ఆస్తుల‌పై డిబేట్: అమితాబ్ ఏడాదిలో 30కోట్లు పెంచితే.. క‌ర‌ణ్ జోహార్ 480కోట్లు జోడించాడు!

బాలీవుడ్‌లో సంపద పరంగా దిగ్గజాల మధ్య సాగే పోరు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా వెలువడిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.

Update: 2026-09-25 00:30 GMT

బాలీవుడ్‌లో సంపద పరంగా దిగ్గజాల మధ్య సాగే పోరు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా వెలువడిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సంపద కూడా ఏడాదిలో అద‌నంగా పెరిగినా.. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ చూపించిన దూకుడు ముందు ఆయన వృద్ధి రేటు కొంత వెనుకబడింది. తాజా రిపోర్ట్ ప్రకారం ఇద్దరి ఆస్తుల‌లో జరిగిన మార్పులు పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాయి.

గతేడాది రూ. 1,600 కోట్లుగా ఉన్న అమితాబ్ బచ్చన్ కుటుంబ నికర సంపద ఈ ఏడాది స్వల్పంగా పెరిగి రూ. 1,630 కోట్లకు చేరింది. అంటే కేవలం రూ. 30 కోట్లు లేదా 1.9శాతం పెరుగుదలను మాత్ర‌మే అమితాబ్ సాధించారు. మరోవైపు గతేడాది రూ. 1,400 కోట్లతో ఐదో స్థానంలో ఉన్న కరణ్ జోహార్ సంపద ఒక్క సంవత్సరంలోనే ఏకంగా రూ. 1,880 కోట్లకు ఎగబాకింది. అంటే ఆయన సంపద ఏకంగా రూ. 480 కోట్లు లేదా 34శాతం పైగా పెరగడం విశేషం.

ఈ భారీ వృద్ధి కారణంగా గతేడాది అమితాబ్ బచ్చన్ కంటే రూ. 200 కోట్లు వెనుకబడి ఉన్న కరణ్ జోహార్.. ఆయన్ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం కరణ్ జోహార్, అమితాబ్ బచ్చన్ కంటే రూ. 250 కోట్లు ఆధిక్యంలో నిలిచారు. దీనితో బాలీవుడ్ ధనవంతుల జాబితాలో సమీకరణాలు వేగంగా మారుతున్నట్లు ప్రూవైంది.

అమితాబ్ బచ్చన్ సంపదలో ఎలాంటి త‌గ్గుద లేకపోయినా ఆయన పోర్ట్‌ఫోలియో దశాబ్దాలుగా ఒకే పద్ధతిలో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి భిన్నంగా కరణ్ జోహార్ తన `ధర్మ ప్రొడక్షన్స్` వాటాల మానిటైజేష‌న్ వంటి కీలక వ్యాపార లావాదేవీల ద్వారా స్వల్ప కాలంలోనే భారీగా సంపదను పెంచుకోగలిగారు.

కేవలం సినిమాలే కాకుండా.. ఓటీటీ వెంచర్లు, డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్స్, టీవీ షోల హోస్టింగ్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఫ్యాషన్ వెంచర్ల ద్వారా కరణ్ జోహార్ తన ఆదాయాన్ని మ‌ల్టీ ప్రాజెక్ట్ మార్గాల‌కు విస్తరించుకున్నారు. ఈ విభిన్న వ్యాపార ప్రణాళికలు, స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ల కారణంగానే ఆయన సంపద రికార్డు స్థాయిలో పెరిగి ఈ మైలురాల్ని అందుకోగలిగారు. అమితాబ్ బ‌చ్చ‌న్- అభిషేక్ బ‌చ్చ‌న్- ఐశ్వ‌ర్యారాయ్ బృందం ఎక్కువ‌గా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాల‌లో పెట్టుబ‌డులు పెట్టారు. ప‌లు ఉత్ప‌త్తుల‌తో కంపెనీల‌ను స్థాపించి ఆర్జిస్తున్నారు. అంత‌కుమించి క‌ర‌ణ్ జోహార్ త‌న వ్యాపార చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని అనుకోవ‌చ్చు.

Tags:    

Similar News