• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ లోకి KVN.....

టాలీవుడ్ లోకి KVN.. ప్లాన్ ఎలా ఉండాలంటే..

| కన్నడలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న బ్యానర్.. ఇప్పుడు భారీ చిత్రాలు నిర్మిస్తూ పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది.

By - M Prashanth
Update: 2026-09-24 18:30 GMT

కన్నడలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న బ్యానర్.. ఇప్పుడు భారీ చిత్రాలు నిర్మిస్తూ పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది. అదే KVN ప్రొడక్షన్స్. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్లు, భారీ కథలతో వరుస ప్రాజెక్టులు చేస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌ లోనూ స్ట్రాంగ్ గా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ KVN ప్లాన్ ఎలా ఉండాలన్నది హాట్ టాపిక్ గా మారింది.

KVNకు సినిమా బిజినెస్ కొత్త కాదు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్‌ లో ఆ సంస్థకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్, యానిమల్, కల్కి 2898 ఏడీ, దేవర వంటి సినిమాలను కర్ణాటకలో విడుదల చేసి మంచి ఫలితాలు అందుకుంది. సినిమా మార్కెట్ ఎలా పనిచేస్తుంది, రిలీజ్‌ ఎలా ప్లాన్ చేయాలి అనే విషయంలో KVNకు ఇప్పటికే అవగాహన ఉంది.

అయితే ప్రొడక్షన్ లోకి వచ్చాక లెక్కలు కాస్త మారాయి. భారీ బడ్జెట్‌ తో వచ్చిన కొన్ని సినిమాలు అంచనాలకు తగ్గ రిజల్ట్స్ ఇవ్వలేదు. జననాయగన్, టాక్సిక్, కేడీ: ది డెవిల్, హైవాన్ వంటి సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేదు. అదే సమయంలో బాలన్: ది బాయ్ మాత్రం మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక్కడి నుంచి KVNకు ఒక విషయం క్లియర్ గా కనిపిస్తుంది.

భారీ సినిమా అంటే భారీ బడ్జెట్ మాత్రమే కాదు. కథకు తగ్గ ఖర్చు, హీరో మార్కెట్‌ కు తగ్గ ఇన్వెస్ట్మెంట్, రిలీజ్‌ కు తగ్గ ప్లాన్ కూడా అంతే ముఖ్యం. వందల కోట్లు ఖర్చు పెట్టడమే పెద్ద సినిమా కాదు. పెట్టిన డబ్బుకు తగ్గ స్క్రీన్‌ పై కంటెంట్ ఉండటం అసలు విషయం. టాలీవుడ్‌ లోకి వస్తున్నప్పుడు అది మరింత మెయిన్. తెలుగు ప్రేక్షకులు స్టార్ హీరోలను ఆదరిస్తారు.

అదే సమయంలో కథ, పాటలు, యాక్షన్, ఎమోషన్ ఇలా ప్రతి విషయంలోనూ అంచనాలు పెంచుకుంటారు. అందుకే తెలుగు దర్శకులు, రైటర్లతో కలిసి ఇక్కడి నేటివిటీకి దగ్గరగా ఉండే కథలపై ఫోకస్ పెట్టడం KVNకు ఉపయోగపడొచ్చు. అలాగే లైనప్‌ లో కూడా బ్యాలెన్స్ అవసరం. వరుసగా వందల కోట్ల బడ్జెట్ సినిమాలు చేయడం కంటే.. ఒకటి రెండు పెద్ద చిత్రాలతోపాటు మంచి కథ ఉన్న మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మించొచ్చు.

దీనివల్ల బ్యానర్ నుంచి భిన్నమైన సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. KVNకు ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పీరియన్స్ మరో పెద్ద ప్లస్ పాయింట్. ఏ సినిమా ఏ మార్కెట్‌ లో ఎలా రిలీజ్ చేయాలి, థియేటర్లను ఎలా ప్లాన్ చేయాలి, ప్రమోషన్ ఏ స్థాయిలో చేయాలనే విషయంలో ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. నిర్మాణంతో పాటు రిలీజ్ బిజినెస్‌ ను కూడా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకోవచ్చు.

హీరోల విషయంలోనూ స్టార్ పవర్ ఒక్కటే లెక్క కాకూడదు. హీరో ఇమేజ్‌ కు సరిపోయే కథ, ఆ కథను చెప్పగల దర్శకుడు, అందుకు తగ్గ బడ్జెట్.. ఆ మూడు కుదిరితేనే కాంబినేషన్‌ కు స్ట్రెంత్ వస్తుంది. ప్రస్తుతం చిరంజీవితో కాకా వంటి భారీ ప్రాజెక్ట్‌ తో KVN టాలీవుడ్‌ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఫ్యూచర్ లో మరిన్ని తెలుగు ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    
  • kvnproductions 
  • tollywood 
  • telugucinema 
  • panindiamovies 
  • chiranjeevi 
  • kaaka 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS