దీపిక మెడలో వజ్రాల హారం ఖరీదు తెలుసా?
దీపిక పదుకొనే స్టైల్ కంటెంట్- ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.;
దీపిక పదుకొనే స్టైల్ కంటెంట్- ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. ఈ భామ దుబాయ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో తన రాయల్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. తల్లి అయిన తర్వాత దీపిక డ్యాషింగ్ ఫోటోషూట్ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.
ఇది ఆల్ బ్లాక్ లుక్.. బ్లాక్ జాకెట్ - లాంగ్ స్కర్ట్ లో దీపిక స్టన్నింగ్ ఎలివేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీపిక వ్యక్తిత్వానికి తగ్గట్టే ఈ అవుట్‌ఫిట్ అత్యంత స్టైలిష్ పవర్ `క్వీన్` వైబ్ ని ఇచ్చింది. దీపిక హెయిర్ స్టైల్ , మేకప్ కూడా చాలా సింపుల్‌గా ఆకర్షిస్తోంది. దీపికలోని డ్యాషింగ్ అటైర్‌ని ఈ కొత్త లుక్ హైలైట్ చేస్తోంది. దీపికా ఈ ఈవెంట్ కోసం ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన బ్లాక్ జాకెట్ -స్కర్ట్ ధరించారు. ఆ నలుపు రంగు దుస్తుల మీద మెరిసిపోతున్న ఈ వజ్రాల హారం ఒక యువరాణిని తలపిస్తోంది.
ముఖ్యంగా ఈ అందమైన ఫోటోషూట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం వేరొకటి ఉంది. అది తన మెడలోని వజ్రాల హారం. ఇది పాపులర్ లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ `కార్టియర్`కు చెందింది. మెడకు హత్తుకుపోయేలా ఉన్న ఈ చోకర్ స్టైల్ హారం, దీపికా ధరించిన బ్లాక్ డ్రెస్ మీద అద్భుతంగా మెరిసిపోతోంది. దీని విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుందని అంచనా. ఈ డిజైనర్ లుక్ చూడగానే సెలబ్రిటీల నుంచి అద్భుతమైన రియాక్షన్ వచ్చింది. ముఖ్యంగా కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ స్పందిస్తూ డ్యామ్న్ అంటూ ఫైర్ ఈమోజీలను షేర్ చేసింది. కేవలం 16 గంటల్లోనే ఈ ఫోటోలకు లక్షలాది లైకులు, వేలాది కామెంట్స్ వచ్చాయి. అభిమానులు ది ఓజీ క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రశంసిస్తున్నారు.
అయితే దీపిక మెడలో హారం ఖరీదు గురించి ఆరా తీస్తే షాకిచ్చే విషయాలు తెలిసాయి. కార్టియర్ సంస్థ అధికారికంగా ఈ హారం ధరను వెల్లడించకపోయినా ఒక అంచనా ప్రకారం.. సుమారు 10-15 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీపిక గతంలోను కార్టియర్ బ్రాండ్ కి చెందిన 4.5 కోట్ల ఖరీదైన హారాన్ని ధరించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అంతకుమించి ఖరీదైన హారాన్ని ధరించి దుబాయ్ ఈవెంట్లో సందడి చేసింది. ఈ హారంలో ప్రధాన ఆకర్షణ 63.76 క్యారెట్ల భారీ రుబెల్లైట్ పెండెంట్. ఇది ఒక అరుదైన అత్యంత ఖరీదైన రత్నం. ఇలాంటి ఒక్కో హారాన్ని తయారు చేయడానికి కార్టియర్ కళాకారులు సుమారు 1000 నుండి 2000 గంటల సమయం కష్టపడతారు.
దీపికా పదుకొనే తదుపరి ప్రాజెక్టులు
ప్రస్తుతం దీపికా తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. తదుపరి షారూఖ్ సరసన కింగ్ చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాలో సుహానా ఖాన్ ఒక కీలక పాత్రను పోషిస్తోంది. మరోవైపు బ్రహ్మాస్త్ర 2లోను దీపిక నటించాల్సి ఉంది. ఇక దీపిక పదుకొనే రెండు భారీ టాలీవుడ్ ప్రాజెక్టులను కోల్పోవడం ఇటీవల చర్చనీయాంశమైంది. సందీప్ వంగా తెరకెక్కిస్తున్న `స్పిరిట్`, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న కల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి దీపిక అర్థాంతరంగా వైదొలగడంతో ఇది దేశవ్యాప్తంగా ఉన్న సినీపరిశ్రమల్లో చర్చనీయాంశమైంది. దీపిక డిమాండ్లకు తలొంచలేక దర్శకనిర్మాతలు తనను వదులుకోవడం చర్చకు వచ్చింది.