రాజమౌళికి గట్టి పోటీ ఇచ్చిన ఇద్దరు దర్శకులు ఇప్పుడు ఎటు పోయారు...
ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి లాంటి దర్శకుడు ప్రస్తుతం ప్రపంచ స్థాయి డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. ఎవరు ఎలాంటి సినిమాలను చేస్తున్నారు. ఎవరు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తున్నారనే విషయాలను వాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అలాగే మనం ఎలాంటి సినిమా చేస్తే సక్సెస్ ని సాధించొచ్చు అనే ధోరణి లో కూడా కొంతమంది దర్శకులు ఆలోచిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి లాంటి దర్శకుడు ప్రస్తుతం ప్రపంచ స్థాయి డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కెరియర్ స్టార్టింగ్ లో చేసిన మూడు నాలుగు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోయింది. ఇక అతనితోపాటు ఇండస్ట్రీలో సినిమాలను చేస్తున్న కొంతమంది దర్శకులు ఆయనకు పోటీని ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే పూరి జగన్నాధ్, వివి వినాయక్ లు రాజమౌళికి పోటీని ఇస్తూ అతన్ని బీట్ చేసి కొన్ని సందర్భాల్లో వాళ్ళు టాప్ పొజిషన్ కి వెళ్లారు.
కానీ కాలక్రమేణ రాజమౌళి కమర్షియల్ సినిమాలకు బదులుగా గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించాడు. అలాగే గ్రాఫిక్స్ లో కూడా విజువల్ వండర్స్ ని క్రియేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసి చూపించడంతో రాజమౌళి ఇప్పటికీ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్నప్పటికి అతనికి పోటీని ఇచ్చిన పూరి జగన్నాథ్, వివి వినాయక్ లు ప్రస్తుతం పూర్తి ఫామ్ లో లేరు. ఒకప్పుడు రాజమౌళి కంటే కూడా వీళ్లు గొప్ప విజయాలను సాధించారు. ఆ సందర్భంలో రాజమౌళిని వెనక్కినెట్టి వీళ్ళు ముందుకు సాగిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇలాంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో రాజమౌళి విజువల్ వండర్స్ ని క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటిని తీసుకొస్తుంటే పూరి జగన్నాధ్ మాత్రం సినిమాలు చేస్తున్నప్పటికి సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు.
ఇక వివి వినాయక్ అయితే అసలు సినిమాలే చేయడం లేదు. ఎందుకని ఆయన సినిమా అనౌన్స్ చేయడం లేదనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కూడా వినాయక్ తొందరలోనే మరో రెండు సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన కొంతమంది హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నాడు. అవి ఓకే అయిన వెంటనే ఆయన తన సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది...