బాలీవుడ్ లో దిల్ రాజు 'ప్లాన్ బి'.. సక్సెస్ అయితే నెక్స్ట్ ఏంటి?
టాలీవుడ్ లో దిల్ రాజు నేమ్ ఓ బ్రాండ్. స్టోరీ, హీరో, మార్కెట్.. ఆ మూడు విషయాలను తీసుకుని సినిమాలను తెరకెక్కించడంలో ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది.
టాలీవుడ్ లో దిల్ రాజు నేమ్ ఓ బ్రాండ్. స్టోరీ, హీరో, మార్కెట్.. ఆ మూడు విషయాలను తీసుకుని సినిమాలను తెరకెక్కించడంలో ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన.. బాలీవుడ్ లోనూ తన మార్క్ చూపించాలని చాలాకాలంగా ట్రై చేస్తున్నారు. అయితే అక్కడ మాత్రం ఇప్పటివరకు అనుకున్న రేంజ్ లో రిజల్ట్ రాలేదు.
బాలీవుడ్ లో దిల్ రాజు చేసిన గత ప్రయత్నాలను చూస్తే.. తెలుగు సినిమాల రీమేక్ లపైనే ఎక్కువగా ఆధారపడిన సందర్భాలు కనిపిస్తాయి. అయితే అప్పటికే తెలుగు చిత్రాలను హిందీలో డబ్బింగ్ లో చూసిన ప్రేక్షకులకు అదే కథను రీమేక్స్ గా మళ్లీ థియేటర్లలో చూడాలనే ఇంట్రెస్ట్ తగ్గింది. దీంతో మంచి కథలు ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయాయి.
ఆ ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు దిల్ రాజు తన బాలీవుడ్ స్ట్రాటజీని మార్చినట్లు కనిపిస్తోంది. రీమేక్స్ నమ్ముకోవడం కంటే.. డైరెక్ట్ గా హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడంపై ఫోకస్ పెంచారు. అందులో భాగంగానే స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులు లైన్ లో పెట్టారు. అంటే ఇప్పుడు ప్లాన్ బితో ముందుకు వెళ్తున్నారన్నమాట. అక్షయ్ కుమార్ తో చేస్తున్న సినిమా ఆ కొత్త ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్ గా కనిపిస్తోంది.
అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో విద్యాబాలన్, రాశీ ఖన్నా కూడా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న ఆ సినిమా ద్వారా హిందీ మార్కెట్ లో మరోసారి తన సత్తా చూపించాలని దిల్ రాజు చూస్తున్నారు. అయితే అసలు బిగ్ స్టెప్ మాత్రం సల్మాన్ ఖాన్ సినిమా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఆ యాక్షన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు.
2027 ఈద్ కు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడే దిల్ రాజు ప్లాన్ లో మరో యాంగిల్ కనిపిస్తోంది. కేవలం హిందీలో సినిమా తీసి విడుదల చేయడం కాకుండా.. భారీ మార్కెట్ ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే బాలీవుడ్ లో తన ప్రొడక్షన్ బ్యానర్ కు ఒక స్టేబుల్ క్రేజ్ రావచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే దిల్ రాజు ఇప్పుడు బాలీవుడ్ లో ఒక్క సినిమాతో సక్సెస్ కొట్టడం కంటే.. అక్కడ వరుసగా సినిమాలు చేయగల స్థాయిలో తన మార్కెట్ ను నిర్మించుకోవాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.
స్టార్ హీరోలు, కొత్త స్టోరీలు, భారీ ప్రొడక్షన్ వాల్యూస్.. ఇవే ఆయన కొత్త స్ట్రాటజీలో మెయిన్ గా మారాయి. మరి ఇప్పుడు ప్లాన్ బి దిల్ రాజుకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అక్షయ్ కుమార్ సినిమా, ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే.. బాలీవుడ్ లో దిల్ రాజు నెక్స్ట్ ప్లాన్ మరింత బిగ్ రేంజ్ లో ఉండే అవకాశం కచ్చితంగా ఉంటుందని చెప్పాలి.