వెంకీ 'దృశ్యం 3'.. అర్జెంట్ గా మొదలుపెట్టాల్సిందేనా?
కానీ ఇప్పుడు దృశ్యం 3 మాలీవుడ్ వెర్షన్ షూటింగ్ ను ఆయన కంప్లీట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నారు.;
దృశ్యం 3.. ఇప్పుడు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీల లిస్ట్ లో ఆ సినిమా కచ్చితంగా ఉంటుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ దృశ్యం నుంచి రానున్న మూడో భాగం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు సినిమాలు దృశ్యం, దృశ్యం 2 సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ లీడ్ రోల్ లో జీతూ జోసెఫ్ ఆ రెండు సినిమాలు తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత ఆ సినిమాలు.. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రూపొందాయి. అక్కడ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. తెలుగులో హీరో విక్టరీ వెంకటేష్ నటించగా.. హిందీలో స్టార్ హీరో అజయ్ దేవగన్ యాక్ట్ చేశారు.
అయితే దృశ్యం ఫ్రాంచైజీలో చివరి భాగమైన దృశ్యం 3ను మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ ఒకేసారి తెరకెక్కించాలని భావించారు. ముందుగా ఆ దిశగానే చర్చలు కూడా జరిగాయి. ఆ తర్వాత అంతా ప్లానింగ్ ఛేంజ్ అయిపోయింది. ముగ్గురు హీరోలు వారి వారి సినిమాలతో బిజీగా ఉండటంతో ఆయన ఒకేసారి ముగ్గురిని డైరెక్ట్ చేయలేకపోయారు.
కానీ ఇప్పుడు దృశ్యం 3 మాలీవుడ్ వెర్షన్ షూటింగ్ ను ఆయన కంప్లీట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇంతలో హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చింది. వచ్చే ఏడాది అక్టోబర్ 2వ తేదీన ఆ సినిమా విడుదల కానుంది. మాలీవుడ్ వెర్షన్ కూడా అప్పుడే విడుదలవుతుందేమోనని వినికిడి.
అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. 2026 మార్చిలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్ వచ్చినా.. ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇప్పుడు మాలీవుడ్, బాలీవుడ్ వెర్షన్లు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వచ్చే ఏడాది సందడి చేయనున్నాయి.
అదే టైమ్ లో టాలీవుడ్ వెర్షన్ రాకపోతే.. కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో హిందీ, మలయాళం వెర్షన్లకు సంబంధించిన విషయాలు లీక్ అయిపోతాయి. దీంతో తెలుగు దృశ్యం 3పై ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి మూడు వెర్షన్లు ఒకేసారి రిలీజ్ అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు.
అలా జరగాలంటే.. వెంకటేష్ ఇప్పుడు సినిమా షూటింగ్ ను ప్రారంభించాలి. రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీ పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కానీ దాంతోపాటు పారలల్ గా దృశ్యం మూవీ కూడా మొదలుపెట్టాలి. అప్పుడే అక్టోబర్ 2 కల్లా సినిమా సిద్ధమయ్యే ఛాన్స్ ఉంటుంది. మరేం జరుగుతుందో.. వెంకటేష్ ఏం చేస్తారో వేచి చూడాలి.