• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రిలీజ్ కు ముందే 100...

రిలీజ్ కు ముందే 100 మార్కులు వేసిన గ్రేట్ మామ్!

| దర్శకుడు సూరజ్ బర్జాత్య తెరకెక్కించిన 'యే ప్రేమ్ మోల్ లియా' చిత్రంపై నటుడు అనుపమ్ ఖేర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తన మనసును కదిలించిందని, నవ్విస్తూనే కన్నీళ్లు తెప్పించిందని తెలిపారు. మహిళలు తమ జీవిత నిర్ణయాలు తామే తీసుకునే స్వేచ్ఛ గురించి ఈ చిత్రం చక్కని సందేశం ఇస్తుందని పేర్కొన్నారు. తన తల్లి కూడా సినిమాకు 100కి 100 మార్కులు ఇచ్చారని వెల్లడించారు.

By - Srikanth Kontham
Update: 2026-11-25 17:48 GMT

కుటుంబ అనుబంధాలు.. సున్నితమైన భావోద్వేగాలతో సినిమాలు తీయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూరజ్ బర్జాత్య. తాజాగా ఆయ‌న తెర‌క‌కెక్కించిన‌ చిత్రం `యే ప్రేమ్ మోల్ లియా` . ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ చిత్రాన్ని చూసిన తర్వాత తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. పాశ్చాత్య.. యూరోపియన్ సినిమాల కంటే ఈ చిత్రం ఎంతో ప్రగతిశీలమైనదని.. భారతీయులతో పాటు విదేశీయులు కూడా తప్పక చూడాల్సిన సినిమా ఇద‌ని ప్రశంసించారు.

`యే ప్రేమ్ మోల్ లియా` అద్భుతంగా ఉందని కొనియాడారు. సూరజ్ బర్జాత్యను ఒక మాంత్రికుడుగా అభివ ర్ణించారు. ఈ సినిమా చూసిన తర్వాత త‌న‌ మనసు ఎంతో కదిలిపోయిందన్నారు. ఇది వినోదాన్ని పంచడంతో పాటు ఎన్నో విషయాలను నేర్పిస్తుందని.. చూస్తున్నంత సేపు నవ్విస్తూనే కన్నీళ్లు కూడా తెప్పిస్తుంద న్నారు. హిమేష్ రేశమ్మియా సంగీతం కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయిందని.. తాను చూసిన అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటని పేర్కొన్నారు. వీడియోతో పాటు సూరజ్ కోసం ఓ ఎమోష‌న‌ల్ నోట్‌ కూడా అనుపమ్ రాశారు.

మంచితనం ఎప్పటికీ గెలుస్తుందనే నమ్మకాన్ని సూరజ్ ఇప్పటికీ బలంగా నిలబెట్టుకున్నారన్నారు. ఆయన స్వయంగా ఆ మంచితనాన్ని జీవితంలో ఆచరిస్తారు కాబట్టే అలాంటి కథలు తీయగలుగుతున్నారని ప్రశంసించారు. తన తల్లి కూడా ఈ సినిమా చూసి 100కి 100 మార్కులు వేశారన్నారు. ప్రశంసలు అందు కునేటప్పుడు సూరజ్ బిడియపడటంతో పక్కన నిలబెట్టి వీడియో తీశానని గుర్తు చేసుకున్నారు.

మహిళలు తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తామే తీసుకునే స్వేచ్ఛ గురించి ఈ సినిమా ఎంతో అందమైన సందేశాన్ని ఇస్తోందని అనుపమ్ ఖేర్ అన్నారు. నేటి కాలానికి ఈ సందేశం ఎంతో అవసరమని.. ఎలాంటి ఆర్భాటం లేకుండా సహజంగా విషయాన్ని సూరజ్ చెప్పిన తీరు హృదయాన్ని తాకుతుందని వ్యాఖ్యానించారు.

ఈ సినిమా కథాంశం విషయానికొస్తే..ప్రేమ్, పూర్వ అనే పాత్రల మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారే నేపథ్యాన్ని చూపించారు. పెళ్లి తర్వాత అమ్మాయి అత్తారింటికి వెళ్లే సంప్రదాయానికి భిన్నంగా.. అబ్బాయే అమ్మాయి కుటుంబంలో భాగంగా మారితే ఎలా? ఉంటుందనే ఆసక్తికర అంశంతో కథ సాగుతుంది.

Tags:    
  • yehpremmolliya 
  • anupamkher 
  • soorajbarjatya 
  • himeshreshammiyamusic 
  • bollywood 

Similar News

వంశీ పైడిపల్లికి కలలో కూడా ఊహించని గిఫ్ట్.. ఇదీ సల్మాన్ రేంజ్ అంటే!

2026-11-25 17:54 GMT

చెంప వాచిపోయినా బామ్ రాసుకుని మ‌రీ త‌న్నులు తిన్నాడు!

2026-11-25 14:30 GMT

నాడు రీల్ జోడీ..నేడు రియల్ బంధువులు!

2026-11-25 13:30 GMT

సింపుల్గా సిద్ధార్థ్ గల్లా పెళ్లి.. మరి మహేష్ బాబు ఎక్కడ?

2026-11-25 12:51 GMT

రెండు సినిమాలతో రెండు సెంటిమెంట్స్.. డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు?

2026-11-25 12:48 GMT

రామాయణం ఎఫెక్ట్.. సాయిపల్లవి లెక్కలు మారతాయా!

2026-11-25 12:04 GMT

ఒక్క తప్పిదం..చేజారుతున్న షోలు!

2026-11-25 11:30 GMT

అన్నాచెల్లెళ్ల కథే.. మరి ఈ ట్విస్ట్ ఏంటి?

2026-11-25 11:02 GMT

రెట్రో లుక్‌తో ఆకట్టుకుంటున్న అనుపమ

2026-11-25 11:02 GMT

విశ్వంభర.. సంక్రాంతికి వస్తే సరిపోతుందా?

2026-11-25 11:02 GMT

Tupaki Exclusive: ఫౌజీ గ్లింప్స్ లో వచ్చిన ఫైట్ నేనే డిజైన్ చేశా.. అది సాంపిల్ మాత్రమే...

2026-11-25 10:47 GMT

Copyright @2026

Powered by Blink CMS