60 ప్ల‌స్ కింగ్ బాడీ రిపేర్ కోసం రిటైర్ అవుతున్నాడా?

కింగ్ ఖాన్ షారూఖ్ రిటైర్‌మెంట్ కి ద‌గ్గ‌ర‌వుతున్నాడా? 60 వ‌య‌సులో అత‌డు సినిమాలు వదిలేయ‌డంపై సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నాడా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది.;

Update: 2026-02-08 17:30 GMT

కింగ్ ఖాన్ షారూఖ్ రిటైర్‌మెంట్ కి ద‌గ్గ‌ర‌వుతున్నాడా? 60 వ‌య‌సులో అత‌డు సినిమాలు వదిలేయ‌డంపై సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నాడా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది. ముఖ్యంగా ఖాన్ తదుపరి చిత్రం `కింగ్` తర్వాత సినిమాలకు స్వస్తి చెబుతారనే ప్రచారం జోరందుకుంది.

ఈ వార్తల్లోని నిజానిజాలు, ఒక సీనియ‌ర్ న‌టుడిగా ప్రస్తుత పరిస్థితిని ప‌రిశీలిస్తే.. షారూఖ్ రిటైర్ అవుతున్నారనే వార్తలను ఆయన సన్నిహిత వర్గాలు ఖండించాయి. ''షారూఖ్ రిటైర్ అవ్వడం లేదు.. మరిన్ని సినిమాలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు'' అని స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే దీనికి బ‌దులుగా కింగ్ షూటింగ్ పూర్త‌యిన‌ తర్వాత రెండేళ్ల పాటు సుదీర్ఘ విరామం తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రెండేళ్ల బ్రేక్ ఎందుకు? అంటే...! షారూఖ్ బ్రేక్ తీసుకోవాలని అనుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. షారూఖ్ గత కొంతకాలంగా వెన్నునొప్పి, భుజం గాయంతో బాధపడుతున్నారు. ఇటీవల కింగ్ షూటింగ్ సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ ఉన్న‌ప్పుడు భుజానికి మళ్లీ గాయమైంది. దీనికి చికిత్స తో పాటు, విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

ఇటీవ‌ల షారూఖ్ తన వెన్నునొప్పి, భుజం సమస్యల కోసం అమెరికాలో చికిత్స చేయించుకోవాలని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ బాడీ రిపేర్ కోసమే రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సమాచారం. సుదీర్ఘమైన షూటింగుల వల్ల కుటుంబానికి దూరంగా ఉంటున్న బాద్‌షా, ఈ బ్రేక్ సమయంలో తన పిల్లలు సుహానా, ఆర్యన్, భార్య గౌరీతో గడపాలని భావిస్తున్నారు.

ఇప్ప‌టికే కింగ్ ఈ ఏడాది క్రిస్మ‌స్ లో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో త‌దుప‌రి యాక్షన్ థ్రిల్లర్‌లో షారూఖ్ ఒక ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప‌లువురు యువ ప్ర‌తిభావంతులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మొదటిసారి త‌న కుమార్తె సుహానా తో క‌లిసి న‌టిస్తున్న బాద్ షా ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉన్నారు. మ‌రోవైపు కుమారుడు ఆర్య‌న్ త‌న తొలి ద‌ర్శ‌క‌త్వ వెంచ‌ర్ -బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ తో విజ‌యం సాధించ‌డంతో ఖాన్ రెట్టించిన ఉత్సాహంతో అత‌డిని ఎంక‌రేజ్ చేస్తున్నాడు.

బాద్‌షా రిటైర్ అవ్వరు!

షారూఖ్ ఎందుకు రిటైర‌వ్వ‌రు అంటే? ఒకానొక ఇంట‌ర్వ్యూలో ఖాన్ మాట్లాడుతూ తాను 93 ఏళ్ల వ‌య‌స్సు వ‌ర‌కూ న‌టిస్తూనే ఉంటాన‌ని అన్నారు. ఆయ‌న స‌ర‌దాగా న‌వ్వేస్తూ అన్నా త‌న మాట‌కు క‌ట్టుబ‌డి 60 ఏజ్ లోను న‌టిస్తున్నారు. దీనిని బ‌ట్టి ఖాన్ మ‌న‌స్త‌త్వాన్ని మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం కింగ్ ఖాన్ రెండేళ్ల పాటు గ్యాప్ మాత్ర‌మే తీసుకోవాల‌నుకుంటున్నాడు. దీని అర్థం షారూఖ్ ఇంకో రెండు ద‌శాబ్ధాల పాటు వెండితెర‌పై ఇలానే కొన‌సాగాల‌ని అనుకుంటున్నాడ‌ని భావించ‌వ‌చ్చు.

Tags:    

Similar News