ఒక కథ తెర మీదకి రావడానికి దర్శకుడు ఎందరిని దాటుకొని రావాలో తెలుసా...
స్క్రీన్ మీద ప్రేక్షకుడు ఒక సినిమాను చూస్తున్నాడు అంటే ఆ సినిమా తెర మీదకి రావడానికి ఆ దర్శకుడు ఎంతలా కష్టపడ్డాడు అనేది ఎవరికి తెలియదు.
స్క్రీన్ మీద ప్రేక్షకుడు ఒక సినిమాను చూస్తున్నాడు అంటే ఆ సినిమా తెర మీదకి రావడానికి ఆ దర్శకుడు ఎంతలా కష్టపడుతాడనేది ఎవరికి తెలియదు. నిజానికి ఒక కొత్త దర్శకుడు ఇండస్ట్రీ లో కొన్ని కష్టాలను ఎదుర్కోక తప్పదు. తను కథను రాసుకున్నప్పటి నుంచి దానిని ప్రతి ఒక్కరికి చెబుతూ వాళ్ళు చెప్పిన మార్పులు చేర్పులను అంగీకరిస్తూ వాటిని మార్చుకుంటూ స్టోరీకి ఒక షేప్ తీసుకువస్తాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ వ్యాపార విలువల కోసం అందులో కొన్ని సాంగ్స్, ఫైట్స్ యాడ్ చేయమంటాడు. కొత్త దర్శకుడిని నమ్మి ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేటప్పుడు కొన్ని విషయాల్లో తప్పకుండా తను ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. అనుభవం లేని కొత్త వాళ్ళను నమ్మి కోట్లు పెట్టినప్పుడు ఆయన అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లో తప్పు లేదు. నిజానికి మనం ఒక బిజినెస్ పెట్టుకుంటాం అంటే మన ఇంట్లో వల్లే మనల్ని నమ్మి డబ్బులు ఇవ్వరు. అలాంటిది ప్రొడ్యూసర్ మనల్ని మనం రాసుకున్న కథను ఎందుకు నమ్మాలి. ఒకవేళ నమ్మినప్పటికీ ఆయన కండిషన్స్ పెట్టడం లో తప్పు లేదు... ఇక దర్శకుడు ప్రొడ్యూసర్ ను ఒప్పించి కథ ను సెట్స్ మీదకు తీసుకెళ్లినప్పటికి హీరోలు సైతం కొన్ని డిఫరెంట్ సన్నివేశాల్లో కనిపించినప్పుడు వాళ్ల అభిమానులు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక చిన్న పాటి డౌట్ తో కొంత మంది హీరోలు అలాంటి సన్నివేశాలను మార్చమని చెబుతారు.
అలా కొత్త దర్శకుడు కొన్ని సందర్భాల్లో కథను మార్చుతూ సినిమా సోల్ చెడిపోకుండా చూసుకుంటాడు. మొత్తానికైతే ఆయనకి ఎదురయ్యే సవాళ్లను దాటుకొని సినిమాను సెట్స్ మీదకి తీసుకువచ్చిన తర్వాత కూడా చాలా విషయాల్లో దర్శకుడు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నింటిని దాటుకొని ఆయన సక్సెస్ ను సాధించి తనను తాను ప్రూవ్ చేసుకోవడమే కాకుండా ప్రొడ్యూసర్ ను కూడా లాభాల బాట పట్టించాల్సిన అవసరమైతే ఉంది...
పైన మాట్లాడుకున్నది కేవలం కొత్త దర్శకులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాత్రమే...ఇక రెండు మూడు సినిమాలను తీసి ఆల్రెడీ స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ అయిన కొంతమంది దర్శకులు సినిమా మొత్తాన్ని వాళ్ల చేతిలోకి తీసుకుంటారు. వాళ్ళు అనుకున్న బడ్జెట్ ను పెట్టించడానికి ట్రై చేస్తుంటారు. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ల ను ఫాలో అవ్వాల్సిందే. ఎందుకు ఎలా అనే దాని గురించి మనం మరో సారి మాట్లాడుకుందాం...