ సంక్రాంతి వైపు మొగ్గు చూపుతోందనే అభిప్రాయం కలుగుతోంది. కానీ పండగ సెలవులు ఉన్నంత మాత్రాన ప్రతి సినిమాకు మంచి వసూళ్లు వస్తాయనుకోవడం పొరపాటే. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ది రాజా సాబ్ అందుకు ఉదాహరణ.

ప్రభాస్ స్టార్ క్రేజ్ ఉన్నా సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరోవైపు చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మంచి సక్సెస్ అందుకుంది. అంటే పండగ అడ్వాంటేజ్ ఉన్నా చివరికి ప్రేక్షకులకు సినిమా నచ్చడం ముఖ్యం. విశ్వంభర విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. పైగా విశ్వంభర రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు. భారీ వీఎఫ్ఎక్స్‌తో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా. ఇలాంటి కథలకు విజువల్స్‌తో పాటు ఎమోషన్స్ కూడా బలంగా ఉండాలి.

ఇప్పటికే గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా, విడుదల సమయంలో మంచి టాక్ తెచ్చుకోవడం ముఖ్యం. కేవలం పండగ వసూళ్లను నమ్ముకుని థియేటర్లకు తీసుకొస్తే భారీ బడ్జెట్‌ను రికవరీ చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. మరోవైపు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న కాకా కూడా సంక్రాంతినే టార్గెట్ చేసింది. జనవరి 13న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. వాల్తేరు వీరయ్య తర్వాత ఈ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది.

ఇప్పుడు విశ్వంభర కూడా అదే సీజన్‌కు వస్తాను అంటే కాకా తప్పుకోక తప్పదు. ఇక విశ్వంభర డబ్బింగ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ ప్లాన్స్ మారడంతో సినిమాను మరింత ఆలస్యం చేయకూడదనే ఆలోచన యూవీ క్రియేషన్స్‌లో ఉండొచ్చు. ఓటీటీ కమిట్‌మెంట్స్ కూడా కారణమని ప్రచారం జరుగుతోంది. అయితే సంక్రాంతి రిలీజ్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాకా టీమ్ మాత్రం తమ డేట్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో విశ్వంభరకు పండగ సీజన్ దక్కుతుందో లేదో చూడాలి.

Tags:    
  • chiranjeevi 
  • vishwambhara 
  • uvcreations 
  • sankranti2027 
  • kaaka 

Similar News

అన్నాచెల్లెళ్ల కథే.. మరి ఈ ట్విస్ట్ ఏంటి?

2026-11-25 11:02 GMT

రెట్రో లుక్‌తో ఆకట్టుకుంటున్న అనుపమ

2026-11-25 11:02 GMT

Tupaki Exclusive: ఫౌజీ గ్లింప్స్ లో వచ్చిన ఫైట్ నేనే డిజైన్ చేశా.. అది సాంపిల్ మాత్రమే...

2026-11-25 10:47 GMT

Tupaki Exclusive: భోగి తెలంగాణ సినిమా కాదు...

2026-11-25 10:43 GMT

దేశం ముందు.. కళ తర్వాత.. పాక్ ఆర్టిస్టుల కంటెంట్‌పై హాట్ టాపిక్

2026-11-25 10:30 GMT

కూతురు బర్తడే స్పెషల్.. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ!

2026-11-25 10:10 GMT

సంబ‌రాల బాబు సౌండ్ గ‌ట్టిగానే చేయాలి!

2026-11-25 10:10 GMT

9వ తరగతిలో విద్యార్థి కాల్పులు.. సినిమా ప్రభావమా!

2026-11-25 10:09 GMT

ఆషిఖి రేంజు మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీలో దురంధ‌ర్ బ్యూటీ

2026-11-25 10:09 GMT

ఓడిపోయినా పర్వాలేదు.. ధైర్యంగా ముందుకెళ్లాలి!

2026-11-25 09:04 GMT

టాలీవుడ్ ట్యాలెంట్‌కి ఈ పంజాబీ గాయ‌కుడే స్ఫూర్తి..!

2026-11-25 09:04 GMT

Copyright @2026

Powered by Blink CMS