సైలెంట్ అయిన రామాయణం!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం`.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం`. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న దృశ్యకావ్యంపై అసాధారణ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే టీమ్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. అయితే కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి ప్రమోషన్ల హడావుడి లేకపోవడంతో మేకర్స్ పాటిస్తున్న మౌనంపై అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రం గురించి చిన్న వార్త బయటకు వచ్చినా? అది సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారేది.
కానీ ప్రాజెక్ట్ ప్రారంభంలో కనిపించిన వేగం.. ప్రచార హడావుడి ఒక్కసారిగా మందగించడం ఆశ్చర్య పరుస్తోంది. దీంతో మేకర్స్ కావాలనే ప్రచారానికి దూరంగా ఉంటున్నారా? లేక తెరవెనుక ఏవైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా? అనే చర్చలు ఫిలిం నగర్ వర్గాల్లో ఊపందు కున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో రిలీజ్ అయిన `టాక్సిక్` చిత్రం ఆశించిన రీతిలో ఫలితాన్ని అందుకో లేకపోవడం ఈ నిశ్శబ్దానికి ప్రధాన కారణమనే అనుమానం వ్యక్తమమవుతోంది.
`రామాయణ్` చిత్రంలో రావణాసురుడిలాంటి కీలకమైన పాత్ర పోషించిన యష్ మార్కెట్ గ్రాఫ్ ఈ చిత్రం ఫలితం తర్వాత ప్రచార వ్యూహాలపై ప్రతికూల ప్రభావం పడకూడదని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. `టాక్సిక్` ఫలి తాన్ని దృష్టిలో ఉంచుకుని చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని తగ్గించి రీ-సౌండింగ్ ప్లానింగ్‌లో పడిందని ప్రచారం సాగుతోంది. సినిమా విషయంలో చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
పైగా రామాయణ ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించేటప్పుడు గ్రాఫిక్స్ , నటీనటుల రూపురేఖలు, స్క్రిప్ట్ డిజైనింగ్‌లో ఎంత జాగ్రత్తగా ఉండాలో గతంలో వచ్చిన కొన్ని సినిమాలు అనుభవపూర్వకంగా నేర్పాయి. అందువల్ల అనవసరమైన ప్రచార ఆర్భాటాల కంటే విజువల్ ఎఫెక్ట్స్‌ను పరిపూర్ణంగా సిద్ధం చేయడంపైనే చిత్ర బృందం పూర్తి దృష్టి సారించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌కు అత్యంత సమర్థవంతమైన ప్రమోషన్ వ్యూహం అవసరం. తొందరపడి ముందే ప్రచార చిత్రాలు లేదా టీజర్లు విడుదల చేసి ప్రతికూల టాక్ తెచ్చుకోవడం కంటే అవుట్‌పుట్ పూర్తిగా సిద్ధమయ్యాకే ప్రచార పర్వాన్ని వేగవంతం చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
బిగ్ బడ్జెట్ సినిమాలకు సరైన టైమింగ్ ముఖ్యం కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న ప్రచార మందగమనం ఒక రకంగా సినిమా క్వాలిటీకి మేలు చేసేదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా? `రామాయణ్` లాంటి కావ్యానికి సంబంధించి వ్యక్తమవుతున్న నిశ్శబ్దం తాత్కాలికమేనని, సరైన సమయంలో ఒకేసారి భారీ అప్‌డేట్‌తో మేకర్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి టీమ్ చేస్తున్న నిశ్శబ్ద కృషి మున్ముందు వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.