లైఫ్ లో రెండు సార్లు ఆ అవ‌కాశ‌మొచ్చింది

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న మ‌మ్ముట్టి గ‌త కొన్నేళ్లుగా స్టార్ స్టేట‌స్ ను అనుభ‌విస్తున్నారు కానీ కెరీర్ స్టార్టింగ్ లో తానెన్నో ఇబ్బందుల్ని ప‌డిన‌ట్టు మమ్ముట్టి రీసెంట్ గా జ‌రిగిన ఓ చిట్ చాట్ లో వెల్ల‌డించారు.;

Update: 2026-02-08 14:30 GMT

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న మ‌మ్ముట్టి గ‌త కొన్నేళ్లుగా స్టార్ స్టేట‌స్ ను అనుభ‌విస్తున్నారు కానీ కెరీర్ స్టార్టింగ్ లో తానెన్నో ఇబ్బందుల్ని ప‌డిన‌ట్టు మమ్ముట్టి రీసెంట్ గా జ‌రిగిన ఓ చిట్ చాట్ లో వెల్ల‌డించారు. త‌న అస‌లు పేరు మ‌హ‌మ్మ‌ద్ కుట్టి అని, కానీ త‌న‌కు మమ్ముట్టి అనే పేరు రావ‌డానికి కార‌ణం త‌న ఫ్రెండ్ శ‌శిధ‌ర‌న్ అని, కాలేజ్ లో చ‌దువుకునే రోజుల్లో అంద‌రికీ త‌న పేరుని ఒమ‌ర్ ష‌రీఫ్ అని చెప్పేవాడిన‌ని, కానీ ఒక‌రోజు ఐడీ కార్డు చూసి త‌న ఫ్రెండ్ అస‌లు పేరుని చ‌దివాడని, మ‌హ్మ‌ద్ కుట్టి అనే పేరుని పొర‌పాటుగా మ‌మ్ముట్టి అని చ‌ద‌వ‌డంతో త‌న పేరు అలా మారిపోయింద‌ని, త‌న ఫ్రెండ్ పెట్టిన పేరుతోనే తాను ఈ స్థాయికి రావ‌డం ఎంతో ఆనందాన్నిచ్చింద‌ని మ‌మ్ముట్టి చెప్పారు.

సినిమాల‌పై ఆస‌క్తితో ప్రాక్టీస్ ను వ‌దిలేశా..

కేర‌ళ‌లోని చండీరూర్ లో పుట్టిన మమ్ముట్టి కోట్టాయాంలో పెరగడంతో పాటూ అక్క‌డే చ‌దువుకున్నారు. ఎర్నాకులంలో లా చ‌దివి, అక్క‌డే ప్రాక్టీస్ చేస్తూ సినిమాల‌పై ఉన్న ఇంట్రెస్ట్ తో అవ‌కాశాల కోసం ట్రై చేశాన‌ని, కానీ ఛాన్సులు రాక‌పోవ‌డంతో ప్రాక్టీస్ ను పూర్తిగా వ‌దిలేసి సినిమాల్లోకి వ‌చ్చారు మ‌మ్ముట్టి. మొదట్లో ఎక్క‌డికి వెళ్లినా రిజెక్ట్ చేశార‌ని, కొన్ని రోజుల‌కు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా అవ‌కాశ‌మొచ్చింద‌ని, అలా 8 ఏళ్ల పాటూ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసిన త‌ర్వాత హీరోగా ఓ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అది మ‌ధ్య‌లోనే ఆగిపోయింద‌ని, ఆ పై వెంట‌నే మ‌రోసారి హీరోగా ఛాన్స్ వ‌చ్చింద‌ని, మొత్తానికి కెరీర్ ను స్టార్ట్ చేసిన ప‌దేళ్ల‌కు కానీ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్క‌లేద‌ని మ‌మ్ముట్టి చెప్పారు.

ఆ నెంబ‌ర్ తో స్పెష‌ల్ బాండింగ్

ఒక్కొక్క‌రికి ఒక్కో సెంటిమెంట్ ఉన్న‌ట్టు త‌న‌కు కూడా ఓ సెంటిమెంట్ ఉంద‌ని, న‌టుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన కొత్త‌ల్లో తానొక బ్రీఫ్‌కేస్ కొన్నాన‌ని, దానికి లాక్ గా 369 అనే నెంబ‌ర్ ఉంద‌ని, అప్ప‌ట్నుంచి ఆ నెంబ‌ర్ తో త‌న‌కు స్పెష‌ల్ బాండింగ్ ఏర్ప‌డింద‌ని, అందుకే త‌న కార్ల‌కు కూడా అదే నెంబ‌ర్లు తీసుకుంటాన‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికే ఎన్నో సినిమాల్లో న‌టించి, మంచి క్రేజ్, ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న మమ్ముట్టి ప్రేక్ష‌కుల రుణాన్ని తీర్చుకోవ‌డానికి మ‌మ్ముట్టి ఫౌండేష‌న్ పేరిట ఛారిటీని మొదలుపెట్టి, దాని ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

మ‌నిషిగా పుట్టినందుకు ఏదొక‌టి సాధించాలి

అయితే జీవితంలో ఎన్ని సాధించినా స‌రే పుట్టినందుకు లైఫ్ కు ఓ సార్ధ‌క‌త ఉండాల‌ని మ‌మ్ముట్టి త‌ర‌చూ చెప్తుంటారు. అందుకే ఆయ‌న చేసే ప్ర‌తీ క్యారెక్ట‌ర్ ద్వారా స‌మాజానికి ఏదొకటి చెప్పాల‌నే త‌ప‌న ఆయ‌న‌లో క‌నిపిస్తూ ఉంటుంది. పోలీసాఫీస‌ర్ అయినా, రైతు అయినా, లాయ‌ర్ అయినా, లేదా కామ‌న్ మ్యాన్ గా అయినా, ఆయ‌న పోషించిన పాత్ర‌లు ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలిచాయి. రీల్ లైఫ్ లోనే కాకుండా రియ‌ల్ లైఫ్ లో కూడా మ‌మ్ముట్టి ఈ విష‌యాన్ని తూ.ఛ త‌ప్ప‌కుండా పాటిస్తారు. ఈ త‌రం మాత్ర‌మే కాకుండా ఫ్యూచ‌ర్ జ‌న‌రేష‌న్స్ కూడా త‌న గురించి మాట్లాడుకోవాల‌నుకునే మ‌మ్ముట్టికి ఆ అవ‌కాశం రెండుసార్లు వ‌చ్చింది. మ‌మ్ముట్టి న‌టించిన భ్ర‌మ‌యుగం మూవీని యూకే ఫిల్మ్ స్కూల్ పాఠాల్లో చేర్చ‌డం ఒక‌టైతే, తాను చ‌దువుకున్న కాలేజ్ లోనే త‌న కెరీర్ ను ఓ పాఠంలాగా బోధించ‌డం అనేది ఆయ‌న సాధించిన మ‌రొక అరుదైన ఘ‌ట‌న‌.

దుల్క‌ర్ కు స‌లహాలివ్వ‌ను

మ‌మ్ముట్టి ఫ్యామిలీ నుంచి త‌ర్వాత అత‌ని వార‌సుడిగా దుల్క‌ర్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి త‌న‌దైన రీతిలో ఆడియ‌న్స్ ను అల‌రిస్తూ వ‌స్తున్నారు. సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో అనుభ‌వ‌మున్న‌ప్ప‌టికీ తాను త‌న కొడుకు దుల్క‌ర్ కు స‌ల‌హాలేమీ ఇవ్వ‌న‌ని, కాక‌పోతే ఇయ‌ర్ కు రెండు మూడు సినిమాలు చేయ‌క‌పోతే ఇంటికి కూడా రావొద్ద‌ని చెప్తుంటానన‌ని మ‌మ్ముట్టి చెప్పారు. ఇక విల‌న్ గా న‌టించ‌డం గురించి అడిగితే త‌న‌కు హీరోగా కంటే న‌టుడిగా వ‌చ్చే గుర్తింపు అంటేనే ఇష్ట‌మ‌ని, విల‌న్ పాత్ర‌కు ఎలాంటి లిమిటేష‌న్స్ ఉండ‌వ‌ని, అలాంటి పాత్ర‌లు చేసిన‌ప్పుడే మ‌న‌లోని అస‌లు న‌టుడు బ‌య‌టికొస్తాడ‌ని చెప్తున్నారు మ‌మ్ముట్టి. మ‌మ్ముట్టి త‌న కెరీర్లో ప‌డిన ఎన్నో ఏళ్ల క‌ష్టానికి, ఆయ‌న సినీ రంగానికి అందించిన సేవ‌ల‌కు గానూ భార‌త ప్ర‌భుత్వం ఇటీవ‌లే ఆయ‌న్ని పద్మ‌భూష‌ణ్ బిరుదుతో స‌త్క‌రించిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News