పిక్‌టాక్‌ : ఆలియా ఈ ఫోజ్‌తో 'లవ్ & వార్’ ఎక్కడికో..!

బాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్‌, మల్టీస్టారర్‌ మూవీ 'లవ్ & వార్’.

Update: 2026-09-25 07:26 GMT

బాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్‌, మల్టీస్టారర్‌ మూవీ 'లవ్ & వార్’. ఈ సినిమాలో రణబీర్ కపూర్‌, విక్కీ కౌశల్‌లు హీరోలుగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. గత ఏడాది కొన్ని కారణాల వల్ల తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోయిన ఆలియా భట్‌ ఈ ఏడాది ఇప్పటికే ఆల్ఫా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా డోంట్‌ బి షై అనే సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించింది. ఇప్పుడు ఆలియా అభిమానులు అంతా కూడా రణబీర్‌ కపూర్‌తో ఆమె కలిసి నటించిన 'లవ్ & వార్’ సినిమాపై ఉంది అనడంలో సందేహం లేదు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాతో సంజయ్‌ లీలా భన్సాలీ ఆలియా భట్‌ ను పవర్‌ బాంబ్‌ పాత్రతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.




'లవ్ & వార్’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద...

ఇటీవలే 'లవ్ & వార్’ సినిమాలోని రణబీర్‌ కపూర్‌ పాత్రను రివీల్‌ చేయడం జరిగింది. స్టైలిష్ లుక్‌లో, ఈ మధ్య కాలంలో రణబీర్‌ కపూర్‌ను చూడని లుక్‌లో సంజయ్‌ లీలా భన్సాలీ చూపించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ చూస్తే అనిపిస్తుంది. కారులో వెళ్తూ, చేతికి బుల్లెట్‌ గాయంతో ఉన్న స్టిల్‌తో రణబీర్‌ కపూర్ సర్‌ప్రైజ్‌ చేశాడు. రణబీర్‌ కపూర్‌ పోస్టర్‌ తో సినిమాపై జనాల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా ఆలియా భట్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను షేర్‌ చేయడం ద్వారా సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లాయి అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో ఏ సినిమాకు రాని బజ్‌ ఈ సినిమాకు క్రియేట్‌ అయ్యే విధంగా రణబీర్ కపూర్‌, ఆలియా భట్‌ల ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆలియా భట్‌ బోల్డ్‌ లుక్‌తో పాటు, పవర్‌ ప్యాక్‌ అన్నట్లుగా బాడీ లాంగ్వేజ్‌తో సర్‌ప్రైజింగ్‌గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రణబీర్‌ కపూర్‌, ఆలియా భట్‌...

ఆలియా భట్‌ తల్లి అయిన తర్వాత సినిమాల స్పీడ్‌ తగ్గించిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా వరుస సినిమాలు చేయాలని అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా పదే పదే కోరుతున్నారు. సౌత్‌ నుంచి కూడా ఆలియా భట్‌ కు ఆఫర్లు తలుపు తడుతున్నాయని, కానీ ఆమె ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా సినిమాల ఎంపిక విషయంలో ఆలియా మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే సినిమాల సంఖ్య తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలియా భట్‌ కచ్చితంగా మళ్లీ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. 'లవ్ & వార్’ సినిమా తర్వాత ఆలియా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్‌ అవుతుందా అనేది చూడాలి.

సంజయ్‌ లీలా భన్సాలీ మూవీ...

'లవ్ & వార్’ సినిమా విషయానికి వస్తే సంజయ్‌ లీలా భన్సాలీ మార్క్‌ మూవీగా చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో పాటు ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాల్సినంత ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సాధారణంగానే సంజయ్‌ లీలా భన్సాలీ మూవీ అంటే నిండుగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు హీరోల మూవీ కావడంతో మరింత కన్నుల పండుగ అన్నట్లుగా ఉంటుందనే విశ్వాసంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో కమర్షియల్‌ హిట్స్ సంఖ్య చాలా తక్కువ అవుతున్న సమయంలో సంజయ్ లీలా భన్సాలీ నుంచి రాబోతున్న మూవీ పై అందరి అంచనాలు ఉన్నాయి.

ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ డ్రామా సినిమాను స్వయంగా భన్సాలీ నిర్మిస్తున్నాడు. జియో స్టూడియోస్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ 1960 కాలంలో నడుస్తుందని అంటున్నారు. అయితే ఆలియా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లోని ఆమె లుక్‌, బ్యాక్‌ డ్రాప్‌ మాత్రం విభిన్నంగా ఉంది. దాంతో సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సస్పెన్స్‌కు తెర పడాలి అంటే జనవరి 21, 2027 వరకు వెయిట్‌ చేయాల్సిందే. ఆ రోజున హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడం, మలయాళంతో పాటు పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags:    

Similar News