స్టార్ హీరో కుమార్తె విన‌య‌విధేయ‌త‌లు-భ‌క్తి శ్ర‌ద్ధ‌లు మురిపిస్తున్నాయ్

వేల కోట్ల ఆస్తులు ఉన్న పటౌడీ వంశీకుడిగా సైఫ్ అలీఖాన్ కి ఉన్న గౌరవ ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2026-09-24 18:29 GMT

వేల కోట్ల ఆస్తులు ఉన్న పటౌడీ వంశీకుడిగా సైఫ్ అలీఖాన్ కి ఉన్న గౌరవ ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు అయినా కానీ.. నటి సారా అలీ ఖాన్‌లో ఎలాంటి గర్వం లేదా `హెడ్ వెయిట్` ఎక్కడా కనిపించదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం, అందరితోనూ చాలా స్వీట్‌గా ప్రవర్తించే తీరు ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి ఈ యువ‌నటి చూపించే సింప్లిసిటీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

తాజాగా టీ-సిరీస్ కార్యాలయంలో జరిగిన గణపతి దర్శన్ పూజా కార్యక్రమంలోనూ సారా అలీ ఖాన్ అదేరీతిలో వినమ్రతను చాటుకున్నారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా.. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని దర్శించుకున్న ఆమె తీరు అక్కడున్న వారిని మురిపించింది. సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చి స్వామివారికి నమస్కరించిన సారా ఒక సాధార‌ణ భ‌క్తురాలిలా క‌నిపించారే కానీ డాంబికం క‌నిపించ‌లేదు. స్టార్ స్టేటస్ ఉన్నా దైవభక్తి విషయంలో, పండగ సంప్రదాయాలను పాటించడంలో త‌ను చూపించే నిబద్ధత నిజంగా ప్రశంసనీయం.

ఇది ఇలా ఉంటే.. సినిమాల పరంగా కూడా సారా అలీ ఖాన్ ఎంపిక‌లు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌వి. ఈ యువ‌న‌టి వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ - సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న సరికొత్త స్పై-కామెడీ ఎంటర్‌టైనర్ `ఉడ్తా తీర్` చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా సరసన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆకాశ్ ఎ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సారా కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్ (CTS) ఆఫీసర్‌గా ఒక పవర్‌ఫుల్ & వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో సారా అలీ ఖాన్ అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు కథ అంతా గందరగోళం.. జ్ఞాపకశక్తి కోల్పోవడం.. తప్పుడు ఐడెంటిటీల‌ చుట్టూ తిరుగుతూ.. ఆ హై-వోల్టేజ్ కామెడీ సన్నివేశాల మధ్య సారా నటన ఎంతో సహజంగా పండటంతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆయుష్మాన్ ఖురానాతో ఈ బ్యూటీ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న సారా అలీ ఖాన్.. వ్యక్తిగత జీవితంలోనూ సంస్కారవంతమైన నడతతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానున్న `ఉడ్తా తీర్`సినిమాతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.



Tags:    

Similar News