ది ప్యారడైజ్ ఓపెనింగ్ లెక్క ఎంతంటే?
ఇప్పుడు టీమ్ బయటపెట్టిన మొదటి రోజు ఫిగర్స్ చూస్తే, నాని మార్కెట్ ఈ సినిమాతో ఎంత పెరిగిందో అర్థమవుతుంది.
ది ప్యారడైజ్ రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ చూసినప్పుడే నానికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ రావడం ఖాయమనే అంచనా వచ్చింది. బుక్‌మైషో ప్రీ సేల్స్ దూసుకెళ్లడం, ఓవర్సీస్‌లో ముందుగానే టికెట్లు వేగంగా అమ్ముడవడం ఫస్ట్ డే మీద అంచనాలు పెంచాయి. ఇప్పుడు టీమ్ బయటపెట్టిన మొదటి రోజు ఫిగర్స్ చూస్తే, నాని మార్కెట్ ఈ సినిమాతో ఎంత పెరిగిందో అర్థమవుతుంది.
ప్రీమియర్స్ నుంచి వచ్చిన సేల్స్ కూడా ఈ ఓపెనింగ్‌కు బలమైన పుష్ ఇచ్చాయి. ముఖ్యంగా నైజాం సెంటర్లలో నైట్ షోస్ వరకు అదే స్పీడ్ కొనసాగింది. వరల్డ్‌వైడ్‌గా తొలి రోజు రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. నాని కెరీర్‌లో ఇదే అతిపెద్ద ఓపెనింగ్. దసరా, హిట్ 3 సినిమాలతో ఇప్పటికే తన బెస్ట్ నంబర్లను పెంచుకుంటూ వచ్చిన నాని, ప్యారడైజ్‌తో మాత్రం వాటిని చాలా దూరం తీసుకెళ్లారు.
భారీ యాక్షన్ సినిమాతో వచ్చిన ప్రీ రిలీజ్ హైప్ మొదటి రోజు కలెక్షన్స్‌లో కనిపించింది. ఓవర్సీస్ ఈ నంబర్‌లో పెద్ద పాత్ర పోషించింది. నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ గ్రాస్‌ను వేగంగా అందుకున్న నాని సినిమాగా ప్యారడైజ్ నిలిచిందని టీమ్ తెలిపింది. అన్ని విదేశీ మార్కెట్లు కలిపి డే 1లో 2.25 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. నానికి అక్కడ మంచి బేస్ ఉన్నా, ఈసారి వచ్చిన ఓపెనింగ్ ఆయన గత సినిమాల రేంజ్‌ను దాటేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్‌కు ముందు నుంచే షోలు స్పీడ్ గా ఫిల్ అయ్యాయి. కొత్త షోలు యాడ్ అవుతుండగా, బుక్‌మైషోలో ఫైనల్ ప్రీ సేల్స్ 9.41 లక్షల టికెట్లకు చేరాయి. ఓజీకి చాలా దగ్గరగా వెళ్లి ఆల్ టైమ్ లిస్ట్‌లో ఆరో స్థానంలో నిలిచిన ఆ బుకింగ్స్, ఉదయం షోల నుంచే పెద్ద ఓపెనింగ్‌కు బేస్ అయ్యాయి.
తమిళం, హిందీ మార్కెట్లలో కూడా మొదటి రోజు బుకింగ్స్ హై రేంజ్ లోనే ఉన్నట్లు టీమ్ చెబుతోంది. సాధారణంగా నాని సినిమాల ప్రధాన బలం తెలుగు, ఓవర్సీస్ మార్కెట్లే. ప్యారడైజ్ మాత్రం ఇతర భాషల్లో కూడా మొదటి రోజు నుంచే టికెట్ సేల్స్ నమోదు చేసింది. అయా షేర్, యాషా నాగుల పాటలు రిలీజ్‌కు ముందు బాగా వైరల్ అవ్వడం కూడా సినిమాను తెలుగు రాష్ట్రాల బయటకు తీసుకెళ్లడంలో ఉపయోగపడింది. శ్రీకాంత్ ఓదెలతో దసరా తర్వాత నాని చేసిన రెండో సినిమా ఇది. ఆ కాంబినేషన్ మీద ముందే ఉన్న క్రేజ్‌కు అనిరుధ్ మ్యూజిక్, నాని యాక్షన్ లుక్ కూడా హెల్ప్ అయ్యాయి. ఇదే రేంజ్ లో కొనసాగితే వీకెండ్ లోపే మరిన్ని రికార్డులు కొనసాగే అవకాశం ఉంది.